Switch to English

తెలుగు సినీ పరిశ్రమ.. పవన్ కళ్యాణ్ వెంట నడుస్తుందా.?

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,418FansLike
57,764FollowersFollow

సినీ నటుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కోసం మంగళగిరి జనసేన పార్టీ కార్యాలయానికి వెళ్ళారు పలువురు నిర్మాతలు. దర్శకుడు హరీష్ శంకర్ కూడా వారి వెంట వున్నారు.

జనసేన పార్టీ కార్యాలయంలో కొత్త భవన నిర్మాణానికి సంబంధించి భూమి పూజ, అదే సమయంలో యజ్ఞ యాగాదులు కూడా ‘వారాహి’ యాత్రకు సంబంధించి జనసేనాని నిర్వహించారు.

దైవకార్యం గనుక, దైవ దర్శనం కోసం ఆయా సినీ ప్రముఖులు మంగళగిరి జనసేన కార్యాలయానికి వచ్చారు. ఈ సందర్భంగా, జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌తో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. వారాహి వాహనాన్ని పరిశీలించారు.

ఆయా నిర్మాణ సంస్థలు, జనసేన అధినేతకు అంతా మంచే జరగాలని ఆకాంక్షిస్తూ తమ తమ అధికారిక సోషల్ మీడియా హ్యాండిల్స్ ద్వారా వారాహి యాత్రకు విషెస్ అందించాయి.

కాగా, మంగళగిరి జనసేన పార్టీ కార్యాలయాన్ని సందర్శించిన అనంతరం దర్శకుడు హరీష్ శంకర్ మాట్లాడుతూ, పవన్ కళ్యాణ్ ఇకపై ఎక్కువగా ఆంధ్రప్రదేశ్‌లోనే వుండబోతున్నారనీ, ఈ నేపథ్యంలో సినిమా షూటింగులు కూడా విజయవాడ పరిసర ప్రాంతాల్లోనే జరుగుతాయని చెప్పారు.

తాను దర్శకత్వం వహిస్తోన్న ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సినిమాతోపాటు, ‘ఓజీ’ తదితర సినిమాలు కూడా విజయవాడ పరిసర ప్రాంతాల్లోనే షూటింగులు జరుపుకుంటాయని హరీష్ శంకర్ చెప్పడం గమనార్హం.
పవన్ కళ్యాణ్ సినిమాలే కాదనీ, ఇతర హీరోల సినిమాలు కూడా ఇకపై విజయవాడ పరిసర ప్రాంతాల్లోనూ షూటింగులు జరిపేందుకు నిర్మాతలు ముందుకొస్తున్నట్లుగా చెప్పారాయన.

ఇదిలా వుంటే, ఇంతలా నిర్మాతల నుంచి జనసేన అధినేతకు సహకారం లభించడం పట్ల సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంద.ి మెగాస్టార్ చిరంజీవి ప్రజారాజ్యం పార్టీతో రాజకీయాల్లోకి వచ్చినప్పుడు, ఆయనకు సినీ పరిశ్రమ నుంచి తగిన సహకారం లభించలేదు. కానీ, పవన్ కళ్యాణ్‌కి తగిన సహకారం అందుతున్నట్లే కనిపిస్తోంది. ప్రముఖ నిర్మాత బీవీఎస్ఎన్ ప్రసాద్ నిన్న జనసేన పార్టీలో చేరిన సంగతి తెలిసిందే.

మరికొందరు సినీ ప్రముఖులు కూడా జనసేన పార్టీలో చేరేందుకు సిద్ధంగా వున్నట్లు ప్రచారం జరుగుతోంది. ‘వారాహి యాత్ర’ ప్రారంభమైతే, ఆ యాత్రలో పలువురు సినీ ప్రముఖులు స్వయంగా పాల్గొనే అవకాశం వుంది. జనసేనానికి సంఘీభావం తెలిపేందుకు కొందరు, జనసేన పార్టీలో చేరేందుకు కొందరు సినీ ప్రముఖులు సిద్ధమవుతున్నారట.

