మహారాష్ట్ర రాజకీయాలు అనేక మలుపులు తిరుగుతున్నాయి. సినిమాల్లో కూడా ఇన్ని ట్విస్ట్ లు ఉండవు. మహా అఘాడి కూటమిని ఏర్పాటు చేసుకొని ఒక ఉమ్మడి ప్రణాళికను సిద్ధం చేసుకుంటున్న సమయంలో శివసేన, కాంగ్రెస్, ఎన్సీపీకి అజిత్ పవార్ హ్యాండ్ ఇచ్చి బీజేపీతో కలిసి రాత్రికి రాత్రే ప్రమాణస్వీకారం చేశారు. ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన అజిత్ పవార్, ఆ తరువాత ఎమ్మెల్యేలు తమ వద్దకు వస్తారని అనుకున్నారు.
ఇదే సమయంలో మహా అఘాడి కూటమి సుప్రీం కోర్టుకు వెళ్లడంతో సుప్రీం కోర్టు సమయం ఇవ్వలేదు. సమయం ఇవ్వకుండా రేపు సాయంత్రం 5 గంటలలోపు బలనిరూపణ చేసుకోవాలని తీర్పు ఇచ్చింది. ఈ తీర్పును అనుసరించి రేపు సాయంత్రం 5 గంటల లోపు నిరూపించుకోవాలని కోరింది. అయితే, ఈ తీర్పు వెలువడిన కాసేపటికి మహారాష్ట్రలో డెప్యూటీ ముఖ్యమంత్రిగా ఉన్న అజిత్ పవార్ రాజీనామా చేశారు.
మధ్యాహ్నం వరకు ఫడ్నవీస్ తో కలిసి ఉన్న అజిత్, ఆ తరువాత శరద్ భార్య అజిత్ తో జరిపిన మంతనాల కారణంగా ఆయన రాజీనామా చేసినట్టుగా తెలుస్తోంది. అజిత్ రాజీనామా చేస్తే.. ఆ తరువాత ఫడ్నవిస్ కూడా రాజీనామా చేస్తారని వార్తలు వస్తున్నాయి.
ఇదిలా ఉంటె, మధ్యాహ్నం 3:30 గంటలకు ప్రెస్ మీట్ పెట్టిన ఫడ్నవిస్ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు. అజిత్ పవార్ వెళ్లిపోవడం వలన సంఖ్యాబలం లేదని అర్ధం అయ్యి రాజీనామా చేస్తున్నట్టు ఆయన ప్రకటించారు.
720357 788308conclusion which you are absolutely appropriate but several require to be 17189
631381 140878I discovered your weblog site internet internet site on the internet and appearance some of your early posts. Continue to maintain within the wonderful operate. I just now additional increase your Rss to my MSN News Reader. Seeking toward reading far much more from you discovering out at a later date! 532971
291106 35355I dugg some of you post as I thought they were handy extremely valuable 271979
317967 790365Youve really written a quite very good quality article here. Thank you quite a lot 762209