Switch to English

కవితకు ఎదురుగాలి.. అందుకే!

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,418FansLike
57,764FollowersFollow

తెలంగాణలో 16సీట్లు ఖాయమని టీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ ఢంకాబజాయించి మరీ చెబుతున్నారు. 16 గెలిచి ఢిల్లీలో చక్రం తిప్పుతామని అన్ని ప్రచారసభల్లో ధీమా వ్యక్తం చేస్తున్నారు. పైకి చెబుతున్నా.. పార్టీకి పట్టుందని భావిస్తున్న కొన్నిచోట్ల ఎదురుగాలి ఉందనే విషయం కేసీఆర్‌కు అర్థమైంది. క్షేత్రస్థాయి పరిస్థితి ఆయన అంచనాలకన్నా దారుణంగా ఉందని బోధపడింది.

టీఆర్‌ఎస్‌ పార్టీకి అత్యంత కీలక స్థానమైన నిజామాబాద్‌లోనే టీఆర్‌ఎస్‌కు అనుకూల పరిస్థితి లేదు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ కూతురు కవిత నిజామాబాద్‌ నుంచి సిట్టింగ్‌ ఎంపీగా బరిలో ఉన్నారు. అందుకే ఇప్పుడు ఇందూరు తెలంగాణలోని హాట్‌సీట్లలో ఒకటి. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో ఇందూరు జిల్లా అంతటా టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు ఘనవిజయం సాధించడంతో కవిత విజయం నల్లేరుమీద నడకే అనుకున్నారు. కానీ రైతులు భారీసంఖ్యలో నామినేషన్లు వేయడంతో కేసీఆర్‌కు ఎక్కడో చెడుసంకేతాలు అందాయి.

నిజామాబాద్‌లో కవిత గెలవడం.. ఆమెకు, కేసీఆర్‌కు అత్యంత అవసరం. మిగిలిన 15సీట్లు గెలిచి కవిత ఓడినా కేసీఆర్‌ ఓడినట్లే. దేశ, రాష్ట్ర రాజకీయాల్లో తన ప్రతిష్ట మసకబారకుండా ఉండాలనే ఇక్కడ గెలవడం కవితకు తప్పనిసరి. పోలింగ్‌ దగ్గరపడుతున్న కొద్దీ టీఆర్‌ఎస్‌ అభ్యర్థికి పరిస్థితి ప్రతికూలంగా మారుతోంది. అందుకే బిడ్డను గెలిపించుకునేందుకు నేరుగా కేసీఆర్‌ రంగంలోకి దిగారు.

ఇప్పటికీ టీడీపీ స్పష్టమైన ఓటుబ్యాంకున్న ఇందూరులో ఆ పార్టీ కేడర్‌పై కన్నేశారు. ఇందులో భాగంగానే.. రైతు ఓటర్లు ఎక్కువగా ఉన్న నిజామాబాద్‌ జిల్లాలో బలమైన రైతు నేత మండవ వెంకటేశ్వరరావును పార్టీలో చేర్చుకునేందుకు సిద్ధమయ్యారు. అన్ని పార్టీల నేతలు.. వారికి వారే ప్రగతిభవన్‌కో.. టీఆర్‌ఎస్‌ భవన్‌కో వచ్చి పార్టీలో చేరుతుంటే.. కేసీఆర్‌ మాత్రం కూతురి విజయం కోసం తనే స్వయంగా జూబ్లీహిల్స్‌లోని మండవ ఇంటికెళ్లి మరీ మాట్లాడారు. ఆయన్ను పార్టీలోకి ఆహ్వానించారు.

నిజామాబాద్‌ జిల్లాలో గ్రామీణ నియోజకవర్గమైన డిచ్‌పల్లి నుంచి మండవ నాలుగుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. ఓసారి అర్బన్‌ ప్రాంతమైన నిజామాబాద్‌ టౌన్‌ నుంచి గెలిచారు. చంద్రబాబు ప్రభుత్వంలో మంత్రిగా పనిచేసిన మండవకు.. జిల్లాలో రైతు సంఘాలు, గ్రామీణ ప్రాంతాలపై పట్టుంది. ఇదే ఇప్పుడు తమకు సంజీవనిలా మారుతుందనేది కేసీఆర్‌ వ్యూహం. అందుకే ఇన్నాళ్లుగా మండవవైపు కన్నెత్తి చూడని కేసీఆర్‌ ఇప్పుడు ఏకంగా ఇంటికెళ్లి మరీ ఆహ్వానించారు.

కేసీఆర్‌ స్వయంగా ఆహ్వానించడంతో.. టీఆర్‌ఎస్‌లోకి చేరేందుకు మండవ వెంకటేశ్వర్‌రావు సిద్ధమయ్యారు. ఒకట్రెండురోజుల్లో అధికారికంగా చేరనున్నారు. టీడీపీకి తెలంగాణలో ముఖ్యనేతగా ఉన్న మండవ వెంకటేశ్వర్‌రావు టీఆర్‌ఎస్‌లో చేరుతుండడంతో నిజామాబాద్‌ లోక్‌సభ సెగ్మెంట్‌లో అధికార పార్టీకి బలం పెరగనుందనే అంచనాల్నునాయి.

