Switch to English

వైఎస్సార్ సీపీ మేనిఫెస్టోలో వరాలజల్లు

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,421FansLike
57,764FollowersFollow

ఏపీ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ కు ఇంకా ఐదు రోజుల సమయం ఉన్న నేపథ్యంలో వైఎస్సార్ సీపీ తన ఎన్నికల మేనిఫెస్టో విడుదల చేసింది. రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజలనూ ఆకట్టుకునేలా వరాల జల్లు కురిపించింది. ఉగాది పర్వదినం సందర్భంగా గుంటూరు జిల్లా తాడేపల్లిలోని పార్టీ కార్యాలయంలో వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తమ మేనిఫెస్టోను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. రాష్ట్రంలో ఓ కొత్త అధ్యాయాన్ని మొదలుపెడుతున్నామని చెప్పారు. మేనిఫెస్టో చాలా పవిత్రమైనదని, అందులో పేర్కొన్న ప్రతి అంశాన్నీ తప్పకుండా అమలు చేస్తామని స్పష్టంచేశారు. తమ మేనిఫెస్టోను ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంచుతామని, దీన్ని చూపించిన తర్వాతే మళ్లీ 2024లో ఓట్లు అడుగుతామని జగన్ పేర్కొన్నారు.

వైఎస్సార్ సీపీ మేనిఫెస్టోలోని ముఖ్యాంశాలు…

  • రూ.5 లక్షల ఆదాయం దాటని అన్ని వర్గాల వారికి వైఎస్సార్ ఆరోగ్యశ్రీ
  • వైద్య ఖర్చు రూ.1000 దాటితే ఆరోగ్యశ్రీ కింద వైద్యం
  • ఎంత ఖర్చయినా పూర్తిగా ఆరోగ్యశ్రీ.. హైదరాబాద్, బెంగళూరు, చెన్నై.. ఇలా ఏ నగరంలో చికిత్స చేయించుకున్నా ఆరోగ్యశ్రీ వర్తింపు
  • ఆరోగ్యశ్రీ పరిధిలోకి అన్ని రకాల వ్యాధులు
  • దీర్ఘ కాలిక వ్యాధులతో బాధపడేవారికి రూ.10 వేల పింఛను
  • రైతుకు పెట్టుబడి కింద ప్రతినెలా మే నెలలో రూ.12,500 చొప్పున నాలుగేళ్లపాటు నగదు అందజేత
  • అన్నదాతలకు వడ్డీ లేని పంటరుణాలు, ఉచిత విద్యుత్‌ ఇవ్వడంతోపాటు ఉచితంగా బోర్లు వేయించే కార్యక్రమం
  • వ్యవసాయానికి పగటిపూటే 9 గంటల కరెంటు
  • రూ.3 వేల కోట్లతో ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటు
  • పంటవేసే ముందే ధరల ప్రకటన. గిట్టుబాటు ధరలకు భరోసా
  • రూ.4 వేల కోట్లతో ప్రకృతి విపత్తుల సహాయ నిధి.
  • వ్యవసాయ ట్రాక్టర్లకు రహదారి, టోల్ పన్ను రద్దు
  • వైఎస్సార్ బీమా ద్వారా రైతులకు రూ.7 లక్షల బీమా. ఆ డబ్బు అప్పుల వాళ్లకు చెందకుండా చట్టం
  • అమ్మఒడి కింద పిల్లలను బడికి పంపిన తల్లులకు రూ.15 వేలు
  • 45 ఏళ్ల వయసు గల ఎస్సీ, బీసీ, ఎస్టీ, మైనారిటీ మహిళలకు మొదటి ఏడాది తర్వాత ఆయా కార్పొరేషన్ల ద్వారా రూ.75 వేల ఆర్థిక సాయం
  • పింఛను రూ.3 వేలకు పెంపు. వికలాంగులకు రూ.3 వేలు పింఛను.
  • కుల, మతం తేడా లేకుండా అర్హులైన అందరికీ పక్కా ఇళ్లు
  • జర్నలిస్టులకు ఆయా ప్రాంతాల్లో ఇళ్ల స్థలాలు
  • పోలవరం, వెలిగొండ సహా అన్ని ప్రాజెక్టులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి
  • ఉద్యోగాల భర్తీకి క్యాలెండర్‌ విడుదల
  • ఉద్యోగాలు స్థానికులకే ఇచ్చేలా బిల్లు
  • మద్యనిషేధం. మద్యం 5 నక్షత్రాల హోటళ్లకు మాత్రమే పరిమితం.
  • అగ్రిగోల్డ్‌ బాధితులకు రూ.1150 కోట్లు కేటాయింపు.
  • తిరుమలలో యాదవులు గుడి తలుపులు తెరిచే సంప్రదాయం పునరుద్ధరణ
  • మాదిగ, రెల్లి, మాలలకు కార్పొరేషన్‌ ఏర్పాటు
  • ఎస్సీ, ఎస్టీల యువతుల పెళ్లికి రూ.లక్ష
  • బీసీల అభ్యున్నతికి ఏటా రూ.15 వేల కోట్ల ఖర్చు.
  • బీసీ యువతులకు పెళ్లి కానుక రూ.55 వేలకు పెంపు
  • కాపు కార్పొరేషన్‌కు ఏడాదికి రూ.2 వేల చొప్పున పదేళ్లలో రూ.10 వేల కోట్ల కేటాయింపు
  • ముస్లిం, మైనారిటీ యువతులకు పెళ్లికి రూ.లక్ష
  • పోలీస్‌లకు వారాంతపు సెలవు అమలు
  • అంగన్ వాడీ, ఆశావర్కర్లు, హోంగార్డులకు తెలంగాణ ప్రభుత్వం కంటే రూ.1000 ఎక్కువ వేతనం
  • ప్రభుత్వ ఉద్యోగులకు సీపీఎస్ విధారం రద్దు
  • ప్రభుత్వ ఉద్యోగులకు వారివారి ప్రాంతాల్లో నివాస స్థలాలు
  • అగ్రకులాలకు కూడా కార్పొరేషన్లు ఏర్పాటు

