Switch to English

‘అమర్‌రాజా’ ఎపిసోడ్‌లో జగన్‌ సర్కార్‌కి హైకోర్టు ఝలక్‌.!

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,421FansLike
57,764FollowersFollow

ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టులో వైఎస్‌ జగన్‌ సర్కార్‌కి మరోమారు చుక్కెదురయ్యింది. టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్‌కి చెందిన అమర్‌రాజా సంస్థకు గతంలో ప్రభుత్వం కేటాయించిన భూముల్ని వెనక్కి తీసుకుంటూ ఇటీవలే వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం జీవో జారీ చేసిన విషయం విదితమే. ఒప్పందం ప్రకారం ప్రభుత్వం ఇచ్చిన భూముల్లో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టలేదన్నది ప్రభుత్వం ఆరోపణ. ఇక, ఈ వ్యవహారంపై అమర్‌రాజా సంస్థ హైకోర్టును ఆశ్రయించింది. కేసుని విచారించిన న్యాయస్థానం, రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జీవోని నిలుపుదల చేస్తూ మద్యంతర ఉత్తర్వులు ఇచ్చింది.

గతంలో చిత్తూరు జిల్లాలో అమర్‌రాజా సంస్థకు అప్పటి ప్రభుత్వం 483 ఎకరాల భూముల్ని కేటాయించింది. అందులోంచి 253 ఎకరాల్ని వెనక్కి తీసుకునేలా ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం జీవో జారీ చేయడం వివాదాస్పదమయ్యింది. ‘రాజకీయ కుట్రలో భాగంగానే ఇదంతా చేస్తున్నారు..’ అంటూ వైఎస్‌ జగన్‌ సర్కార్‌పై టీడీపీ విరుచుకుపడింది. అయితే, నిబంధనలకు అనుగుణంగా వ్యవహరించకపోవడం వల్లనే, సంబంధిత నిబంధనలకు అనుగుణంగా భూముల్ని వెనక్కి తీసుకుంటున్నట్లు ప్రభుత్వం పేర్కొంది.

వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వచ్చాక, విపక్ష నేతల ఆర్థిక మూలాల్ని దెబ్బకొట్టడమే పనిగా పెట్టుకుందన్నది నిర్వివాదాంశం. ‘‘టీడీపీ హయాంలో అక్రమాలు, అవినీతి.. అంటూ ఇప్పటికే ఇద్దరు మాజీ మంత్రుల్ని జైలుకు పంపింది ప్రస్తుత ప్రభుత్వం. గనుల లీజుల వ్యవహారాలు, ఇతరత్రా వ్యవహారాలకు సంబంధించి విపక్ష నేతలకు గుక్క తిప్పుకోనీయకుండా చేస్తోంది అధికార వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ. ఈ తాటాకు చప్పుళ్ళకు బెదరం..’’ అంటూ టీడీపీ నేతలు ఎప్పటికప్పుడు ఆరోపణలు చేస్తోన్న విషయం విదితమే.

రాజకీయ ఆరోపణల సంగతి పక్కన పెడితే, న్యాయస్థానాల్లో మొట్టికాయలు అధికార వైఎస్సార్సీపీకి అలవాటైపోయాయి. ఈ క్రమంలో ఒక్కోసారి అధికార పార్టీ నేతలు సంయమనం కోల్పోయి కోర్టులపైనా వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తున్న సందర్భాల్ని చూస్తున్నాం. ఏదిఏమైనా, అమర్‌రాజా సంస్థకి భూ కేటాయింపులు – రద్దు వ్యవహారానికి సంబంధించి అధికార పార్టీకి న్యాయస్థానం దిమ్మతిరిగే షాకిచ్చిందని నిస్సందేహంగా చెప్పొచ్చు. మరి, ఇప్పుడు ఈ ఎపిసోడ్‌పై వైసీపీ నేతల వివరణ ఎలా వుంటుందో వేచి చూడాల్సిందే.

4 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Jr.Ntr Birthday special: టెక్నీషియన్స్ ఫేవరెట్.. జూ.ఎన్టీఆర్..! ఉదాహరణలివే..

Jr.Ntr Birthday special: తెలుగు సినీ పరిశ్రమలో ఘనమైన కుటుంబ నేపథ్యం ఉన్న కుటుంబాల్లో ఒకటి నందమూరి. విశ్వవిఖ్యాత నట సార్వభౌమ ఎన్టీఆర్ మనవడిగా.. హరికృష్ణ...

చిరంజీవి, కమల్ హాసన్.! ఎవరు గొప్ప నటుడు.?

సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్ వార్స్, ట్రోలింగ్.. ఇవేవీ లేకపోతే, చాలామంది అనాధలైపోతారు.! అనాధలైపోవడమంటే, ఎవరూ పట్టించుకోకుండా పోతారని అర్థం. ఈ లిస్టులో కొందరు సెలబ్రిటీలనబడేవారు...

Prabhas: ప్రభాస్ చెప్పిన బుజ్జి ఇదే.. ఉత్కంఠ రేకెత్తిస్తున్న వీడియో

Prabhas: స్టార్ హీరో ప్రభాస్ (Prabhas) ఇటివల ‘హాయ్.. డార్లింగ్స్. నా లైఫ్ లోకి కొత్తగా ఒకరు వస్తున్నారు. వెయిట్ చేయండి’ అనే పోస్ట్ బాగా...

SSMB 29: మహేశ్-రాజమౌళి సినిమాలో మరో స్టార్ హీరో..! నిజమెంత..!?

SSMB 29: సూపర్ స్టార్ మహేశ్ (Mahesh) – రాజమౌళి (Rajamouli) కాంబినేషన్లో ఓ భారీ సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. సినిమా ప్రకటించినప్పటి నుంచీ...

