Switch to English

అచ్చెన్న ఆరాటం.. ‘బీసీ’ వాయిస్‌ అప్పుడెందుకు పెరగలేదో.!

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,429FansLike
57,764FollowersFollow

వైఎస్‌ జగన్‌ హయాంలో ‘కీలక పదవులు’ అన్నీ ‘రెడ్డి’ సామాజిక వర్గానికే దక్కుతున్నాయన్నది నిర్వివాదాంశం. ఇందులో దాపరికం ఏమీ లేదు. కానీ, చంద్రబాబు హయాంలో ఏం జరిగింది.? అప్పుడు ‘కమ్మ’ సామాజిక వర్గానికి అగ్ర తాంబూళం దక్కింది. అప్పట్లో ‘కమ్మ’గా అనిపించిన చంద్రబాబు రాజకీయం, ఇప్పుడు వైఎస్‌ జగన్‌ రాజకీయం చేదుగా అనిపిస్తోంది మాజీ మంత్రి, టీడీపీ సీనియర్‌ నేత, టీడీపీ ఏపీ అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడికి. ఒక్కటి మాత్రం నిజం.. చంద్రబాబు, వైఎస్‌ జగన్‌ వేర్వేరు కాదు.! ఇద్దరూ దాదాపు సమానమే. కాకపోతే, ‘కులాభిమానం’ విషయంలో ఒకరికంటే ఇంకొకరు ఇంకాస్త ఎక్కువ.. అంతే తేడా.

‘బీసీల సంక్రాంతి’ అంటూ ఇటీవల వైఎస్‌ జగన్‌ ఓ కార్యక్రమంలో పాల్గొన్నారు. బీసీల్ని ఉద్ధరించేస్తున్నామని చెప్పుకున్నారు. అక్కడికి హాజరైన వైసీపీ బీజేపీ నేతలకు తెలియదా.. తమ పార్టీ హయాంలో కీలక పదవులు ఎవరికి దక్కుతున్నాయో. అంతెందుకు, వైసీపీ కోటరీ అంటే ఎవరు.? అందులో ఒక్కరైనా బీసీలు వున్నారా.? వైఎస్‌ జగన్‌ హయాంలో ‘రెడ్డి’ అనేది అదనపు క్వాలిఫికేషన్‌ అయిపోయింది కీలక పదవులకు సంబంధించి. చంద్రబాబు హయాంలో పోలీస్‌ విభాగంలో ప్రమోషన్‌కి సంబంధించి ‘కమ్మతి’ ప్రాధాన్యత ఇవ్వడం అప్పట్లో పెను దుమారం రేపింది. మరి, ఇప్పుడు ఏం జరుగుతోంది.? ‘అంతకు మించి’ అనే స్థాయిలో ఆయా విభాగాల్లో రెడ్డి సామాజిక వర్గానికి అత్యధిక అవకాశాలు అనూహ్యంగా దక్కుతున్నాయన్న వాదనలు వినిపిస్తున్నాయి. వైఎస్సార్సీపీ ప్రతిపక్షంలో వున్నప్పుడు టీడీపీ పాలనపైనా, టీడీపీ ప్రతిపక్షంలో వున్నప్పుడు వైఎస్సార్సీపీ పాలనపైనా.. విమర్శల్ని ఎలా అర్థం చేసుకోవాలి.? ఇద్దరూ ఇద్దరే.!

అప్పుడు వాళ్ళు, ఇప్పుడు వీళ్ళు.. తమవాళ్ళకి వీలైనంత ఎక్కువ ‘న్యాయం’ చేస్తున్నారంతే. చంద్రబాబు హయాంలో టీడీపీ అనుకూల మీడియా అడ్డగోలుగా ప్రకటనల రూపంలోనూ, ఇతరత్రా రూపంలోనూ సంపాదించింది. ఇప్పుడు వైసీపీ అనుకూల మీడియా పండగ చేసుకుంటోంది. మంత్రిగా పనిచేసిన అచ్చెన్నాయుడికి ఈ ‘కుల సమీకరణాలు’ తెలియవని ఎలా అనుకోగలం.? రేప్పొద్దున్న ప్రభుత్వం మారి, మళ్ళీ చంద్రబాబు గద్దెనెక్కితే.. ఇప్పుడు జగన్‌ ‘రెడ్డి’ సామాజిక వర్గంపై చూపిన ప్రేమకు పదింతలు ప్రేమ, చంద్రబాబు ‘కమ్మ’ సామాజిక వర్గంపై చూపుతారన్నది నిర్వివాదాంశం. అప్పుడు ‘మా బాబు.. బీసీల్ని ఉద్ధరించేస్తున్నాడు..’ అని అచ్చెన్న అనకుండా వుంటారా.?

