Switch to English

పగ్గాలు ప్రియాంక చేతికొచ్చినా.. కాంగ్రెస్‌కి కష్టమే.!

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,421FansLike
57,764FollowersFollow

వందేళ్ళ ఘన చరిత్ర వున్న పార్టీ తమదంటూ కాంగ్రెస్‌ నేతలు చెప్పుకుంటుంటారు. కాంగ్రెస్‌ పార్టీలో అంతర్గత ప్రజాస్వామ్యం ఎక్కువని గొప్పగా చెప్పుకునే నేతలు ఇప్పటికీ కాంగ్రెస్‌లో వున్నారు. కానీ, ఆ నేతలే కాంగ్రెస్‌ పార్టీని క్రమక్రమంగా పాతాళంలోకి తొక్కేస్తున్నారు. దేశంలో వివిధ రాష్ట్రాల్లో కాంగ్రెస్‌ పార్టీ అత్యంత పతనావస్థకు చేరుకోవడానికి కాంగ్రెస్‌ అధిష్టానం కూడా ఓ బలమైన కారణం.

కాంగ్రెస్‌ అధికారంలో వున్నప్పుడు ‘యువనేత రాహుల్‌’ అనే అంశాన్ని హైలైట్‌ చేయడానికి హస్తం పార్టీ నేతలు చేసిన హంగామా అంతా ఇంతా కాదు. ‘రాహుల్‌ని ప్రధానిని చేయడమే లక్ష్యం..’ అంటూ హడావిడి చేసిన చాలామంది నేతలు, కాలక్రమంలో ‘వేరు కుంపటి’ పెట్టేసి, కాంగ్రెస్‌ పార్టీని నిండా ముంచేశారు.. ముంచేస్తూనే వున్నారు. ఇక్కడ, నాయకత్వ లోపమే కాంగ్రెస్‌ పార్టీకి ప్రధాన శతృవు.

ఇందిరా గాందీ, రాజీవ్‌ గాంధీ.. వంటి మహామహులు కాంగ్రెస్‌ పార్టీకి తిరుగులేని ఇమేజ్‌ తెచ్చిపెట్టారు. కానీ, రాహుల్‌ ఏం చేసినట్లు.? రాజకీయాల్లో రాహుల్‌ ఏనాడూ సీరియస్‌గా కన్పించింది లేదు. పార్లమెంటు సాక్షిగా ప్రధానిపై ముద్దులు కురిపించడం.. సోషల్‌ మీడియా వేదికగా సెటైర్లు వేయడం.. ఇలా చెప్పుకుంటూ పోతే, ఈ తరహా వ్యవహారాలతో రాహుల్‌ తన స్థాయిని ఏనాడో దిగజార్చేసుకున్నారు.

నిజానికి, ‘గాంధీ’ ఫ్యామిలీ ఛరిష్మాతో రాహుల్‌, కాంగ్రెస్‌ పార్టీని అత్యద్భుతంగా ముందుకు తీసుకెళ్ళే అవకాశం వుంది. కానీ, ఆయన ఆ అవకాశాన్ని ఏనాడో చేజార్చేసుకున్నారు. పార్టీ అధ్యక్షుడిగా ఎంపికయి, ఎన్నికల్లో ఓటమికి బాధ్యత వహిస్తూ.. ఆ పదవి నుంచి తప్పుకున్న రాహుల్‌, పార్టీ శ్రేణులకు తప్పుడు సంకేతాలు పంపారు. ఇక, అక్కడి నుంచి పార్టీ మరింత నాశనమవుతూ వచ్చింది. అనారోగ్యంతో వున్నా సోనియానే ఎలాగోలా పార్టీని నడుపుతున్నారు. అయితే, ఇప్పుడిక పార్టీ బాధ్యతల్ని ప్రియాంకకు అప్పగించాలన్న డిమాండ్‌ ఊపందుకుంటోంది.