7 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

SSMB 29: మహేశ్-రాజమౌళి సినిమాలో మరో స్టార్ హీరో..! నిజమెంత..!?

SSMB 29: సూపర్ స్టార్ మహేశ్ (Mahesh) – రాజమౌళి (Rajamouli) కాంబినేషన్లో ఓ భారీ సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. సినిమా ప్రకటించినప్పటి నుంచీ...

Silk Saree: మే24న వస్తున్న రొమాంటిక్ లవ్ స్టోరీ.. ‘సిల్క్ శారీ’

Silk Saree: వాసుదేవ్ రావు, రీవా చౌదరి, ప్రీతి గోస్వామి హీరో హీరోయిన్లుగా టి. నాగేందర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా "సిల్క్ శారీ" (Silk Saree)....

Jr Ntr: స్థల వివాదంలో జూ.ఎన్టీఆర్..! వార్తలపై క్లారిటీ ఇచ్చిన హీరో...

Jr Ntr: ఓ స్థలం వివాదం విషయమై హీరో ఎన్టీఆర్ హైకోర్టుని ఆశ్రయించారంటూ సోషల్ మీడియాలో ఈరోజు పలు వార్తలు హల్ చల్ చేశాయి. అయితే.....

Prabhas: ఎవరా కొత్త వ్యక్తి..? సెన్సేషన్ క్రియేట్ చేస్తోన్న ప్రభాస్ పోస్ట్

Prabhas: చాలా తక్కువగా సోషల్ మీడియాలో యాక్టివ్ అయ్యే స్టార్ హీరో ప్రభాస్ చేసిన ఇన్ స్టా పోస్ట్ ప్రస్తుతం నెట్టింట విపరీతంగా వైరల్ అవుతోంది....

నాగబాబు ట్విట్టర్ హ్యాండిల్ మాయం.! అల్లు అర్జున్ ఆర్మీ ఎఫెక్టేనా.?

బాబోయ్ బూతులు.. ఇవి మామూలు బూతులు కావు.! బండ బూతులు.! సినీ అభిమానులంటే, అత్యంత జుగుప్సాకరంగా ప్రవర్తించాలా.? సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్ వార్స్ చేసుకోవడం...

రాజకీయం

జనసేన మీద వైసీపీ నేతలు బెట్టింగ్ కాస్తున్నారా.?

ఇదో ఇంట్రెస్టింగ్ పరిణామం.! అదీ, ఉభయ గోదావరి జిల్లాల్లో చోటు చేసుకుంటున్న వైపరీత్యం.! జనసేన పార్టీ గెలుస్తుందని వైసీపీ నేత ఒకరు భారీ స్థాయిలో డబ్బులు పందెం కాశారట. వేలల్లో అయితే వింతేమీ...

నాగబాబు ఈజ్ బ్యాక్.! ట్వీటుని తొలగించిన వైనం.!

సినీ నటుడు, జనసేన నేత కొణిదెల నాగబాబు ట్విట్టర్ అకౌంట్ నుంచి ఓ ట్వీటు పడింది. ‘మాతో వుంటూ ప్రత్యర్థులకి పని చేసేవాడు మా వాడైనా పరాయివాడే, మాతో నిలబడేవాడు పరాయివాడైనా మావాడే..’...

