Switch to English

వైఎస్ విజయమ్మ.. రెండు పార్టీలకీ గౌరవాధ్యక్షురాలే.!

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,424FansLike
57,764FollowersFollow

‘వైఎస్ షర్మిల రాజకీయ ఆలోచనల్ని మేం వ్యతిరేకిస్తున్నాం.. అయితే, ఆమెను అడ్డుకునే ఆలోచన మాకు లేదు. తెలంగాణలో మా పార్టీని మేం వదులుకున్నాం. ఆమె రాజకీయం ఆమె ఇష్టం. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఆమెకు ఎలాంటి సహకారం వుండదు.. సోదరిగా షర్మిల పట్ల జగన్ ఎప్పుడూ సోదరభావంతోనే వుంటారు.. వారి మధ్య కుటుంబ పరంగా ఎలాంటి విభేదాలూ వుండవు..’ అంటూ వైసీపీ ముఖ్య నేత సజ్జల రామకృష్ణారెడ్డి కొద్ది రోజుల క్రితం వ్యాఖ్యానించారు.

వైసీపీ కే చెందిన మరో నేత అద్దేపల్లి శ్రీధర్ ఈ మధ్యనే ఓ చర్చా కార్యక్రమంలో మాట్లాడుతూ, ‘మా చెల్లి వస్తోంది.. కాస్కోండి..’ అంటూ వ్యాఖ్యానించారు. సో, ఇక్కడ మేటర్ క్లియర్. వైసీపీ సంపూర్ణ సహాయ సహకారాలు షర్మిలకు వున్నాయి. షర్మిల కోసమే తెలంగాణలో వైసీపీ జెండా పీకేసింది. కాదు కాదు, వైసీపీ తెలంగాణ బాధ్యతల్ని షర్మిలకు అప్పగించాలనుకున్న వైఎస్ జగన్, అత్యంత వ్యూహాత్మకంగా షర్మిలతో కొత్త పార్టీని తెలంగాణలో పెట్టించబోతున్నారు.

కానీ, ‘సాక్షి మాకు కవరేజ్ ఇవ్వదు..’ అంటూ షర్మిలతో నిష్టూరాలేయిస్తారు. రాజకీయం కోసం వైఎస్సార్ కుటుంబంలో విభేదాలున్నట్లు చూపించేదీ వాళ్ళే.. మేమంతా ఒక్కటే.. అనేదీ వాళ్ళే. వైసీపీ గౌరవాధ్యక్షరాలైన విజయమ్మ, షర్మిల వెంట నిన్న నిరాహార దీక్ష కార్యక్రమంలో కన్పించడమేంటి.? షర్మిల వైసీపీ గౌరవాధ్యక్షురాలిగానే కొనసాగుతున్నప్పుడు, ఆమె ఈ కార్యక్రమానికి హాజరుకావడంలో అర్థమే లేదు. తల్లిగా షర్మిలకు మద్దతివ్వాలనుకుంటే.. అది ఇంటివరకే పరిమితమవ్వాలి.. నిరసన వేదికల్లో కనిపించడమేంటి చెప్మా.? ఎవర్ని నమ్మించడానికి.? ఎవర్ని వెర్రి వెంగళప్పలని చేయడానికి ఈ కుటుంబ రాజకీయాలట.?

షర్మిల పార్టీకి సంబంధించిన ప్రతి వ్యూహమూ, వైసీపీ కేంద్ర కార్యాలయం నుంచే రచించబడ్తోందన్న వాదనల్ని అంత తేలిగ్గా కొట్టిపారేయలేం. షర్మిల వెనకాల కన్పిస్తున్న ప్రతి నాయకుడూ, గతంలో వైఎస్ జగన్ వెంట నడిచినవాళ్ళే. అక్కడ కుమారుడ్ని ముఖ్యమంత్రిగా చూసుకున్న విజయమ్మ, ఇక్కడ షర్మిలను ముఖ్యమంత్రిగా చూసుకోవాలనుకోవడాన్ని తప్పుపట్టలేంగానీ, ఈమాత్రందానికి రెండు పార్టీలెందుకట.?