చాలామంది ప్రియాంక నాయకత్వాన్ని కోరుకుంటున్నారు కాంగ్రెస్‌ పార్టీలో. అయితే, ప్రియాంక కూడా అంత సీరియస్‌ పొలిటీషియన్‌లా కన్పించరు. కానీ, రాహుల్‌తో పోల్చితే ప్రియాంక చాలా చాలా బెటర్‌. రాహుల్‌తో పోల్చిచూడటం వరకూ బాగానే వున్నా.. దేశంలో మోడీని ఎదుర్కొనగలిగే రాజకీయ శక్తిగా ప్రియాంక అవతరించే అవకాశం వుందా.? అంటే, కాంగ్రెస్‌లోని అంతర్గత కుమ్ములాటలు ఆమెకు ఆ అవకాశాన్నే ఇవ్వకపోవచ్చని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

6 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

SSMB 29: మహేశ్-రాజమౌళి సినిమాలో మరో స్టార్ హీరో..! నిజమెంత..!?

SSMB 29: సూపర్ స్టార్ మహేశ్ (Mahesh) – రాజమౌళి (Rajamouli) కాంబినేషన్లో ఓ భారీ సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. సినిమా ప్రకటించినప్పటి నుంచీ...

Silk Saree: మే24న వస్తున్న రొమాంటిక్ లవ్ స్టోరీ.. ‘సిల్క్ శారీ’

Silk Saree: వాసుదేవ్ రావు, రీవా చౌదరి, ప్రీతి గోస్వామి హీరో హీరోయిన్లుగా టి. నాగేందర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా "సిల్క్ శారీ" (Silk Saree)....

Jr Ntr: స్థల వివాదంలో జూ.ఎన్టీఆర్..! వార్తలపై క్లారిటీ ఇచ్చిన హీరో...

Jr Ntr: ఓ స్థలం వివాదం విషయమై హీరో ఎన్టీఆర్ హైకోర్టుని ఆశ్రయించారంటూ సోషల్ మీడియాలో ఈరోజు పలు వార్తలు హల్ చల్ చేశాయి. అయితే.....

Prabhas: ఎవరా కొత్త వ్యక్తి..? సెన్సేషన్ క్రియేట్ చేస్తోన్న ప్రభాస్ పోస్ట్

Prabhas: చాలా తక్కువగా సోషల్ మీడియాలో యాక్టివ్ అయ్యే స్టార్ హీరో ప్రభాస్ చేసిన ఇన్ స్టా పోస్ట్ ప్రస్తుతం నెట్టింట విపరీతంగా వైరల్ అవుతోంది....

నాగబాబు ట్విట్టర్ హ్యాండిల్ మాయం.! అల్లు అర్జున్ ఆర్మీ ఎఫెక్టేనా.?

బాబోయ్ బూతులు.. ఇవి మామూలు బూతులు కావు.! బండ బూతులు.! సినీ అభిమానులంటే, అత్యంత జుగుప్సాకరంగా ప్రవర్తించాలా.? సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్ వార్స్ చేసుకోవడం...

రాజకీయం

జనసేన మీద వైసీపీ నేతలు బెట్టింగ్ కాస్తున్నారా.?

ఇదో ఇంట్రెస్టింగ్ పరిణామం.! అదీ, ఉభయ గోదావరి జిల్లాల్లో చోటు చేసుకుంటున్న వైపరీత్యం.! జనసేన పార్టీ గెలుస్తుందని వైసీపీ నేత ఒకరు భారీ స్థాయిలో డబ్బులు పందెం కాశారట. వేలల్లో అయితే వింతేమీ...

నాగబాబు ఈజ్ బ్యాక్.! ట్వీటుని తొలగించిన వైనం.!

సినీ నటుడు, జనసేన నేత కొణిదెల నాగబాబు ట్విట్టర్ అకౌంట్ నుంచి ఓ ట్వీటు పడింది. ‘మాతో వుంటూ ప్రత్యర్థులకి పని చేసేవాడు మా వాడైనా పరాయివాడే, మాతో నిలబడేవాడు పరాయివాడైనా మావాడే..’...

