Switch to English

శునకంతో సావాసం.. పదిలంగా హృదయం

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,418FansLike
57,764FollowersFollow

మనుషుల పట్ల అత్యంత విశ్వాసం కలిగిన జంతువు ఏది అంటే.. కుక్క అని ఠక్కున చెబుతాం. కొత్తగా దీని ఖాతాలోకి మరో ఘనత చేరింది. శునకాలతో సావాసం చేస్తే మన గుండె పదిలంగా ఉంటుందని తేలింది. కుక్కలను పెంచుకోవడం వల్ల గుండె సంబంధిత రుగ్మతలు వచ్చే అవకాశాలు చాలా తక్కువతని తాజా పరిశోధనలో వెల్లడైంది. ఇంట్లో కుక్కను పెంచుకోవడం వల్ల దాని ఆలనా పాలనా చూసే క్రమంలో మనకు తెలియకుండానే వ్యాయామం చేస్తామని.. తద్వారా గుండె జబ్బులకు దూరంగా ఉండొచ్చని పరిశోధకులు వెల్లడించారు.

దాంతోపాటు పరిగెత్తడం లేదా నడవడం, కుక్కను తీసుకుని పార్క్ కి వెళ్లడం వంటి అంశాలు మనకు ఎంతో మేలు చేస్తాయని చెబుతున్నారు. ‘‘చురుకైన జీవనశైలి, మంచి ఆహారం, క్రమం తప్పకుండా చేసే వ్యాయామంతో గుండె పదికాలాల పాటు పదిలంగా ఉంటుందన్న సంగతి మనకు తెలిసిందే. మన ఇంట్లో కుక్కను పెంచుకోవడం వల్ల దాంతోపాటే మనం కూడా వ్యాయామం చేస్తాం. ఇది మన గుండెను భద్రంగా ఉంచుతుంది’’ అని ఈ పరిశోధనలో పాలుపంచుకున్నా ఆండ్రియా తెలిపారు.

పెంపుడు జంతువులు మన ఆరోగ్యంపై ఎలాంటి ప్రభావం చూపిస్తాయో తెలుసుకునేందుకు చెక్ రిపబ్లిక్ లోని బ్రొనో నగరానికి చెందిన పరిశోధకులు ఇటీవల ఓ అధ్యయనం నిర్వహించారు. 24 ఏళ్ల నుంచి 64 ఏళ్ల వయసున్న 1769 మందిపై పరిశోధన జరిపారు. వీరిలో 42 శాతం మందికి పెంపుడు జంతువులు ఉన్నాయి. వీరిలో 24 శాతం మంది కుక్కను పెంచుకుంటుండగా.. మిగిలిన 18 శాతం మంది ఇతర జంతువులను కలిగి ఉన్నారు. తొలుత వీరందరి ఆరోగ్య వివరాలు నమోదు చేసుకున్నారు. కొంతకాలం తర్వాత మరోసారి అవే వివరాలను సేకరించారు.

రెండింటికీ మధ్య తేడాలను గుర్తించగా.. ఆశ్చర్యకరమైన విషయాలు వెల్లడయ్యాయి. కుక్క సహా పెంపుడు జంతువులతో కాలక్షేపం చేసేవారిలో ఇతరుల కంటే రక్తపోటు, మధుమేహం, కొవ్వు శాతం తక్కువగా ఉండి గుండె ఆరోగ్యం మెరుగ్గా ఉన్నట్టు తేలింది. పెంపుడు జంతువులు లేని వారితో పోలిస్తే వీరికి మంచి కొలెస్ర్టాల్‌ అధికంగా ఉండటంతో పాటు మధుమేహం లేకపోవడాన్ని గుర్తించారు. పైగా ఇతర జంతువులు కలిగి ఉన్నవారికంటే శునకాలను పెంచుకునేవారిలో గుండె సంబంధిత రుగ్మతలు అస్సలు కనిపించకపోవడాన్ని కనుగొన్నారు. దీంతో శునకాలను పెంచుకోవడం గుండెకు మంచిదని నిర్ధారణకు వచ్చారు.

