Switch to English

త్యాగాల ‘సీమ’పై ఇంత దయలేనితనమా.?

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,418FansLike
57,764FollowersFollow

రాజధాని అమరావతి సమీప భవిష్యత్తులో ‘గతించిన చరిత్ర’ కాబోతోంది. ఇందులో ఇంకో మాటకు తావు లేదు. అలాగని, అక్కడ మళ్ళీ వ్యవసాయం తప్పదనుకుంటే పొరపాటే. అటు వ్యవసాయానికీ, ఇటు అభివృద్ధికీ నోచుకోకుండా పోనుంది అమరావతి. అయితే, విజయవాడ – గుంటూరు నగరాల మధ్య వున్న ప్రాంతం కావడంతో, అమరావతిలో ఎంతో కొంత అభివృద్ధి ఎప్పటికో ఒకప్పటికి కన్పిస్తుంది. ‘బిచ్చం’ వేసినట్లు కొన్ని విద్యా సంస్థలో, ఇంకొకటో ఏర్పాటు చేసేయనుంది వైఎస్‌ జగన్‌ సర్కార్‌.

విశాఖపట్నం, రాజధానిగా ఎంతటి ‘కొత్త’ అభివృద్ధిని చూడబోతోందన్నది ఇప్పుడే చెప్పలేం. ఎందుకంటే, అక్కడైనా.. అభివృద్ధి కోసం వేల కోట్లు ఖర్చు చేయాల్సిందే.. వేరే దారి లేదు. అంత ఆర్థిక శక్తీ రాష్ట్ర ప్రభుత్వానికి లేదు. కర్నూలులో హైకోర్టుని ఏర్పాటు చేయడం ఖాయంగానే కన్పిస్తోంది. అయితే, దీనికి కేంద్రం అనుమతి కావాలి. విశాఖ పరిస్థితీ అంతే. అవన్నీ ఇప్పటికిప్పుడు అయిపోతాయని అనుకోలేం.

ఎగ్జిక్యూటివ్‌ క్యాపిటల్‌గా విశాఖ మాత్రం.. అతి త్వరలోనే అందుబాటులోకి వస్తుంది.. అద్దె భవనాల్లో కార్యాలయాలూ షురూ అవుతాయి. ఇంతకీ, రాయలసీమ పరిస్థితేంటి.? ఎప్పుడో మద్రాస్‌ రాష్ట్రం నుంచి విడిపోయినప్పుడు ఆంధ్ర రాష్ట్రానికి కర్నూలు రాజధానిగా వుండేది. ఆ కర్నూలుని రాజధాని చేయాలన్న డిమాండ్‌ సీమ వాసుల్లో విన్పిస్తోంది. కర్నూలు మాత్రమే కాదు, రాష్ట్రంలో ఏ నగరమైనా అభివృద్ధి చెందాల్సిందే.. ఇందులో ఇంకో మాటకు తావు లేదు. అన్నీ వున్నా అల్లుడి నోట్లో శని.. అన్నట్లు ఆంధ్రప్రదేశ్‌కి చాలా నగరాలున్నాయి.. అంతకు మించిన సమస్యలున్నాయి.

చిత్తూరు జిల్లాలో తిరుపతి, కడప జిల్లాలో కడప, అనంతపురం జిల్లాలో అనంతపురం.. ఇలా ప్రతి జిల్లా రాజధానీ అభివృద్ధి చెందాలి. ద్వితీయ శ్రేణి నగరాలూ అభివృద్ధి చెంది తీరాల్సిందే. మాటలు చెప్పడం సులభమే.. కానీ, చిత్తశుద్ధి లేని రాజకీయాల్లో ఏదీ అంత సులభం కానే కాదు. శ్రీశైలం నీటి విషయంలో భంగపడ్డాం.. అని రాయలసీమ వాసులు ఇప్పుడు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

నిజానికి అది దశాబ్దాల ఆవేదన. ఇప్పుడు ఇంకాస్త గట్టిగా విన్పిస్తోందంతే. తెలంగాణ ప్రభుత్వంతో మాట్లాడి, ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌, రాయలసీమకు న్యాయం చేయాల్సిన అవసరం వుంది. కానీ, ఇక్కడ సమస్య ఏంటంటే.. కృష్ణా – గుంటూరు జిల్లాలు తమ నీటిని లాక్కుపోతున్నాయని సీమ నేతలు చెబుతున్నారు.