1 COMMENT

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Jr Ntr: స్థల వివాదంలో జూ.ఎన్టీఆర్..! వార్తలపై క్లారిటీ ఇచ్చిన హీరో...

Jr Ntr: ఓ స్థలం వివాదం విషయమై హీరో ఎన్టీఆర్ హైకోర్టుని ఆశ్రయించారంటూ సోషల్ మీడియాలో ఈరోజు పలు వార్తలు హల్ చల్ చేశాయి. అయితే.....

Prabhas: ఎవరా కొత్త వ్యక్తి..? సెన్సేషన్ క్రియేట్ చేస్తోన్న ప్రభాస్ పోస్ట్

Prabhas: చాలా తక్కువగా సోషల్ మీడియాలో యాక్టివ్ అయ్యే స్టార్ హీరో ప్రభాస్ చేసిన ఇన్ స్టా పోస్ట్ ప్రస్తుతం నెట్టింట విపరీతంగా వైరల్ అవుతోంది....

నాగబాబు ట్విట్టర్ హ్యాండిల్ మాయం.! అల్లు అర్జున్ ఆర్మీ ఎఫెక్టేనా.?

బాబోయ్ బూతులు.. ఇవి మామూలు బూతులు కావు.! బండ బూతులు.! సినీ అభిమానులంటే, అత్యంత జుగుప్సాకరంగా ప్రవర్తించాలా.? సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్ వార్స్ చేసుకోవడం...

Indian 2 : మరో ఇండియన్‌ సర్‌ప్రైజ్‌ చేయనున్నాడా?

Indian 2 : యూనివర్శిల్‌ స్టార్‌ కమల్‌ హాసన్‌ హీరోగా శంకర్ దర్శకత్వంలో వచ్చిన భారతీయుడు సినిమాకు సీక్వెల్‌ రూపొందుతుంది. పాన్ ఇండియా రేంజ్ లో...

Devara : ఎన్టీఆర్‌ VS చరణ్.. బిగ్‌ ఫైట్‌ తప్పదా?

Devara : ఎన్టీఆర్‌ మరియు రామ్‌ చరణ్ కలిసి 'ఆర్‌ఆర్‌ఆర్‌' సినిమాలో నటించారు. ఆ సినిమా ఇద్దరికి కూడా పాన్‌ ఇండియా రేంజ్‌ లోనే కాకుండా...

రాజకీయం

ఐదేళ్ళుగా సినీ పరిశ్రమను దోచేశాం: వైసీపీ అను‘కుల’ మీడియా.!

ఐదేళ్ళపాటు అధికారంలో వున్నాం.. అందినకాడికి సినీ పరిశ్రమని అడ్డగోలుగా దోచేసుకున్నాం.! ఇదీ వైసీపీ అను‘కుల’ మీడియా చెబుతున్నమాట.! ఆంధ్ర ప్రదేశ్‌లో ఐదేళ్ళపాటు అధికారం వెలగబెట్టిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, తన చెప్పు చేతల్లో...

గ్రౌండ్ రిపోర్ట్: సంక్షేమ పథకాలు ఓట్లను రాల్చుతాయా.?

ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌కి ముందూ, పోలింగ్ తర్వాతా.. అధికార వైసీపీ, ‘సంక్షేమ పథకాలే మమ్మల్ని గెలిపిస్తాయ్..’ అని చెబుతుండడం చూస్తున్నాం. సంక్షేమం పేరుతో ఓటు బ్యాంకు రాజకీయాలు చేయడం అనేది...

PM Modi: ‘మీరు చెప్పింది నిజమే..’ రష్మిక పోస్టుకు ప్రధాని మోదీ స్పందన..

PM Modi: ముంబైలో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన ‘ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్’ (MTHL)పై నటి రష్మిక (Rashmika) ప్రయాణించి సోషల్ మీడియాలో తన అనుభూతిని పంచుకున్నారు. దీనిపై ప్రధాని మోదీ (PM Modi)...