శుక్రవారం ఉదయం.. టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు మాగంటి గోపినాథ్, పువ్వాడ అజయ్‌కుమార్‌ మండవ వెంకటేశ్వర్‌రావు ఇంటికి వెళ్లి ఆయనతో చర్చలు జరిపారు. టీఆర్‌ఎస్‌లో చేరేందుకు మండవ వెంకటేశ్వర్‌రావు సుముఖత వ్యక్తం చేయడంతో.. కేసీఆర్‌ స్వయంగా ఆయన ఇంటికి వెళ్లారు. పార్టీ ఆవిర్భావం తర్వాత తొలిసారి తెలంగాణలోని ఎన్నికలలో టీడీపీ పోటీ చేయడంలేదు.

ఈ నేపథ్యంలో టీడీపీకి చెందిన కేడర్‌పై టీఆర్‌ఎస్‌ అధిష్టానం దృష్టి పెట్టింది. టీడీపీకి చెందిన అన్ని స్థాయిల్లోని నేతలను పార్టీలోకి తీసుకోవడంతోపాటు మిగిలున్న కేడర్‌ మద్దతు పొందేలా వ్యూహరచన చేసింది. మండవ రాక టీఆర్‌ఎస్‌కు కలిసొస్తుందా.. లేక ఔట్‌డేటెడ్‌ రాజకీయ నాయకుడైన మండవ సూచనను ప్రజలు పక్కనపెట్టేస్తారా అనేది మే 23వరకు చెప్పలేం.

6 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Hema: ‘నన్ను ఇందులోకి లాగొద్దు..’ బెంగళూరు రేవ్ పార్టీపై నటి హేమ

Hema: బెంగళూరు (Bengaluru) నగర శివారులోని ఎలక్ట్రానిక్ సిటీ సమీపంలో జరిగిన రేవ్ పార్టీ కలకలం రేపుతోంది. ఓ ఫామ్ హౌస్ లో జరిగినట్టుగా వార్తలు...

Jr.Ntr Birthday special: యాక్టింగ్ డైనమైట్.. అభిమానుల సంబరం.. ‘జూ.ఎన్టీఆర్’..

Jr.Ntr Birthday special: బాల నటుడిగానే అద్భుతమైన ప్రతిభ.. యుక్త వయసులోనే హీరో.. తక్కువ సమయంలోనే స్టార్ స్టేటస్.. నటనలో డైనమైట్.. డ్యాన్స్ లో స్పీడ్.....

Jr.Ntr Birthday special: టెక్నీషియన్స్ ఫేవరెట్.. జూ.ఎన్టీఆర్..! ఉదాహరణలివే..

Jr.Ntr Birthday special: తెలుగు సినీ పరిశ్రమలో ఘనమైన కుటుంబ నేపథ్యం ఉన్న కుటుంబాల్లో ఒకటి నందమూరి. విశ్వవిఖ్యాత నట సార్వభౌమ ఎన్టీఆర్ మనవడిగా.. హరికృష్ణ...

చిరంజీవి, కమల్ హాసన్.! ఎవరు గొప్ప నటుడు.?

సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్ వార్స్, ట్రోలింగ్.. ఇవేవీ లేకపోతే, చాలామంది అనాధలైపోతారు.! అనాధలైపోవడమంటే, ఎవరూ పట్టించుకోకుండా పోతారని అర్థం. ఈ లిస్టులో కొందరు సెలబ్రిటీలనబడేవారు...

Prabhas: ప్రభాస్ చెప్పిన బుజ్జి ఇదే.. ఉత్కంఠ రేకెత్తిస్తున్న వీడియో

Prabhas: స్టార్ హీరో ప్రభాస్ (Prabhas) ఇటివల ‘హాయ్.. డార్లింగ్స్. నా లైఫ్ లోకి కొత్తగా ఒకరు వస్తున్నారు. వెయిట్ చేయండి’ అనే పోస్ట్ బాగా...

రాజకీయం

కింగ్ మేకర్ జనసేనాని: వైసీపీ అంతర్గత సర్వేల్లో ఇదే తేలిందా.?

టీడీపీ - వైసీపీకి సమానంగా సీట్లు రావొచ్చు. జనసేన పార్టీకి తక్కువలో తక్కువ పన్నెండు సీట్లు వస్తాయ్.! రెండు ఎంపీ సీట్లు కూడా జనసేన గెలుచుకోబోతోంది. ఈ పరిస్థితుల్లో జనసేన అధినేత పవన్...

ఓటు అమ్ముకున్న పోలీస్.! వింతేముంది.?