రాజకీయాల్లో అన్ని పదవులూ అనుభవించి, ఇప్పుడు తీరిగ్గా సీమ హక్కుల గురించి పోరాడుతున్నారు నేతలు. సీమ వెనుకాబుటతనానికి అయినా, ఉత్తరాంధ్ర వెనుకబాటుతనానికి అయినా, ప్రకాశం – గుంటూరు జిల్లాల్లోని చాలా ప్రాంతాల వెనుకాబటుతనానికి అయినా.. రాజకీయ నాయకులే బాధ్యత వహించాలి. అన్ని పార్టీలకూ ఈ పాపంలో భాగముంది. సీమ మీద అంత ప్రేమ వైఎస్‌ జగన్‌కి వుంటే, ఆ ఎగ్జిక్యూటివ్‌ క్యాపిటల్‌ లేదో సీమకి.. అదే కర్నూలుకి ఇవ్వొచ్చు కదా.!

5 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Hema: ‘నన్ను ఇందులోకి లాగొద్దు..’ బెంగళూరు రేవ్ పార్టీపై నటి హేమ

Hema: బెంగళూరు (Bengaluru) నగర శివారులోని ఎలక్ట్రానిక్ సిటీ సమీపంలో జరిగిన రేవ్ పార్టీ కలకలం రేపుతోంది. ఓ ఫామ్ హౌస్ లో జరిగినట్టుగా వార్తలు...

Jr.Ntr Birthday special: యాక్టింగ్ డైనమైట్.. అభిమానుల సంబరం.. ‘జూ.ఎన్టీఆర్’..

Jr.Ntr Birthday special: బాల నటుడిగానే అద్భుతమైన ప్రతిభ.. యుక్త వయసులోనే హీరో.. తక్కువ సమయంలోనే స్టార్ స్టేటస్.. నటనలో డైనమైట్.. డ్యాన్స్ లో స్పీడ్.....

Jr.Ntr Birthday special: టెక్నీషియన్స్ ఫేవరెట్.. జూ.ఎన్టీఆర్..! ఉదాహరణలివే..

Jr.Ntr Birthday special: తెలుగు సినీ పరిశ్రమలో ఘనమైన కుటుంబ నేపథ్యం ఉన్న కుటుంబాల్లో ఒకటి నందమూరి. విశ్వవిఖ్యాత నట సార్వభౌమ ఎన్టీఆర్ మనవడిగా.. హరికృష్ణ...

చిరంజీవి, కమల్ హాసన్.! ఎవరు గొప్ప నటుడు.?

సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్ వార్స్, ట్రోలింగ్.. ఇవేవీ లేకపోతే, చాలామంది అనాధలైపోతారు.! అనాధలైపోవడమంటే, ఎవరూ పట్టించుకోకుండా పోతారని అర్థం. ఈ లిస్టులో కొందరు సెలబ్రిటీలనబడేవారు...

Prabhas: ప్రభాస్ చెప్పిన బుజ్జి ఇదే.. ఉత్కంఠ రేకెత్తిస్తున్న వీడియో

Prabhas: స్టార్ హీరో ప్రభాస్ (Prabhas) ఇటివల ‘హాయ్.. డార్లింగ్స్. నా లైఫ్ లోకి కొత్తగా ఒకరు వస్తున్నారు. వెయిట్ చేయండి’ అనే పోస్ట్ బాగా...

రాజకీయం

జగన్, చంద్రబాబు.. విదేశీ ‘రాజకీయ’ పర్యటనల వెనుక.!

వైఎస్ జగన్ మోహన్ రెడ్డి లండన్ వెళ్ళారు. నారా చంద్రబాబునాయుడు విదేశాలకు వెళ్ళనున్నారు. పవన్ కళ్యాణ్ కూడా విదేశాలకు వెళ్ళే అవకాశం వుందట. విదేశాలకు వెళితే తప్పేముంది.? ఒకరు విదేశాలకు వెళితే, పారిపోయినట్టు...

వంగా గీత మెగాభిమానం.! నిజమేనా.? నమ్మొచ్చా.?

మెగాస్టార్ చిరంజీవి అన్నయ్య అంటే, నాకు అమితమైన అభిమానం. చిరంజీవి తమ్ముడిగా పవన్ కళ్యాణ్ అన్నా కూడా అభిమానమే. నాగబాబు అంటే కూడా అంతే గౌరవం.! ఈ మాటలు అన్నదెవరో కాదు, కాకినాడ ఎంపీ...

