Switch to English

YSRCP: అమరావతిపై వైసీపీ ఆశలు నీరుగారిపోతున్నాయ్.!

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,418FansLike
57,764FollowersFollow

YSRCP: కొత్త సంవత్సరంలో విశాఖ నుంచే పాలన.. ఈ మాట చెప్పీ చెప్పీ.. వైసీపీ నేతలకే బోర్ కొట్టేస్తోంది. ఇంగ్లీషు సంవత్సరం పోయి, తెలుగు సంవత్సరం మాట బుకాయించినా.. దసరా, దీపావళి, సంక్రాంతి.. ఇలా పండగల పేర్లు చెప్పి పబ్బం గడుపుకుంటున్నా.. ప్రతిసారీ అదే దెబ్బ.!

ఆంధ్రప్రదేశ్ రాజధానిని అమరావతి నుంచి విశాఖకు తీసుకెళ్ళిపోవడానికి వైసీపీ ఎన్నెన్నో వ్యూహాలు రచిస్తోంది. ప్రతి వ్యూహమూ బెడిసికొట్టేస్తోంది. గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ నేపథ్యంలో ‘విశాఖే రాజధాని..’ అని సంకేతాల్ని వైసీపీ పంపింది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కూడా, ‘నేనూ విశాఖకు వచ్చేస్తున్నా..’ అని చెప్పారు.

కానీ, సర్వోన్నత న్యాయస్థానంలో మాత్రం వైసీపీ సర్కారుకి చుక్కెదురవుతూనే వుంది. రాష్ట్ర రాజధానికి సంబంధించి హైకోర్టు పలు కేసుల్లో ఇచ్చిన స్టే ఎత్తివేయాలని కోరుతూ సుప్రీంకోర్టుని రాష్ట్ర ప్రభుత్వం ఆశ్రయించిన సంగతి తెలిసిందే. ఈ కేసులో ఈరోజు తమకు ఊరట లభిస్తుందని వైసీపీ చాలా చాలా ఆశలు పెట్టుకుంది.

షరామామూలుగానే వైసీపీకి షాక్ తగిలింది. రాష్ట్ర ప్రభుత్వం అభ్యర్థనను సుప్రీంకోర్టు లైట్ తీసుకుంది. కేసు విచారణను జులైకి వాయిదా వేసింది. హైకోర్టు స్టేలను ఎత్తివేయాలంటూ రాష్ట్ర ప్రభుత్వం తరఫు న్యాయవాదులు ఎంతలా విజ్ఞప్తి చేసినా సర్వోన్నత న్యాయస్థానం, సానుకూలంగా స్పందించలేదు.

ఈ కేసుకు సంబంధించి ప్రతివాదులు ఎక్కువమంది వున్నారనీ, వారందరి వాదనలూ పూర్తిగా వినాల్సి వుందని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. చంద్రబాబు హయాంలో విభజన చట్టం ప్రకారం ఏర్పాటైన రాజధాని కమిటీ సూచించిన సూచనల నేపథ్యంలో రాష్ట్రానికి అమరావతి రాజధాని అయ్యింది.

అమరావతి నుంచి రాజధానిని తరలించాలంటే, విభజన చట్టం ప్రధాన అడ్డంకి.. అనే వాదన న్యాయ నిపుణుల నుంచి వినిపిస్తోంది. ఇంకోపక్క రాజధాని కోసం భూములిచ్చిన రైతులతో జరిగిన ఒప్పందాలూ రాజధాని మార్పుకి ప్రతిబంధకంగా మారుతున్నాయి. ఇవన్నీ తెలిసీ, న్యాయ పోరాటం పేరుతో ప్రజాధనాన్ని వైసీపీ సర్కారు వృధా చేస్తున్న వైనం అందర్నీ విస్మయానికి గురిచేస్తోంది.

5 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Hema: ‘నన్ను ఇందులోకి లాగొద్దు..’ బెంగళూరు రేవ్ పార్టీపై నటి హేమ

Hema: బెంగళూరు (Bengaluru) నగర శివారులోని ఎలక్ట్రానిక్ సిటీ సమీపంలో జరిగిన రేవ్ పార్టీ కలకలం రేపుతోంది. ఓ ఫామ్ హౌస్ లో జరిగినట్టుగా వార్తలు...

Jr.Ntr Birthday special: యాక్టింగ్ డైనమైట్.. అభిమానుల సంబరం.. ‘జూ.ఎన్టీఆర్’..

Jr.Ntr Birthday special: బాల నటుడిగానే అద్భుతమైన ప్రతిభ.. యుక్త వయసులోనే హీరో.. తక్కువ సమయంలోనే స్టార్ స్టేటస్.. నటనలో డైనమైట్.. డ్యాన్స్ లో స్పీడ్.....

Jr.Ntr Birthday special: టెక్నీషియన్స్ ఫేవరెట్.. జూ.ఎన్టీఆర్..! ఉదాహరణలివే..

Jr.Ntr Birthday special: తెలుగు సినీ పరిశ్రమలో ఘనమైన కుటుంబ నేపథ్యం ఉన్న కుటుంబాల్లో ఒకటి నందమూరి. విశ్వవిఖ్యాత నట సార్వభౌమ ఎన్టీఆర్ మనవడిగా.. హరికృష్ణ...

చిరంజీవి, కమల్ హాసన్.! ఎవరు గొప్ప నటుడు.?

సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్ వార్స్, ట్రోలింగ్.. ఇవేవీ లేకపోతే, చాలామంది అనాధలైపోతారు.! అనాధలైపోవడమంటే, ఎవరూ పట్టించుకోకుండా పోతారని అర్థం. ఈ లిస్టులో కొందరు సెలబ్రిటీలనబడేవారు...

