Switch to English

సంయమనం కోల్పోతున్న రాజుగారు.. అసలు కథేంటి.?

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,417FansLike
57,764FollowersFollow

వైసీపీ ఎంపీ రఘురామకృష్ణరాజు, సొంత పార్టీకి పక్కలో బల్లెంలా తయారయ్యారు. ఆయన్ని పార్టీ వదిలించుకోవట్లేదు.. ఆయన పార్టీని వదలట్లేదు. రఘురామకృష్ణరాజుకి వున్న ‘పదవి’ పోగొట్టడానికి మాత్రమే వైసీపీ అధిష్టానం ప్రయత్నిస్తోంది. ఆయన తన పదవి నిలబెట్టుకోవడానికి నానా తంటాలూ పడుతున్నారు. ఈ క్రమంలో రఘురామకృష్ణరాజు, వైసీపీ మధ్య నడుస్తున్న ‘ఫైట్‌’ రోజురోజుకీ కొత్త మలుపులు తిరుగుతోంది.

దాదాపుగా ప్రతిరోజూ ఆయన మీడియా ముందుకొస్తూ, వివిధ అంశాలపై మాట్లాడుతున్నారు. అయితే, గత కొద్ది రోజులుగా ఆయన సంయమనం కోల్పోతున్నారు. కొందర్ని ఉద్దేశించి తిట్టేస్తున్నారు. వైసీపీ నుంచి కొందరు తనకు ఫోన్‌ చేసి బెదిరింపులకు పాల్పడుతున్నారన్నది రఘురామకృష్ణరాజు ఆరోపణ. ‘ముఖ్యమంత్రికి వీర విధేయుడిని.. ఆయన్ని అభిమానిస్తాను.. ప్రేమిస్తాను..’ అని రఘురామ చెబుతోంటే, ఇంకోపక్క.. రఘురామని బూతులు తిడుతూ సోషల్‌ మీడియాలో చెలరేగిపోతున్నారు వైసీపీ అభిమానులు. సోషల్‌ మీడియాలో వచ్చే కామెంట్లు చూసి రఘురామ మరింతగా చెలరేగిపోతుండడం చూస్తోంటే, ఎక్కడో ఆయనలో అసహనం పెరిగిపోతోందన్న అనుమానం కలగకమానదు.

ఈ అసహనం, ఢిల్లీలో తాను అనుకున్నట్లుగా ‘అనుకూల వాతావరణం’ లేకపోవడం వల్లేనంటూ ఢిల్లీ నుంచి మీడియాకి లీకులు అందుతున్నాయి. రాష్ట్ర రాజధాని విషయంలో సరైన సమయంలో కేంద్రం జోక్యం చేసుకుంటుందని రఘురామ చెబితే, కేంద్రమేమో హైకోర్టుకు పలు సందర్భాల్లో సమర్పించిన అఫిడవిట్లలో ‘మా జోక్యం ఏమీ వుండదు’ అని తేల్చేస్తోంది. ఇలా చాలా విషయాల్లో ఢిల్లీ పెద్దల నుంచి రఘురామకు చుక్కెదురవుతుండడంతో ఆ అసహనం ఆయన ‘కొందరు వ్యక్తులపై’ ప్రదర్శిస్తున్నారట.

ఏదిఏమైనా, రఘురామ ఫ్రస్ట్రేషన్‌.. ఆయన పొలిటికల్‌ ఇమేజ్‌ని మరింత డ్యామేజీ చేస్తోంది. సోషల్‌ మీడియాలో నెటిజన్లు ఏవేవో కారుకూతలు కూస్తారు. సోషల్‌ మీడియానే అంత. అదో చెత్త కుప్పలా తయారైన మాట వాస్తవం. అదే సమయంలో కొందరు వైసీపీ నేతలూ, రఘురామపై అవాకులు చెవాకులు పేలుతున్న మాట వాస్తవం. కానీ, రాజుగారి హుందాతనం ఏమయ్యింది.? ‘త్వరలో రఘురామపై అనర్హత వేటు పడబోతోంది’ అనే ధీమా వైసీపీ వర్గాల్లో పెరుగుతోంటే, ఆటోమేటిక్‌గా రఘురామలో ఆత్మవిశ్వాసం కూడా సన్నగిల్లే అవకాశం లేకపోలేదు.