కోటి రూపాయలు కొల్లగొట్టిన మహిళా ఎర్నలిస్ట్ ఎవరు.?

ఎన్నికల సమయంలో ఓ మహిలా ఎర్నలిస్టు, ఏకంగా కోటి రూపాయలు కొల్లగొట్టిందట.! ఆంధ్ర ప్రదేశ్ రాజకీయాల్లో ఇప్పుడు ఇదో హాట్ టాపిక్.! ఎవరా మహిళా ఎర్నలిస్ట్.? ఏమా కథ.? అధికార వైసీపీకి అత్యంత...

వై నాట్ 175.! వైసీపీ సరే, టీడీపీ లెక్కలేంటి.?

‘మేం వై నాట్ 175 అనే మాటకే కట్టుబడి వున్నాం. ఇంతకీ, టీడీపీ లెక్క ఎంత.?’ ఈ మాట వైసీపీ గట్టిగానే అంటోంది. తెలుగు దేశం పార్టీని ప్రశ్నిస్తోంది. టీడీపీ జాతీయ ప్రధాన...

కాంగ్రెస్ గెలవాలని వైసీపీ కోరుకుంటోందా.?

రాజకీయాల్లో శాశ్వత శతృవులు శాశ్వత మిత్రులు ఎవరూ వుండరన్నది అందరికీ తెలిసిన విషయమే.! ఆ సూత్రాన్ని వైసీపీ కూడా పాటించక తప్పేలా లేదా.? అంటే, ఔననే వాదన వినిపిస్తోందిప్పుడు.! అసలు విషయమేంటంటే, ఆంధ్ర ప్రదేశ్...

ఎక్కువ చదివినవి

వై నాట్ 175.! వైసీపీ సరే, టీడీపీ లెక్కలేంటి.?

‘మేం వై నాట్ 175 అనే మాటకే కట్టుబడి వున్నాం. ఇంతకీ, టీడీపీ లెక్క ఎంత.?’ ఈ మాట వైసీపీ గట్టిగానే అంటోంది. తెలుగు దేశం పార్టీని ప్రశ్నిస్తోంది. టీడీపీ జాతీయ ప్రధాన...

ఎర్ర టవల్ చూస్తే వంగా గీతకు అంత భయమెందుకు.?

పిఠాపురం వైసీపీ అభ్యర్థి వంగా గీతకి ఓ పోలింగ్ కేంద్రంలో చిత్రమైన అనుభవం ఎదురయ్యింది. ‘నమస్కారం పెడుతూ, నాకు ఓటెయ్యడం మర్చిపోవద్దు..’ అంటూ క్యూలైన్లలో వున్న ఓటర్లను అభ్యర్థిస్తూ వెళ్ళడంపై కొందరు ఓటర్లు...

Elephant: గున్న ఏనుగుకు జెడ్ కేటగిరీ భద్రత.. వీడియో వైరల్

Elephant: కుటుంబం తమ పిల్లల సంరక్షణను ఎలా చూసుకుంటుందో మానవ సంబంధాలలో చూస్తూంటాం. తమకూ తెలుసనిపించేలా ఉన్న అడవిలోని ఏనుగులకు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది. ఐఏఎస్ అధికారిణి సుప్రియా సాహు ‘ఎక్స్’లో...

గ్రౌండ్ రిపోర్ట్: సంక్షేమ పథకాలు ఓట్లను రాల్చుతాయా.?

ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌కి ముందూ, పోలింగ్ తర్వాతా.. అధికార వైసీపీ, ‘సంక్షేమ పథకాలే మమ్మల్ని గెలిపిస్తాయ్..’ అని చెబుతుండడం చూస్తున్నాం. సంక్షేమం పేరుతో ఓటు బ్యాంకు రాజకీయాలు చేయడం అనేది...

Kajal : ఎన్టీఆర్‌ పై అభిమానంతో అది చేశా..!

Kajal : టాలీవుడ్‌ చందమామ కాజల్ అగర్వాల్‌ పెళ్లి తర్వాత కాస్త స్లో అయ్యింది. తల్లి అయ్యాక సినిమాలకు గ్యాప్‌ ఇచ్చింది. ఇప్పుడు మళ్లీ సినిమాలతో బిజీ అయ్యేందుకు కాజల్‌ ప్రయత్నాలు చేస్తుంది....