Switch to English

బిగ్‌ షాక్‌: సోనూ సూద్‌.. అంత పెద్ద ‘నేరం’ చేసేశాడా.?

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,425FansLike
57,764FollowersFollow

ఆంధ్రప్రదేశ్‌లో చిత్ర విచిత్రమైన రాజకీయాలు నడుస్తున్నాయి. ఏది తప్పు.? ఏది ఒప్పు.? అని జనం నిర్ణయించుకోలేనంత గందరగోళ పరిస్థితుల్ని పాలక పక్షం, ప్రతిపక్షం సృష్టిస్తుండడం గమనార్హం. సినీ నటుడు సోనూ సూద్‌, చిత్తూరు జిల్లాకి చెందిన ఓ రైతు కుటుంబాన్ని ఆదుకున్నాడు. ఆ రైతు కుటుంబానికి ఓ ట్రాక్టర్‌ని అందించాడు. అది కూడా, ఆ కుటుంబం పడుతున్న ఇబ్బందుల్ని తెలుసుకున్న గంటల వ్యవధిలోనే. కానీ, ఇక్కడే రాజకీయం షురూ అయ్యింది.

నిజానికి ఆ రైతు కుటుంబం మరీ అంత ఆర్థిక ఇబ్బందుల్లో లేదన్నది వైఎస్సార్సీపీ ఆరోపణ. ‘ఉత్త ఆరోపణ మాత్రమే కాదు, కావాలంటూ సోషల్‌ మీడియాలో సర్క్యులేట్‌ అవుతోన్న వీడియో చూడండి.. అందులో ఇద్దరు అమ్మాయిలు నవ్వుతూ ఎంత ఉల్లాసంగా నాగలిని భుజాల మీద మోస్తూ నేలను దున్నుతున్నారో. ఇది సరదాకి ఆ ఇద్దరమ్మాయిలూ చేసిన పని. అంతే తప్ప, కష్టపడి చేస్తున్నది కాదు. ఆ కుటుంబం, ట్రాక్టర్‌ని ఏర్పాటు చేసుకోలేనంత పేద కుటుంబం కూడా కాదు. పైగా, రాష్ట్ర ప్రభుత్వం నుంచి పెన్షన్‌ సహా వ్యవసాయానికి సంబంధించిన సంక్షేమ పథకాలూ అందుతున్నాయి..’ అన్నది వైసీపీ మద్దతుదారులు చెబుతున్నమాట. ప్రభుత్వం ఎంత గొప్పగా చేసినా, ఆ కుటుంబం పేద కుటుంబమని.. ప్రభుత్వ రికార్డులే చెబుతున్నాయి. సో, ఇక్కడ సోనూ సూద్‌ చేసిన సాయంలో తప్పేమీ లేదు.

కానీ, సమస్య ఎక్కడొచ్చిందంటే.. సోనూ సూద్‌ని అభినందిస్తూ టీడీపీ అధినేత నారా చంద్రబాబు మాట్లాడటం. ఆ రైతు కుటుంబంలో ఇద్దరు ఆడ పిల్లల చదువుల బాధ్యత టీడీపీ తీసుకుంటుందని చంద్రబాబు ప్రకటించడంతో.. ఈ వ్యవహారం పొలిటికల్‌ టర్న్‌ తీసుకుంది. టీడీపీ – వైసీపీ మధ్య మాటల యుద్ధం జరుగుతోందిప్పుడు. సదరు రైతు గతంలో లోక్‌సత్తా పార్టీ తరఫున ఎన్నికల్లో పోటీ చేశాడట కూడా. ఏం, అలా పోటీ చేస్తే అదేమన్నా నేరమా.? అన్నది ఇంకో ప్రశ్న. ‘ఇలాంటి సాయాలు చేసేటప్పుడు ఒకటికి పదిసార్లు ఆలోచించుకుని చెయ్యాలి..’ అని సోనూ సూద్‌కి కొందరు సీనియర్‌ జర్నలిస్టులూ ఉచిత సలహాలిచ్చేస్తున్నారు. ‘అమ్మ పెట్టదు.. అడుక్కు తిననివ్వదు..’ అన్నట్టుంది పరిస్థితి.