6 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Jani Master: ‘బెంగళూరు రేవ్ పార్టీలో నేనా..?’.. జానీ మాస్టర్ స్పందన...

Jani Master: బెంగళూరు (Bengaluru) లో జరిగిన రేవ్ పార్టీ తెలుగు సినీ పరిశ్రమలో కలకలం రేపింది. పలువురు సినీ, టీవీ నటులు పార్టీలో పాల్గొన్నట్టు...

Hema: ‘నన్ను ఇందులోకి లాగొద్దు..’ బెంగళూరు రేవ్ పార్టీపై నటి హేమ

Hema: బెంగళూరు (Bengaluru) నగర శివారులోని ఎలక్ట్రానిక్ సిటీ సమీపంలో జరిగిన రేవ్ పార్టీ కలకలం రేపుతోంది. ఓ ఫామ్ హౌస్ లో జరిగినట్టుగా వార్తలు...

Jr.Ntr Birthday special: యాక్టింగ్ డైనమైట్.. అభిమానుల సంబరం.. ‘జూ.ఎన్టీఆర్’..

Jr.Ntr Birthday special: బాల నటుడిగానే అద్భుతమైన ప్రతిభ.. యుక్త వయసులోనే హీరో.. తక్కువ సమయంలోనే స్టార్ స్టేటస్.. నటనలో డైనమైట్.. డ్యాన్స్ లో స్పీడ్.....

Jr.Ntr Birthday special: టెక్నీషియన్స్ ఫేవరెట్.. జూ.ఎన్టీఆర్..! ఉదాహరణలివే..

Jr.Ntr Birthday special: తెలుగు సినీ పరిశ్రమలో ఘనమైన కుటుంబ నేపథ్యం ఉన్న కుటుంబాల్లో ఒకటి నందమూరి. విశ్వవిఖ్యాత నట సార్వభౌమ ఎన్టీఆర్ మనవడిగా.. హరికృష్ణ...

చిరంజీవి, కమల్ హాసన్.! ఎవరు గొప్ప నటుడు.?

సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్ వార్స్, ట్రోలింగ్.. ఇవేవీ లేకపోతే, చాలామంది అనాధలైపోతారు.! అనాధలైపోవడమంటే, ఎవరూ పట్టించుకోకుండా పోతారని అర్థం. ఈ లిస్టులో కొందరు సెలబ్రిటీలనబడేవారు...

రాజకీయం

కుప్పంలో చంద్రబాబు ఓడిపోతున్నారట.! వైసీపీ ఉవాచ.!

ఎవరు గెలుస్తారు.? ఎవరు ఓడిపోతారు.? ఈపాటికే ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషీన్లలో ఓటరు తీర్పు నిక్షిప్తమైపోయింది. జాతకాలు జూన్ 4న తేలుతాయ్.! అంటే, జడ్జిమెంట్‌కి సంబంధించి తీర్పు రాసేయబడింది.. అది వెల్లడి కావాల్సి వుందంతే. కానీ,...

కింగ్ మేకర్ జనసేనాని: వైసీపీ అంతర్గత సర్వేల్లో ఇదే తేలిందా.?

టీడీపీ - వైసీపీకి సమానంగా సీట్లు రావొచ్చు. జనసేన పార్టీకి తక్కువలో తక్కువ పన్నెండు సీట్లు వస్తాయ్.! రెండు ఎంపీ సీట్లు కూడా జనసేన గెలుచుకోబోతోంది. ఈ పరిస్థితుల్లో జనసేన అధినేత పవన్...

ఓటు అమ్ముకున్న పోలీస్.! వింతేముంది.?