తెలుగు సినీ పరిశ్రమకు ఆంధ్రప్రదేశ్‌లోని వైసీపీ సర్కారు నుంచి ఎదురవుతున్న ఇబ్బందుల నేపథ్యంలో, పరిశ్రమ తరఫున తొలుత బలంగా గళం వినిపించింది పవన్ కళ్యాణ్ అని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు కదా.! ఆ పవన్ కళ్యాణ్‌కి అండగా నిలబడటం సినీ పరిశ్రమ బాధ్యత కూడా.!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Jr.Ntr Birthday special: యాక్టింగ్ డైనమైట్.. అభిమానుల సంబరం.. ‘జూ.ఎన్టీఆర్’..

Jr.Ntr Birthday special: బాల నటుడిగానే అద్భుతమైన ప్రతిభ.. యుక్త వయసులోనే హీరో.. తక్కువ సమయంలోనే స్టార్ స్టేటస్.. నటనలో డైనమైట్.. డ్యాన్స్ లో స్పీడ్.....

Jr.Ntr Birthday special: టెక్నీషియన్స్ ఫేవరెట్.. జూ.ఎన్టీఆర్..! ఉదాహరణలివే..

Jr.Ntr Birthday special: తెలుగు సినీ పరిశ్రమలో ఘనమైన కుటుంబ నేపథ్యం ఉన్న కుటుంబాల్లో ఒకటి నందమూరి. విశ్వవిఖ్యాత నట సార్వభౌమ ఎన్టీఆర్ మనవడిగా.. హరికృష్ణ...

చిరంజీవి, కమల్ హాసన్.! ఎవరు గొప్ప నటుడు.?

సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్ వార్స్, ట్రోలింగ్.. ఇవేవీ లేకపోతే, చాలామంది అనాధలైపోతారు.! అనాధలైపోవడమంటే, ఎవరూ పట్టించుకోకుండా పోతారని అర్థం. ఈ లిస్టులో కొందరు సెలబ్రిటీలనబడేవారు...

Prabhas: ప్రభాస్ చెప్పిన బుజ్జి ఇదే.. ఉత్కంఠ రేకెత్తిస్తున్న వీడియో

Prabhas: స్టార్ హీరో ప్రభాస్ (Prabhas) ఇటివల ‘హాయ్.. డార్లింగ్స్. నా లైఫ్ లోకి కొత్తగా ఒకరు వస్తున్నారు. వెయిట్ చేయండి’ అనే పోస్ట్ బాగా...

SSMB 29: మహేశ్-రాజమౌళి సినిమాలో మరో స్టార్ హీరో..! నిజమెంత..!?

SSMB 29: సూపర్ స్టార్ మహేశ్ (Mahesh) – రాజమౌళి (Rajamouli) కాంబినేషన్లో ఓ భారీ సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. సినిమా ప్రకటించినప్పటి నుంచీ...

రాజకీయం

వంగా గీత మెగాభిమానం.! నిజమేనా.? నమ్మొచ్చా.?

మెగాస్టార్ చిరంజీవి అన్నయ్య అంటే, నాకు అమితమైన అభిమానం. చిరంజీవి తమ్ముడిగా పవన్ కళ్యాణ్ అన్నా కూడా అభిమానమే. నాగబాబు అంటే కూడా అంతే గౌరవం.! ఈ మాటలు అన్నదెవరో కాదు, కాకినాడ ఎంపీ...

కోటి రూపాయలు కొల్లగొట్టిన మహిళా ఎర్నలిస్ట్ ఎవరు.?

ఎన్నికల సమయంలో ఓ మహిలా ఎర్నలిస్టు, ఏకంగా కోటి రూపాయలు కొల్లగొట్టిందట.! ఆంధ్ర ప్రదేశ్ రాజకీయాల్లో ఇప్పుడు ఇదో హాట్ టాపిక్.! ఎవరా మహిళా ఎర్నలిస్ట్.? ఏమా కథ.? అధికార వైసీపీకి అత్యంత...

వై నాట్ 175.! వైసీపీ సరే, టీడీపీ లెక్కలేంటి.?