ఈ తరహా చెత్త రాజకీయాల కారణంగా సోనూ సూద్‌ కూడా ఇకపై ఎవరికైనా సాయం చేయాలంటే ఒకటికి పదిసార్లు ఆలోచించుకోవాలేమో.! సోనూ సూద్‌ని ఆదర్శంగా తీసుకోవాలని ఇంకెవరైనా నిర్ణయించుకుంటే.. తక్షణం ఈ రాజకీయాల్ని చూపి ఆ ఆలోచనల్ని విరమించుకున్నా ఆశ్చర్యపోవాల్సిన పనిలేదు. ‘ఆయన (సోనూ సూద్‌) ట్రాక్టర్‌ ఇవ్వడం నేరమా.? అది చూసి నేను పేదోడినో, డబ్బున్నోడినో తెలుసుకునేందుకు అధికారులు మా ఇంటికి రావడం బాధ కలిగించింది.. మా రంగుని, శరీరాకృతిని ఎగతాళి చేస్తారా.?’ అంటూ సదరు రైతు వాపోయాడు. టీ కొట్టు నడుపుకునే తనకు కరోనా కారణంగా ఆర్థిక ఇబ్బందులు వచ్చాయని, ఆ ఇబ్బందులు తట్టుకోలేక తన తండ్రి ఇంటికొచ్చి ఇక్కడే వుంటున్నామని అన్నాడాయన.

పొలం తన తండ్రిదనీ, దానికి సంబంధించి ప్రభుత్వం ఇచ్చే పథకాల తాలూకు సొమ్ములు తనకు దక్కవని చెప్పుకొచ్చాడు బాధితుడు నాగేశ్వరరావు. డమ్మీ అభ్యర్థిగానే తాను గతంలో బరిలోకి దిగాల్సి వచ్చింది తప్ప, తాను డబ్బున్నోడిని కాదని చెప్పాడు. ఇదీ నాగేశ్వరరావు అసలు కథ. ఇప్పటికైనా, టీడీపీ – వైసీపీ చేస్తోన్న చిత్ర విచిత్రమైన రాజకీయాలకు ఇక్కడితో ముగింపు పడుతుందని ఆశిద్దాం.

5 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Prabhas: ఎవరా కొత్త వ్యక్తి..? సెన్సేషన్ క్రియేట్ చేస్తోన్న ప్రభాస్ పోస్ట్

Prabhas: చాలా తక్కువగా సోషల్ మీడియాలో యాక్టివ్ అయ్యే స్టార్ హీరో ప్రభాస్ చేసిన ఇన్ స్టా పోస్ట్ ప్రస్తుతం నెట్టింట విపరీతంగా వైరల్ అవుతోంది....

నాగబాబు ట్విట్టర్ హ్యాండిల్ మాయం.! అల్లు అర్జున్ ఆర్మీ ఎఫెక్టేనా.?

బాబోయ్ బూతులు.. ఇవి మామూలు బూతులు కావు.! బండ బూతులు.! సినీ అభిమానులంటే, అత్యంత జుగుప్సాకరంగా ప్రవర్తించాలా.? సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్ వార్స్ చేసుకోవడం...

Indian 2 : మరో ఇండియన్‌ సర్‌ప్రైజ్‌ చేయనున్నాడా?

Indian 2 : యూనివర్శిల్‌ స్టార్‌ కమల్‌ హాసన్‌ హీరోగా శంకర్ దర్శకత్వంలో వచ్చిన భారతీయుడు సినిమాకు సీక్వెల్‌ రూపొందుతుంది. పాన్ ఇండియా రేంజ్ లో...

Devara : ఎన్టీఆర్‌ VS చరణ్.. బిగ్‌ ఫైట్‌ తప్పదా?

Devara : ఎన్టీఆర్‌ మరియు రామ్‌ చరణ్ కలిసి 'ఆర్‌ఆర్‌ఆర్‌' సినిమాలో నటించారు. ఆ సినిమా ఇద్దరికి కూడా పాన్‌ ఇండియా రేంజ్‌ లోనే కాకుండా...

Kajal : ఎన్టీఆర్‌ పై అభిమానంతో అది చేశా..!

Kajal : టాలీవుడ్‌ చందమామ కాజల్ అగర్వాల్‌ పెళ్లి తర్వాత కాస్త స్లో అయ్యింది. తల్లి అయ్యాక సినిమాలకు గ్యాప్‌ ఇచ్చింది. ఇప్పుడు మళ్లీ సినిమాలతో...

రాజకీయం

PM Modi: ‘మీరు చెప్పింది నిజమే..’ రష్మిక పోస్టుకు ప్రధాని మోదీ స్పందన..

PM Modi: ముంబైలో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన ‘ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్’ (MTHL)పై నటి రష్మిక (Rashmika) ప్రయాణించి సోషల్ మీడియాలో తన అనుభూతిని పంచుకున్నారు. దీనిపై ప్రధాని మోదీ (PM Modi)...

జగన్ ధీమా సరే.! వైసీపీ దాడుల సంగతేంటి.?