జగన్ ధీమా సరే.! వైసీపీ దాడుల సంగతేంటి.?

గెలిచే పార్టీ అయితే, తమ ప్రతిష్టను తామే దిగజార్చుకోవాలని అనుకుంటుందా.? రాష్ట్ర వ్యాప్తంగా అల్లర్లకు తెగబడుతుందా.? రాష్ట్రంలో ఎన్నికల పోలింగ్ అనంతరం చోటు చేసుకుంటున్న ఘర్షణలపై ఎవరికైనా సహజంగా కలిగే అనుమానమే ఇది. పల్నాడులో...

క్రాస్ ఓటింగ్ లేదు, గ్లాస్ ఓటింగే.!

పిఠాపురం, కాకినాడ.. ఈ రెండు పేర్లూ మార్మోగిపోతున్నాయి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో. తెలంగాణలోనూ, ఈ రెండు పేర్ల చుట్టూ బోల్డంత చర్చ జరుగుతోంది. ఒకటేమో, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేసిన...

ఎక్కువ చదివినవి

ఓట్ల కోసం కరెన్సీ నోట్లు.! విడతలవారీగా పంపిణీ.!

పిఠాపురం నియోజకవర్గమది.! ఇప్పటికే ఓట్ల కోసం తొలి విడతలో కరెన్సీ పంపిణీ పూర్తయిపోయింది.! రెండో విడత కూడా షురూ అయ్యింది. జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌ని ఎలాగైనా ఓడించాలన్న కోణంలో, ఓ పెద్ద...

Elephant: గున్న ఏనుగుకు జెడ్ కేటగిరీ భద్రత.. వీడియో వైరల్

Elephant: కుటుంబం తమ పిల్లల సంరక్షణను ఎలా చూసుకుంటుందో మానవ సంబంధాలలో చూస్తూంటాం. తమకూ తెలుసనిపించేలా ఉన్న అడవిలోని ఏనుగులకు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది. ఐఏఎస్ అధికారిణి సుప్రియా సాహు ‘ఎక్స్’లో...

వైసీపీకి ఓటెయ్యొద్దు: విజయమ్మ అభ్యర్థన.!

ఇదొక షాకింగ్ డెవలప్మెంట్.! వైసీపీ మాజీ గౌరవాధ్యక్షురాలు, మాజీ ఎమ్మెల్యే వైఎస్ విజయమ్మ, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఓటెయ్యొద్దంటూ పిలుపునిచ్చారు. ఈ మేరకు ఆమె ఓ వీడియో విడుదల చేశారు. ఇప్పటికే వైఎస్సార్...

ఎమ్మెల్యే చెంప పగలగొట్టిన సామాన్యుడికి ‘కులాన్ని’ ఆపాదిస్తారా.?

ఎమ్మెల్యేని ఓ సామాన్యుడు దూషించాడట.! దాంతో, ఎమ్మెల్యేకి కోపమొచ్చిందట. అయినాగానీ, శాంతంగానే వున్నాడట ఆయన. సదరు సామాన్యుడే, కులోన్మాదంతో సదరు ఎమ్మెల్యే చెంప పగలగొట్టేశాడట. తీవ్రంగా దాడి చేశాడట. దాడిలో గాయపడి ఆసుపత్రి పాలయ్యింది...

బాబూ.. రాంబాబూ.! రీపోలింగ్ కావాలా.?

మంత్రి అంబటి రాంబాబుకి రీ-పోలింగ్ కావాలట.! ఎంత కష్టమొచ్చింది.? రీ-పోలింగ్ అడుగుతున్నారంటే, ఓటమిని ముందే ఒప్పుకున్నట్లు కదా.? పోలింగ్ సరళి చూశాక ‘సంబరాల’ రాంబాబుకి మైండ్ బ్లాంక్ అయ్యిందని, సత్తెనపల్లి నియోజకవర్గ ప్రజలే...