Prabhas: ప్రభాస్ చెప్పిన బుజ్జి ఇదే.. ఉత్కంఠ రేకెత్తిస్తున్న వీడియో

Prabhas: స్టార్ హీరో ప్రభాస్ (Prabhas) ఇటివల ‘హాయ్.. డార్లింగ్స్. నా లైఫ్ లోకి కొత్తగా ఒకరు వస్తున్నారు. వెయిట్ చేయండి’ అనే పోస్ట్ బాగా...

రాజకీయం

జగన్, చంద్రబాబు.. విదేశీ ‘రాజకీయ’ పర్యటనల వెనుక.!

వైఎస్ జగన్ మోహన్ రెడ్డి లండన్ వెళ్ళారు. నారా చంద్రబాబునాయుడు విదేశాలకు వెళ్ళనున్నారు. పవన్ కళ్యాణ్ కూడా విదేశాలకు వెళ్ళే అవకాశం వుందట. విదేశాలకు వెళితే తప్పేముంది.? ఒకరు విదేశాలకు వెళితే, పారిపోయినట్టు...

వంగా గీత మెగాభిమానం.! నిజమేనా.? నమ్మొచ్చా.?

మెగాస్టార్ చిరంజీవి అన్నయ్య అంటే, నాకు అమితమైన అభిమానం. చిరంజీవి తమ్ముడిగా పవన్ కళ్యాణ్ అన్నా కూడా అభిమానమే. నాగబాబు అంటే కూడా అంతే గౌరవం.! ఈ మాటలు అన్నదెవరో కాదు, కాకినాడ ఎంపీ...

కోటి రూపాయలు కొల్లగొట్టిన మహిళా ఎర్నలిస్ట్ ఎవరు.?

ఎన్నికల సమయంలో ఓ మహిలా ఎర్నలిస్టు, ఏకంగా కోటి రూపాయలు కొల్లగొట్టిందట.! ఆంధ్ర ప్రదేశ్ రాజకీయాల్లో ఇప్పుడు ఇదో హాట్ టాపిక్.! ఎవరా మహిళా ఎర్నలిస్ట్.? ఏమా కథ.? అధికార వైసీపీకి అత్యంత...

వై నాట్ 175.! వైసీపీ సరే, టీడీపీ లెక్కలేంటి.?

‘మేం వై నాట్ 175 అనే మాటకే కట్టుబడి వున్నాం. ఇంతకీ, టీడీపీ లెక్క ఎంత.?’ ఈ మాట వైసీపీ గట్టిగానే అంటోంది. తెలుగు దేశం పార్టీని ప్రశ్నిస్తోంది. టీడీపీ జాతీయ ప్రధాన...

కాంగ్రెస్ గెలవాలని వైసీపీ కోరుకుంటోందా.?

రాజకీయాల్లో శాశ్వత శతృవులు శాశ్వత మిత్రులు ఎవరూ వుండరన్నది అందరికీ తెలిసిన విషయమే.! ఆ సూత్రాన్ని వైసీపీ కూడా పాటించక తప్పేలా లేదా.? అంటే, ఔననే వాదన వినిపిస్తోందిప్పుడు.! అసలు విషయమేంటంటే, ఆంధ్ర ప్రదేశ్...

ఎక్కువ చదివినవి

నాగబాబు ట్విట్టర్ హ్యాండిల్ మాయం.! అల్లు అర్జున్ ఆర్మీ ఎఫెక్టేనా.?

బాబోయ్ బూతులు.. ఇవి మామూలు బూతులు కావు.! బండ బూతులు.! సినీ అభిమానులంటే, అత్యంత జుగుప్సాకరంగా ప్రవర్తించాలా.? సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్ వార్స్ చేసుకోవడం తప్ప, సదరు అభిమానులకి వేరే పనే...

క్రాస్ ఓటింగ్ లేదు, గ్లాస్ ఓటింగే.!

పిఠాపురం, కాకినాడ.. ఈ రెండు పేర్లూ మార్మోగిపోతున్నాయి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో. తెలంగాణలోనూ, ఈ రెండు పేర్ల చుట్టూ బోల్డంత చర్చ జరుగుతోంది. ఒకటేమో, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేసిన...

నాగబాబు ఈజ్ బ్యాక్.! ట్వీటుని తొలగించిన వైనం.!

సినీ నటుడు, జనసేన నేత కొణిదెల నాగబాబు ట్విట్టర్ అకౌంట్ నుంచి ఓ ట్వీటు పడింది. ‘మాతో వుంటూ ప్రత్యర్థులకి పని చేసేవాడు మా వాడైనా పరాయివాడే, మాతో నిలబడేవాడు పరాయివాడైనా మావాడే..’...

బాబూ.. రాంబాబూ.! రీపోలింగ్ కావాలా.?

మంత్రి అంబటి రాంబాబుకి రీ-పోలింగ్ కావాలట.! ఎంత కష్టమొచ్చింది.? రీ-పోలింగ్ అడుగుతున్నారంటే, ఓటమిని ముందే ఒప్పుకున్నట్లు కదా.? పోలింగ్ సరళి చూశాక ‘సంబరాల’ రాంబాబుకి మైండ్ బ్లాంక్ అయ్యిందని, సత్తెనపల్లి నియోజకవర్గ ప్రజలే...

గ్రౌండ్ రిపోర్ట్: సంక్షేమ పథకాలు ఓట్లను రాల్చుతాయా.?

ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌కి ముందూ, పోలింగ్ తర్వాతా.. అధికార వైసీపీ, ‘సంక్షేమ పథకాలే మమ్మల్ని గెలిపిస్తాయ్..’ అని చెబుతుండడం చూస్తున్నాం. సంక్షేమం పేరుతో ఓటు బ్యాంకు రాజకీయాలు చేయడం అనేది...