దొరికేదాకా దొరలే.! దొరికితేనే దొంగ.! ఓ పోలీస్ అధికారి ఓటుని అమ్ముకుని, సస్పెండ్ అయ్యాడు.! ఏంటీ, భారతదేశంలో ఓటుని అమ్ముకోవడం నేరమా.? మరి, కొనుక్కుంటున్న రాజకీయ పార్టీలు, రాజకీయ నాయకుల సంగతేంటి.? ఎమ్మెల్యే టిక్కెట్...

జగన్, చంద్రబాబు.. విదేశీ ‘రాజకీయ’ పర్యటనల వెనుక.!

వైఎస్ జగన్ మోహన్ రెడ్డి లండన్ వెళ్ళారు. నారా చంద్రబాబునాయుడు విదేశాలకు వెళ్ళనున్నారు. పవన్ కళ్యాణ్ కూడా విదేశాలకు వెళ్ళే అవకాశం వుందట. విదేశాలకు వెళితే తప్పేముంది.? ఒకరు విదేశాలకు వెళితే, పారిపోయినట్టు...

వంగా గీత మెగాభిమానం.! నిజమేనా.? నమ్మొచ్చా.?

మెగాస్టార్ చిరంజీవి అన్నయ్య అంటే, నాకు అమితమైన అభిమానం. చిరంజీవి తమ్ముడిగా పవన్ కళ్యాణ్ అన్నా కూడా అభిమానమే. నాగబాబు అంటే కూడా అంతే గౌరవం.! ఈ మాటలు అన్నదెవరో కాదు, కాకినాడ ఎంపీ...

కోటి రూపాయలు కొల్లగొట్టిన మహిళా ఎర్నలిస్ట్ ఎవరు.?

ఎన్నికల సమయంలో ఓ మహిలా ఎర్నలిస్టు, ఏకంగా కోటి రూపాయలు కొల్లగొట్టిందట.! ఆంధ్ర ప్రదేశ్ రాజకీయాల్లో ఇప్పుడు ఇదో హాట్ టాపిక్.! ఎవరా మహిళా ఎర్నలిస్ట్.? ఏమా కథ.? అధికార వైసీపీకి అత్యంత...

ఎక్కువ చదివినవి

Indian 2 : మరో ఇండియన్‌ సర్‌ప్రైజ్‌ చేయనున్నాడా?

Indian 2 : యూనివర్శిల్‌ స్టార్‌ కమల్‌ హాసన్‌ హీరోగా శంకర్ దర్శకత్వంలో వచ్చిన భారతీయుడు సినిమాకు సీక్వెల్‌ రూపొందుతుంది. పాన్ ఇండియా రేంజ్ లో ఇండియన్‌ 2 ను విడుదల చేయబోతున్నారు....

జనసేన మీద వైసీపీ నేతలు బెట్టింగ్ కాస్తున్నారా.?

ఇదో ఇంట్రెస్టింగ్ పరిణామం.! అదీ, ఉభయ గోదావరి జిల్లాల్లో చోటు చేసుకుంటున్న వైపరీత్యం.! జనసేన పార్టీ గెలుస్తుందని వైసీపీ నేత ఒకరు భారీ స్థాయిలో డబ్బులు పందెం కాశారట. వేలల్లో అయితే వింతేమీ...

ఓటు అమ్ముకున్న పోలీస్.! వింతేముంది.?

దొరికేదాకా దొరలే.! దొరికితేనే దొంగ.! ఓ పోలీస్ అధికారి ఓటుని అమ్ముకుని, సస్పెండ్ అయ్యాడు.! ఏంటీ, భారతదేశంలో ఓటుని అమ్ముకోవడం నేరమా.? మరి, కొనుక్కుంటున్న రాజకీయ పార్టీలు, రాజకీయ నాయకుల సంగతేంటి.? ఎమ్మెల్యే టిక్కెట్...

హింస, అశాంతి.! ఇది వైసీపీ మార్కు రాజకీయం.!

రాష్ట్రంలో ప్రశాతంగా ఎన్నికల పోలింగ్ ముగిసింది. మరీ ప్రశాంతంగా కాదుగానీ, ఫర్లేదు.! వైసీపీ ఓటమి ఖాయమని పోలింగ్‌కి ముందే సంకేతాలు రావడంతో, కొన్ని చోట్ల హింసకు తెరలేపాయి వైసీపీ శ్రేణులు. బీసీ, మైనార్టీలు, ఎస్సీ,...

Prabhas: ప్రభాస్ చెప్పిన బుజ్జి ఇదే.. ఉత్కంఠ రేకెత్తిస్తున్న వీడియో

Prabhas: స్టార్ హీరో ప్రభాస్ (Prabhas) ఇటివల ‘హాయ్.. డార్లింగ్స్. నా లైఫ్ లోకి కొత్తగా ఒకరు వస్తున్నారు. వెయిట్ చేయండి’ అనే పోస్ట్ బాగా వైరల్ అయింది. ప్రభాస్ పెళ్లి గురించే...