ఐదేళ్ళుగా సినీ పరిశ్రమను దోచేశాం: వైసీపీ అను‘కుల’ మీడియా.!

ఐదేళ్ళపాటు అధికారంలో వున్నాం.. అందినకాడికి సినీ పరిశ్రమని అడ్డగోలుగా దోచేసుకున్నాం.! ఇదీ వైసీపీ అను‘కుల’ మీడియా చెబుతున్నమాట.! ఆంధ్ర ప్రదేశ్‌లో ఐదేళ్ళపాటు అధికారం వెలగబెట్టిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, తన చెప్పు చేతల్లో...

గ్రౌండ్ రిపోర్ట్: సంక్షేమ పథకాలు ఓట్లను రాల్చుతాయా.?

ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌కి ముందూ, పోలింగ్ తర్వాతా.. అధికార వైసీపీ, ‘సంక్షేమ పథకాలే మమ్మల్ని గెలిపిస్తాయ్..’ అని చెబుతుండడం చూస్తున్నాం. సంక్షేమం పేరుతో ఓటు బ్యాంకు రాజకీయాలు చేయడం అనేది...

PM Modi: ‘మీరు చెప్పింది నిజమే..’ రష్మిక పోస్టుకు ప్రధాని మోదీ స్పందన..

PM Modi: ముంబైలో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన ‘ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్’ (MTHL)పై నటి రష్మిక (Rashmika) ప్రయాణించి సోషల్ మీడియాలో తన అనుభూతిని పంచుకున్నారు. దీనిపై ప్రధాని మోదీ (PM Modi)...

ఎక్కువ చదివినవి

Allu Arjun : ‘పుష్ప 2’ లో కీలక రీప్లేస్‌మెంట్‌…!

Allu Arjun : అల్లు అర్జున్‌ హీరోగా సుకుమార్‌ దర్శకత్వంలో రూపొందుతున్న పుష్ప 2 పై అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి. ఆగస్టు లో సినిమా విడుదల అవ్వబోతున్న విషయం తెల్సిందే. విడుదల...

కింగ్ మేకర్ జనసేనాని పవన్ కళ్యాణ్.!

పోలింగ్ ముగిసింది.. కౌంటింగ్ కోసం రాష్ట్రం ఎదురుచూస్తోంది.! ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికలకు సంబంధించి ప్రజా తీర్పు, ఈవీఎంలలో నిక్షిప్తమైంది. జూన్ 4న లెక్కలు తేలతాయ్.! ఈలోగా రకరకాల అంచనాలు.. ఫలానా...

ఆ పధ్నాలుగు వేల కోట్ల రూపాయలు ఏమైపోయాయ్.?

పధ్నాలుగు వేల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు వందల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు కోట్ల రూపాయలకీ చాలా తేడా వుంది.! చాలా చాలా తేడా వుంది.! ఒకటి కాదు, రెండు కాదు... పదీ కాదు,...

Jr Ntr: స్థల వివాదంలో జూ.ఎన్టీఆర్..! వార్తలపై క్లారిటీ ఇచ్చిన హీరో టీమ్

Jr Ntr: ఓ స్థలం వివాదం విషయమై హీరో ఎన్టీఆర్ హైకోర్టుని ఆశ్రయించారంటూ సోషల్ మీడియాలో ఈరోజు పలు వార్తలు హల్ చల్ చేశాయి. అయితే.. దీనిపై ఎన్టీఆర్ టీమ్ స్పందించింది. ప్రస్తుతం...

Kajal : ఎన్టీఆర్‌ పై అభిమానంతో అది చేశా..!

Kajal : టాలీవుడ్‌ చందమామ కాజల్ అగర్వాల్‌ పెళ్లి తర్వాత కాస్త స్లో అయ్యింది. తల్లి అయ్యాక సినిమాలకు గ్యాప్‌ ఇచ్చింది. ఇప్పుడు మళ్లీ సినిమాలతో బిజీ అయ్యేందుకు కాజల్‌ ప్రయత్నాలు చేస్తుంది....