6 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Hema: ‘నన్ను ఇందులోకి లాగొద్దు..’ బెంగళూరు రేవ్ పార్టీపై నటి హేమ

Hema: బెంగళూరు (Bengaluru) నగర శివారులోని ఎలక్ట్రానిక్ సిటీ సమీపంలో జరిగిన రేవ్ పార్టీ కలకలం రేపుతోంది. ఓ ఫామ్ హౌస్ లో జరిగినట్టుగా వార్తలు...

Jr.Ntr Birthday special: యాక్టింగ్ డైనమైట్.. అభిమానుల సంబరం.. ‘జూ.ఎన్టీఆర్’..

Jr.Ntr Birthday special: బాల నటుడిగానే అద్భుతమైన ప్రతిభ.. యుక్త వయసులోనే హీరో.. తక్కువ సమయంలోనే స్టార్ స్టేటస్.. నటనలో డైనమైట్.. డ్యాన్స్ లో స్పీడ్.....

Jr.Ntr Birthday special: టెక్నీషియన్స్ ఫేవరెట్.. జూ.ఎన్టీఆర్..! ఉదాహరణలివే..

Jr.Ntr Birthday special: తెలుగు సినీ పరిశ్రమలో ఘనమైన కుటుంబ నేపథ్యం ఉన్న కుటుంబాల్లో ఒకటి నందమూరి. విశ్వవిఖ్యాత నట సార్వభౌమ ఎన్టీఆర్ మనవడిగా.. హరికృష్ణ...

చిరంజీవి, కమల్ హాసన్.! ఎవరు గొప్ప నటుడు.?

సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్ వార్స్, ట్రోలింగ్.. ఇవేవీ లేకపోతే, చాలామంది అనాధలైపోతారు.! అనాధలైపోవడమంటే, ఎవరూ పట్టించుకోకుండా పోతారని అర్థం. ఈ లిస్టులో కొందరు సెలబ్రిటీలనబడేవారు...

Prabhas: ప్రభాస్ చెప్పిన బుజ్జి ఇదే.. ఉత్కంఠ రేకెత్తిస్తున్న వీడియో

Prabhas: స్టార్ హీరో ప్రభాస్ (Prabhas) ఇటివల ‘హాయ్.. డార్లింగ్స్. నా లైఫ్ లోకి కొత్తగా ఒకరు వస్తున్నారు. వెయిట్ చేయండి’ అనే పోస్ట్ బాగా...

రాజకీయం

కింగ్ మేకర్ జనసేనాని: వైసీపీ అంతర్గత సర్వేల్లో ఇదే తేలిందా.?

టీడీపీ - వైసీపీకి సమానంగా సీట్లు రావొచ్చు. జనసేన పార్టీకి తక్కువలో తక్కువ పన్నెండు సీట్లు వస్తాయ్.! రెండు ఎంపీ సీట్లు కూడా జనసేన గెలుచుకోబోతోంది. ఈ పరిస్థితుల్లో జనసేన అధినేత పవన్...

ఓటు అమ్ముకున్న పోలీస్.! వింతేముంది.?

దొరికేదాకా దొరలే.! దొరికితేనే దొంగ.! ఓ పోలీస్ అధికారి ఓటుని అమ్ముకుని, సస్పెండ్ అయ్యాడు.! ఏంటీ, భారతదేశంలో ఓటుని అమ్ముకోవడం నేరమా.? మరి, కొనుక్కుంటున్న రాజకీయ పార్టీలు, రాజకీయ నాయకుల సంగతేంటి.? ఎమ్మెల్యే టిక్కెట్...

జగన్, చంద్రబాబు.. విదేశీ ‘రాజకీయ’ పర్యటనల వెనుక.!

వైఎస్ జగన్ మోహన్ రెడ్డి లండన్ వెళ్ళారు. నారా చంద్రబాబునాయుడు విదేశాలకు వెళ్ళనున్నారు. పవన్ కళ్యాణ్ కూడా విదేశాలకు వెళ్ళే అవకాశం వుందట. విదేశాలకు వెళితే తప్పేముంది.? ఒకరు విదేశాలకు వెళితే, పారిపోయినట్టు...