Silk Saree: మే24న వస్తున్న రొమాంటిక్ లవ్ స్టోరీ.. ‘సిల్క్ శారీ’

Silk Saree: వాసుదేవ్ రావు, రీవా చౌదరి, ప్రీతి గోస్వామి హీరో హీరోయిన్లుగా టి. నాగేందర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా "సిల్క్ శారీ" (Silk Saree)....

రాజకీయం

కాంగ్రెస్ గెలవాలని వైసీపీ కోరుకుంటోందా.?

రాజకీయాల్లో శాశ్వత శతృవులు శాశ్వత మిత్రులు ఎవరూ వుండరన్నది అందరికీ తెలిసిన విషయమే.! ఆ సూత్రాన్ని వైసీపీ కూడా పాటించక తప్పేలా లేదా.? అంటే, ఔననే వాదన వినిపిస్తోందిప్పుడు.! అసలు విషయమేంటంటే, ఆంధ్ర ప్రదేశ్...

జనసేన మీద వైసీపీ నేతలు బెట్టింగ్ కాస్తున్నారా.?

ఇదో ఇంట్రెస్టింగ్ పరిణామం.! అదీ, ఉభయ గోదావరి జిల్లాల్లో చోటు చేసుకుంటున్న వైపరీత్యం.! జనసేన పార్టీ గెలుస్తుందని వైసీపీ నేత ఒకరు భారీ స్థాయిలో డబ్బులు పందెం కాశారట. వేలల్లో అయితే వింతేమీ...

నాగబాబు ఈజ్ బ్యాక్.! ట్వీటుని తొలగించిన వైనం.!

సినీ నటుడు, జనసేన నేత కొణిదెల నాగబాబు ట్విట్టర్ అకౌంట్ నుంచి ఓ ట్వీటు పడింది. ‘మాతో వుంటూ ప్రత్యర్థులకి పని చేసేవాడు మా వాడైనా పరాయివాడే, మాతో నిలబడేవాడు పరాయివాడైనా మావాడే..’...

ఐదేళ్ళుగా సినీ పరిశ్రమను దోచేశాం: వైసీపీ అను‘కుల’ మీడియా.!

ఐదేళ్ళపాటు అధికారంలో వున్నాం.. అందినకాడికి సినీ పరిశ్రమని అడ్డగోలుగా దోచేసుకున్నాం.! ఇదీ వైసీపీ అను‘కుల’ మీడియా చెబుతున్నమాట.! ఆంధ్ర ప్రదేశ్‌లో ఐదేళ్ళపాటు అధికారం వెలగబెట్టిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, తన చెప్పు చేతల్లో...

గ్రౌండ్ రిపోర్ట్: సంక్షేమ పథకాలు ఓట్లను రాల్చుతాయా.?

ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌కి ముందూ, పోలింగ్ తర్వాతా.. అధికార వైసీపీ, ‘సంక్షేమ పథకాలే మమ్మల్ని గెలిపిస్తాయ్..’ అని చెబుతుండడం చూస్తున్నాం. సంక్షేమం పేరుతో ఓటు బ్యాంకు రాజకీయాలు చేయడం అనేది...

ఎక్కువ చదివినవి

Prabhas: ప్రభాస్ చెప్పిన బుజ్జి ఇదే.. ఉత్కంఠ రేకెత్తిస్తున్న వీడియో

Prabhas: స్టార్ హీరో ప్రభాస్ (Prabhas) ఇటివల ‘హాయ్.. డార్లింగ్స్. నా లైఫ్ లోకి కొత్తగా ఒకరు వస్తున్నారు. వెయిట్ చేయండి’ అనే పోస్ట్ బాగా వైరల్ అయింది. ప్రభాస్ పెళ్లి గురించే...

క్రాస్ ఓటింగ్ లేదు, గ్లాస్ ఓటింగే.!

పిఠాపురం, కాకినాడ.. ఈ రెండు పేర్లూ మార్మోగిపోతున్నాయి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో. తెలంగాణలోనూ, ఈ రెండు పేర్ల చుట్టూ బోల్డంత చర్చ జరుగుతోంది. ఒకటేమో, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేసిన...

భూముల్ని కొట్టేయలేదు కదా.! ఆంధ్రా ఓటర్ల భయం ఇదే.!

ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల్లో ఓటేసేందుకు ఇతర రాష్ట్రాల నుంచీ, విదేశాల నుంచి కూడా పెద్దయెత్తున ఓ టర్లు స్వస్థలాలకు చేరుకున్నారు. నిజానికి, రెండ్రోజుల ముందే చాలామంది ఓటర్లు స్వస్థలాలకు...

Prabhas: ఎవరా కొత్త వ్యక్తి..? సెన్సేషన్ క్రియేట్ చేస్తోన్న ప్రభాస్ పోస్ట్

Prabhas: చాలా తక్కువగా సోషల్ మీడియాలో యాక్టివ్ అయ్యే స్టార్ హీరో ప్రభాస్ చేసిన ఇన్ స్టా పోస్ట్ ప్రస్తుతం నెట్టింట విపరీతంగా వైరల్ అవుతోంది. ప్రభాస్ పోస్టు సినిమాల గురించి కాకుండా...

Jr Ntr: స్థల వివాదంలో జూ.ఎన్టీఆర్..! వార్తలపై క్లారిటీ ఇచ్చిన హీరో టీమ్

Jr Ntr: ఓ స్థలం వివాదం విషయమై హీరో ఎన్టీఆర్ హైకోర్టుని ఆశ్రయించారంటూ సోషల్ మీడియాలో ఈరోజు పలు వార్తలు హల్ చల్ చేశాయి. అయితే.. దీనిపై ఎన్టీఆర్ టీమ్ స్పందించింది. ప్రస్తుతం...