‘మేం వై నాట్ 175 అనే మాటకే కట్టుబడి వున్నాం. ఇంతకీ, టీడీపీ లెక్క ఎంత.?’ ఈ మాట వైసీపీ గట్టిగానే అంటోంది. తెలుగు దేశం పార్టీని ప్రశ్నిస్తోంది. టీడీపీ జాతీయ ప్రధాన...

కాంగ్రెస్ గెలవాలని వైసీపీ కోరుకుంటోందా.?

రాజకీయాల్లో శాశ్వత శతృవులు శాశ్వత మిత్రులు ఎవరూ వుండరన్నది అందరికీ తెలిసిన విషయమే.! ఆ సూత్రాన్ని వైసీపీ కూడా పాటించక తప్పేలా లేదా.? అంటే, ఔననే వాదన వినిపిస్తోందిప్పుడు.! అసలు విషయమేంటంటే, ఆంధ్ర ప్రదేశ్...

జనసేన మీద వైసీపీ నేతలు బెట్టింగ్ కాస్తున్నారా.?

ఇదో ఇంట్రెస్టింగ్ పరిణామం.! అదీ, ఉభయ గోదావరి జిల్లాల్లో చోటు చేసుకుంటున్న వైపరీత్యం.! జనసేన పార్టీ గెలుస్తుందని వైసీపీ నేత ఒకరు భారీ స్థాయిలో డబ్బులు పందెం కాశారట. వేలల్లో అయితే వింతేమీ...

ఎక్కువ చదివినవి

జనసేన మీద వైసీపీ నేతలు బెట్టింగ్ కాస్తున్నారా.?

ఇదో ఇంట్రెస్టింగ్ పరిణామం.! అదీ, ఉభయ గోదావరి జిల్లాల్లో చోటు చేసుకుంటున్న వైపరీత్యం.! జనసేన పార్టీ గెలుస్తుందని వైసీపీ నేత ఒకరు భారీ స్థాయిలో డబ్బులు పందెం కాశారట. వేలల్లో అయితే వింతేమీ...

జగన్ ధీమా సరే.! వైసీపీ దాడుల సంగతేంటి.?

గెలిచే పార్టీ అయితే, తమ ప్రతిష్టను తామే దిగజార్చుకోవాలని అనుకుంటుందా.? రాష్ట్ర వ్యాప్తంగా అల్లర్లకు తెగబడుతుందా.? రాష్ట్రంలో ఎన్నికల పోలింగ్ అనంతరం చోటు చేసుకుంటున్న ఘర్షణలపై ఎవరికైనా సహజంగా కలిగే అనుమానమే ఇది. పల్నాడులో...

గ్రౌండ్ రిపోర్ట్: సంక్షేమ పథకాలు ఓట్లను రాల్చుతాయా.?

ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌కి ముందూ, పోలింగ్ తర్వాతా.. అధికార వైసీపీ, ‘సంక్షేమ పథకాలే మమ్మల్ని గెలిపిస్తాయ్..’ అని చెబుతుండడం చూస్తున్నాం. సంక్షేమం పేరుతో ఓటు బ్యాంకు రాజకీయాలు చేయడం అనేది...

Jr Ntr: స్థల వివాదంలో జూ.ఎన్టీఆర్..! వార్తలపై క్లారిటీ ఇచ్చిన హీరో టీమ్

Jr Ntr: ఓ స్థలం వివాదం విషయమై హీరో ఎన్టీఆర్ హైకోర్టుని ఆశ్రయించారంటూ సోషల్ మీడియాలో ఈరోజు పలు వార్తలు హల్ చల్ చేశాయి. అయితే.. దీనిపై ఎన్టీఆర్ టీమ్ స్పందించింది. ప్రస్తుతం...

కడపలో వైసీపీని వైఎస్ షర్మిల అంతలా దెబ్బ కొట్టిందా.?

ఉమ్మడి కడప జిల్లాతోపాటు రాయలసీమ వ్యాప్తంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి వైఎస్ షర్మిల నుంచి గట్టి దెబ్బ తగలనుందా.? రాష్ట్రంలోని మిగతా జిల్లాల్లోనూ కొన్ని చోట్ల వైఎస్ షర్మిల ఇంపాక్ట్‌కి వైసీపీ కుదేలవనుందా.? ఏపీసీసీ...