దొరికేదాకా దొరలే.! దొరికితేనే దొంగ.! ఓ పోలీస్ అధికారి ఓటుని అమ్ముకుని, సస్పెండ్ అయ్యాడు.! ఏంటీ, భారతదేశంలో ఓటుని అమ్ముకోవడం నేరమా.? మరి, కొనుక్కుంటున్న రాజకీయ పార్టీలు, రాజకీయ నాయకుల సంగతేంటి.? ఎమ్మెల్యే టిక్కెట్...

జగన్, చంద్రబాబు.. విదేశీ ‘రాజకీయ’ పర్యటనల వెనుక.!

వైఎస్ జగన్ మోహన్ రెడ్డి లండన్ వెళ్ళారు. నారా చంద్రబాబునాయుడు విదేశాలకు వెళ్ళనున్నారు. పవన్ కళ్యాణ్ కూడా విదేశాలకు వెళ్ళే అవకాశం వుందట. విదేశాలకు వెళితే తప్పేముంది.? ఒకరు విదేశాలకు వెళితే, పారిపోయినట్టు...

వంగా గీత మెగాభిమానం.! నిజమేనా.? నమ్మొచ్చా.?

మెగాస్టార్ చిరంజీవి అన్నయ్య అంటే, నాకు అమితమైన అభిమానం. చిరంజీవి తమ్ముడిగా పవన్ కళ్యాణ్ అన్నా కూడా అభిమానమే. నాగబాబు అంటే కూడా అంతే గౌరవం.! ఈ మాటలు అన్నదెవరో కాదు, కాకినాడ ఎంపీ...

ఎక్కువ చదివినవి

Kajal : ఎన్టీఆర్‌ పై అభిమానంతో అది చేశా..!

Kajal : టాలీవుడ్‌ చందమామ కాజల్ అగర్వాల్‌ పెళ్లి తర్వాత కాస్త స్లో అయ్యింది. తల్లి అయ్యాక సినిమాలకు గ్యాప్‌ ఇచ్చింది. ఇప్పుడు మళ్లీ సినిమాలతో బిజీ అయ్యేందుకు కాజల్‌ ప్రయత్నాలు చేస్తుంది....

గ్రౌండ్ రిపోర్ట్: సంక్షేమ పథకాలు ఓట్లను రాల్చుతాయా.?

ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌కి ముందూ, పోలింగ్ తర్వాతా.. అధికార వైసీపీ, ‘సంక్షేమ పథకాలే మమ్మల్ని గెలిపిస్తాయ్..’ అని చెబుతుండడం చూస్తున్నాం. సంక్షేమం పేరుతో ఓటు బ్యాంకు రాజకీయాలు చేయడం అనేది...

Hema: ‘నన్ను ఇందులోకి లాగొద్దు..’ బెంగళూరు రేవ్ పార్టీపై నటి హేమ

Hema: బెంగళూరు (Bengaluru) నగర శివారులోని ఎలక్ట్రానిక్ సిటీ సమీపంలో జరిగిన రేవ్ పార్టీ కలకలం రేపుతోంది. ఓ ఫామ్ హౌస్ లో జరిగినట్టుగా వార్తలు వస్తున్నాయి. ఇందులో నటి హేమ (Hema)...

Elephant: గున్న ఏనుగుకు జెడ్ కేటగిరీ భద్రత.. వీడియో వైరల్

Elephant: కుటుంబం తమ పిల్లల సంరక్షణను ఎలా చూసుకుంటుందో మానవ సంబంధాలలో చూస్తూంటాం. తమకూ తెలుసనిపించేలా ఉన్న అడవిలోని ఏనుగులకు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది. ఐఏఎస్ అధికారిణి సుప్రియా సాహు ‘ఎక్స్’లో...

Jani Master: ‘బెంగళూరు రేవ్ పార్టీలో నేనా..?’.. జానీ మాస్టర్ స్పందన ఇదే

Jani Master: బెంగళూరు (Bengaluru) లో జరిగిన రేవ్ పార్టీ తెలుగు సినీ పరిశ్రమలో కలకలం రేపింది. పలువురు సినీ, టీవీ నటులు పార్టీలో పాల్గొన్నట్టు వార్తలు రావడమే ఇందుకు కారణం. ప్రముఖ...