ఐదేళ్ళుగా సినీ పరిశ్రమను దోచేశాం: వైసీపీ అను‘కుల’ మీడియా.!

ఐదేళ్ళపాటు అధికారంలో వున్నాం.. అందినకాడికి సినీ పరిశ్రమని అడ్డగోలుగా దోచేసుకున్నాం.! ఇదీ వైసీపీ అను‘కుల’ మీడియా చెబుతున్నమాట.! ఆంధ్ర ప్రదేశ్‌లో ఐదేళ్ళపాటు అధికారం వెలగబెట్టిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, తన చెప్పు చేతల్లో...

గ్రౌండ్ రిపోర్ట్: సంక్షేమ పథకాలు ఓట్లను రాల్చుతాయా.?

ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌కి ముందూ, పోలింగ్ తర్వాతా.. అధికార వైసీపీ, ‘సంక్షేమ పథకాలే మమ్మల్ని గెలిపిస్తాయ్..’ అని చెబుతుండడం చూస్తున్నాం. సంక్షేమం పేరుతో ఓటు బ్యాంకు రాజకీయాలు చేయడం అనేది...

PM Modi: ‘మీరు చెప్పింది నిజమే..’ రష్మిక పోస్టుకు ప్రధాని మోదీ స్పందన..

PM Modi: ముంబైలో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన ‘ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్’ (MTHL)పై నటి రష్మిక (Rashmika) ప్రయాణించి సోషల్ మీడియాలో తన అనుభూతిని పంచుకున్నారు. దీనిపై ప్రధాని మోదీ (PM Modi)...

ఎక్కువ చదివినవి

Jr Ntr: స్థల వివాదంలో జూ.ఎన్టీఆర్..! వార్తలపై క్లారిటీ ఇచ్చిన హీరో టీమ్

Jr Ntr: ఓ స్థలం వివాదం విషయమై హీరో ఎన్టీఆర్ హైకోర్టుని ఆశ్రయించారంటూ సోషల్ మీడియాలో ఈరోజు పలు వార్తలు హల్ చల్ చేశాయి. అయితే.. దీనిపై ఎన్టీఆర్ టీమ్ స్పందించింది. ప్రస్తుతం...

ఐదేళ్ళుగా సినీ పరిశ్రమను దోచేశాం: వైసీపీ అను‘కుల’ మీడియా.!

ఐదేళ్ళపాటు అధికారంలో వున్నాం.. అందినకాడికి సినీ పరిశ్రమని అడ్డగోలుగా దోచేసుకున్నాం.! ఇదీ వైసీపీ అను‘కుల’ మీడియా చెబుతున్నమాట.! ఆంధ్ర ప్రదేశ్‌లో ఐదేళ్ళపాటు అధికారం వెలగబెట్టిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, తన చెప్పు చేతల్లో...

నాగబాబు ఈజ్ బ్యాక్.! ట్వీటుని తొలగించిన వైనం.!

సినీ నటుడు, జనసేన నేత కొణిదెల నాగబాబు ట్విట్టర్ అకౌంట్ నుంచి ఓ ట్వీటు పడింది. ‘మాతో వుంటూ ప్రత్యర్థులకి పని చేసేవాడు మా వాడైనా పరాయివాడే, మాతో నిలబడేవాడు పరాయివాడైనా మావాడే..’...

ఎమ్మెల్యే చెంప పగలగొట్టిన సామాన్యుడికి ‘కులాన్ని’ ఆపాదిస్తారా.?

ఎమ్మెల్యేని ఓ సామాన్యుడు దూషించాడట.! దాంతో, ఎమ్మెల్యేకి కోపమొచ్చిందట. అయినాగానీ, శాంతంగానే వున్నాడట ఆయన. సదరు సామాన్యుడే, కులోన్మాదంతో సదరు ఎమ్మెల్యే చెంప పగలగొట్టేశాడట. తీవ్రంగా దాడి చేశాడట. దాడిలో గాయపడి ఆసుపత్రి పాలయ్యింది...

జనసేన మీద వైసీపీ నేతలు బెట్టింగ్ కాస్తున్నారా.?

ఇదో ఇంట్రెస్టింగ్ పరిణామం.! అదీ, ఉభయ గోదావరి జిల్లాల్లో చోటు చేసుకుంటున్న వైపరీత్యం.! జనసేన పార్టీ గెలుస్తుందని వైసీపీ నేత ఒకరు భారీ స్థాయిలో డబ్బులు పందెం కాశారట. వేలల్లో అయితే వింతేమీ...