జనసేన అధినేత పవన్ కళ్యాణ్, ‘వైసీపీని దించుతాం.. మేమే అధికారంలోకి వస్తాం..’ అని ఇటీవల విజయనగరం జిల్లా పర్యటన సందర్భంగా చేసిన వ్యాఖ్యలు అధికార వైసీపీకి అస్సలు రుచించడంలేదు. నిజానికి, వైసీపీ కోరుకున్నదే అది. జనసేన పార్టీ ఒంటరిగా పోటీ చెయ్యాలి.. బీజేపీతో ఆ పార్టీ కలిసినా తప్పు లేదు.. కానీ, టీడీపీతో జనసేన జతకట్టకూడదన్నది వైసీపీ ఉద్దేశ్యం.
ప్రధాని నరేంద్ర మోడీ విశాఖ పర్యటనలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌తో భేటీ అవడం, టీడీపీతో పొత్తు వద్దే వద్దని జనసేనానికి మోడీ సూచించారనే ప్రచారం జరగడం తెలిసిన సంగతులే. ఇది వైసీపీ ఆశించిన విషయమే కదా.! పైగా, అలా ప్రచారం చేసింది కూడా వైసీపీనే. అలాంటప్పుడు, వైసీపీ ఎందుకు పవన్ కళ్యాణ్ మీద మితిమీరిన విమర్శలు చేయాలి.?
‘లాస్ట్ ఛాన్స్ ఇవ్వండి..’ అంటూ చంద్రబాబు కర్నూలు జిల్లాలో నినదిస్తుండగా, ఆ వ్యవహారంపై అధికార పార్టీ సెటైర్లేస్తుండడం సంగతెలా వున్నా, వైసీపీ ఆలోచనల్లో.. పవన్ కళ్యాణ్ వద్దే వద్దు.. చంద్రబాబే ముద్దు.. అన్న భావన వ్యక్తమవుతోంది. టీడీపీకి జాకీలేసే పని షురూ చేసింది అధికార వైసీపీ.
పవన్ కళ్యాణ్‌తో పంచాయితీ అయితే మామూలుగా వుండదన్నది వైసీపీకి బాగా తెలిసిన విషయం. అదే చంద్రబాబు దగ్గర అయితే వైసీపీ ఆటలు బాగా సాగుతాయి. చంద్రబాబు అధికారంలో వున్నప్పుడు, వైఎస్ జగన్ ఆస్తుల్ని జప్తు చేస్తామని టీడీపీ చెప్పింది. వైసీపీ అధికారంలోకి వచ్చాక, చంద్రబాబుని జైల్లో పెడతామని చెబుతూనే వుంది. అదీ జరగలేదు.. ఇదీ జరగడంలేదు.!
ఇంతకన్నా వైసీపీ – టీడీపీ మధ్య నడుస్తున్న రాజకీయ డ్రామాకి ఇంకేం నిదర్శనం కావాలి.? రెండు పార్టీలూ కలిసి 60-40 ఫార్ములాని పాటిస్తున్నాయి. ఎవరు అధికారంలో వుంటే వారు 60, అధికారంలో లేనోళ్ళు 40 అన్నమాట. ఈ ఇద్దరు తప్ప, మూడో వ్యక్తి ప్రజల్లోకి వెళ్ళకూడదు. వెళితే ఇద్దరికీ మండిపోతుంది.
ప్రధానంగా వైసీపీ అయితే, జనసేన విషయంలో ఒకింత గట్టిగానే ఆందోళన చెందుతోంది. ఆ జనసేనని తొక్కేయడానికి వైసీపీ, టీడీపీ సహకారం తీసుకున్నా ఆశ్చర్యపోవాల్సిన పనిలేదు. అవసరమైతే టీడీపీ అను‘కుల’ మీడియా, వైసీపీ అను‘కుల’ మీడియా ఒక్కటైపోయినా వింతేమీ వుండదు.
814610 507363An intriguing discussion is worth comment. I do feel that you ought to write read much more about this subject, it will not be considered a taboo topic but generally everyone is too couple of to communicate in on such topics. To an additional. Cheers 256682
760219 225013Generally I dont read article on blogs, but I would like to say that this write-up very compelled me to try and do so! Your writing style has been amazed me. Thanks, quite wonderful post. 538146
22082 715979As I site possessor I believe the content material here is actually superb , appreciate it for your efforts. 224936