వంగా గీత మెగాభిమానం.! నిజమేనా.? నమ్మొచ్చా.?

మెగాస్టార్ చిరంజీవి అన్నయ్య అంటే, నాకు అమితమైన అభిమానం. చిరంజీవి తమ్ముడిగా పవన్ కళ్యాణ్ అన్నా కూడా అభిమానమే. నాగబాబు అంటే కూడా అంతే గౌరవం.! ఈ మాటలు అన్నదెవరో కాదు, కాకినాడ ఎంపీ...

కోటి రూపాయలు కొల్లగొట్టిన మహిళా ఎర్నలిస్ట్ ఎవరు.?

ఎన్నికల సమయంలో ఓ మహిలా ఎర్నలిస్టు, ఏకంగా కోటి రూపాయలు కొల్లగొట్టిందట.! ఆంధ్ర ప్రదేశ్ రాజకీయాల్లో ఇప్పుడు ఇదో హాట్ టాపిక్.! ఎవరా మహిళా ఎర్నలిస్ట్.? ఏమా కథ.? అధికార వైసీపీకి అత్యంత...

ఎక్కువ చదివినవి

వై నాట్ 175.! వైసీపీ సరే, టీడీపీ లెక్కలేంటి.?

‘మేం వై నాట్ 175 అనే మాటకే కట్టుబడి వున్నాం. ఇంతకీ, టీడీపీ లెక్క ఎంత.?’ ఈ మాట వైసీపీ గట్టిగానే అంటోంది. తెలుగు దేశం పార్టీని ప్రశ్నిస్తోంది. టీడీపీ జాతీయ ప్రధాన...

హింస, అశాంతి.! ఇది వైసీపీ మార్కు రాజకీయం.!

రాష్ట్రంలో ప్రశాతంగా ఎన్నికల పోలింగ్ ముగిసింది. మరీ ప్రశాంతంగా కాదుగానీ, ఫర్లేదు.! వైసీపీ ఓటమి ఖాయమని పోలింగ్‌కి ముందే సంకేతాలు రావడంతో, కొన్ని చోట్ల హింసకు తెరలేపాయి వైసీపీ శ్రేణులు. బీసీ, మైనార్టీలు, ఎస్సీ,...

బాబూ.. రాంబాబూ.! రీపోలింగ్ కావాలా.?

మంత్రి అంబటి రాంబాబుకి రీ-పోలింగ్ కావాలట.! ఎంత కష్టమొచ్చింది.? రీ-పోలింగ్ అడుగుతున్నారంటే, ఓటమిని ముందే ఒప్పుకున్నట్లు కదా.? పోలింగ్ సరళి చూశాక ‘సంబరాల’ రాంబాబుకి మైండ్ బ్లాంక్ అయ్యిందని, సత్తెనపల్లి నియోజకవర్గ ప్రజలే...

గ్రౌండ్ రిపోర్ట్: సంక్షేమ పథకాలు ఓట్లను రాల్చుతాయా.?

ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌కి ముందూ, పోలింగ్ తర్వాతా.. అధికార వైసీపీ, ‘సంక్షేమ పథకాలే మమ్మల్ని గెలిపిస్తాయ్..’ అని చెబుతుండడం చూస్తున్నాం. సంక్షేమం పేరుతో ఓటు బ్యాంకు రాజకీయాలు చేయడం అనేది...

వంగా గీత మెగాభిమానం.! నిజమేనా.? నమ్మొచ్చా.?

మెగాస్టార్ చిరంజీవి అన్నయ్య అంటే, నాకు అమితమైన అభిమానం. చిరంజీవి తమ్ముడిగా పవన్ కళ్యాణ్ అన్నా కూడా అభిమానమే. నాగబాబు అంటే కూడా అంతే గౌరవం.! ఈ మాటలు అన్నదెవరో కాదు, కాకినాడ ఎంపీ...