గెలిచే పార్టీ అయితే, తమ ప్రతిష్టను తామే దిగజార్చుకోవాలని అనుకుంటుందా.? రాష్ట్ర వ్యాప్తంగా అల్లర్లకు తెగబడుతుందా.? రాష్ట్రంలో ఎన్నికల పోలింగ్ అనంతరం చోటు చేసుకుంటున్న ఘర్షణలపై ఎవరికైనా సహజంగా కలిగే అనుమానమే ఇది. పల్నాడులో...

క్రాస్ ఓటింగ్ లేదు, గ్లాస్ ఓటింగే.!

పిఠాపురం, కాకినాడ.. ఈ రెండు పేర్లూ మార్మోగిపోతున్నాయి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో. తెలంగాణలోనూ, ఈ రెండు పేర్ల చుట్టూ బోల్డంత చర్చ జరుగుతోంది. ఒకటేమో, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేసిన...

ఆ పధ్నాలుగు వేల కోట్ల రూపాయలు ఏమైపోయాయ్.?

పధ్నాలుగు వేల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు వందల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు కోట్ల రూపాయలకీ చాలా తేడా వుంది.! చాలా చాలా తేడా వుంది.! ఒకటి కాదు, రెండు కాదు... పదీ కాదు,...

డబ్బులు పోనాయ్.. మేమేటి సేత్తాం.?

ఎన్నికలంటేనే, వందల కోట్లు.. వేల కోట్ల ఖర్చు వ్యవహారం.! అసెంబ్లీ అభ్యర్థి అయినా యాభై నుంచి వంద కోట్లు చూసుకోవాల్సిందే.! కేంద్ర ఎన్నికల సంఘం నిర్దేశించిన విధంగా అభ్యర్థులు పరిమితికి లోబడి ఖర్చు...

ఎక్కువ చదివినవి

వైసీపీ ఇస్తే తీసుకుంటాం.! ఓటు మాత్రం కూటమికే వేస్తాం.!

‘ఈ రోజుల్లో రాజకీయ నాయకుల్ని నమ్మడానికి వీల్లేదు. ఆ పార్టీ నుంచి గెలిచి, ఈ పార్టీలోకి దూకేస్తారు. పూటకో పార్టీ మార్చేస్తారు..’ అని జనం చర్చించుకోవడం చూస్తున్నాం. మరి, ఆ జనం గురించి...

హింస, అశాంతి.! ఇది వైసీపీ మార్కు రాజకీయం.!

రాష్ట్రంలో ప్రశాతంగా ఎన్నికల పోలింగ్ ముగిసింది. మరీ ప్రశాంతంగా కాదుగానీ, ఫర్లేదు.! వైసీపీ ఓటమి ఖాయమని పోలింగ్‌కి ముందే సంకేతాలు రావడంతో, కొన్ని చోట్ల హింసకు తెరలేపాయి వైసీపీ శ్రేణులు. బీసీ, మైనార్టీలు, ఎస్సీ,...

Indian 2 : మరో ఇండియన్‌ సర్‌ప్రైజ్‌ చేయనున్నాడా?

Indian 2 : యూనివర్శిల్‌ స్టార్‌ కమల్‌ హాసన్‌ హీరోగా శంకర్ దర్శకత్వంలో వచ్చిన భారతీయుడు సినిమాకు సీక్వెల్‌ రూపొందుతుంది. పాన్ ఇండియా రేంజ్ లో ఇండియన్‌ 2 ను విడుదల చేయబోతున్నారు....

ఎర్ర టవల్ చూస్తే వంగా గీతకు అంత భయమెందుకు.?

పిఠాపురం వైసీపీ అభ్యర్థి వంగా గీతకి ఓ పోలింగ్ కేంద్రంలో చిత్రమైన అనుభవం ఎదురయ్యింది. ‘నమస్కారం పెడుతూ, నాకు ఓటెయ్యడం మర్చిపోవద్దు..’ అంటూ క్యూలైన్లలో వున్న ఓటర్లను అభ్యర్థిస్తూ వెళ్ళడంపై కొందరు ఓటర్లు...

వైసీపీకి మంత్రి బొత్స రాజీనామా చేసేశారా.?

అదేంటీ, వైసీపీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ.. పోలింగ్‌కి ముందు రోజు వైసీపీకి రాజీనామా చేసెయ్యడమేంటి.? వైఎస్ జగన్ మంత్రి వర్గంలో సీనియర్ మోస్ట్ మంత్రుల్లో బొత్స సత్యానారాయణ ఒకరు. ‘తండ్రి సమానుడు’...