1 COMMENT

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Telangana: తెలంగాణలో 2వారాలపాటు సినిమాలు బంద్..! కారణాలివే..

Telangana: ప్రస్తుత రోజుల్లో ధియేటర్లలో సినిమా నడవడమే కష్టమవుతోంది. బాగున్న సినిమా.. పెద్ద సినిమా.. చిన్న సినిమాగా లెక్కలు మారిపోయాయి. విడుదలైన కొద్దిరోజుల్లోనే ఓటీటీల్లో రావడం.....

‘రామ జన్మభూమి’ తో సీనియర్‌ స్టార్‌ డైరెక్టర్‌ రీ ఎంట్రీ

సినీ ప్రేక్షకులకు ఎన్నో సూపర్‌ హిట్ సినిమాలను అందించిన సీనియర్ దర్శకుడు సముద్ర ఈ మధ్య కాలంలో సినిమాలకు కాస్త దూరంగా ఉంటున్నారు. ఆయన నుంచి...

Chiranjeevi : అసెంబ్లీలో వాళ్ల భాష విని షాక్ అయ్యాను :...

Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవి అత్యున్నత పురస్కారం పద్మవిభూషణ్‌ అందుకున్న నేపథ్యంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. చిరంజీవిని సన్మానించిన కిషన్ రెడ్డి...

Ram : బన్నీ కంటే ముందు రామ్‌ తో త్రివిక్రమ్‌..?

Ram : మాటల మాంత్రికుడు ఈ సంక్రాంతికి గుంటూరు కారం సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. మహేష్ బాబు, శ్రీలీల జంటగా నటించిన ఆ సినిమా...

Prabhas : కన్నప్పతో జాయిన్‌ అయిన కల్కి

Prabhas : మంచు విష్ణు ప్రతిష్టాత్మకంగా తీసుకుని నిర్మిస్తూ నటిస్తున్న కన్నప్ప మూవీలో యంగ్‌ రెబల్‌ స్టార్ ప్రభాస్‌ కనిపించబోతున్నాడు అనే విషయం తెల్సిందే. ఇప్పటికే...

రాజకీయం

బాబూ.. రాంబాబూ.! రీపోలింగ్ కావాలా.?

మంత్రి అంబటి రాంబాబుకి రీ-పోలింగ్ కావాలట.! ఎంత కష్టమొచ్చింది.? రీ-పోలింగ్ అడుగుతున్నారంటే, ఓటమిని ముందే ఒప్పుకున్నట్లు కదా.? పోలింగ్ సరళి చూశాక ‘సంబరాల’ రాంబాబుకి మైండ్ బ్లాంక్ అయ్యిందని, సత్తెనపల్లి నియోజకవర్గ ప్రజలే...

కింగ్ మేకర్ జనసేనాని పవన్ కళ్యాణ్.!

పోలింగ్ ముగిసింది.. కౌంటింగ్ కోసం రాష్ట్రం ఎదురుచూస్తోంది.! ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికలకు సంబంధించి ప్రజా తీర్పు, ఈవీఎంలలో నిక్షిప్తమైంది. జూన్ 4న లెక్కలు తేలతాయ్.! ఈలోగా రకరకాల అంచనాలు.. ఫలానా...

వైసీపీ కొంప ముంచేసిన ‘నాడు – నేడు’.!

రాష్ట్ర వ్యాప్తంగా ‘నాడు - నేడు’ కార్యక్రమం ద్వారా ప్రభుత్వ స్కూళ్ళలో అత్యద్భుతమైన అభివృద్ధి చూపించామని వైసీపీ అధినేత, ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చెబుతూ వచ్చారు. వైసీపీ...

ఎమ్మెల్యే చెంప పగలగొట్టిన సామాన్యుడికి ‘కులాన్ని’ ఆపాదిస్తారా.?

ఎమ్మెల్యేని ఓ సామాన్యుడు దూషించాడట.! దాంతో, ఎమ్మెల్యేకి కోపమొచ్చిందట. అయినాగానీ, శాంతంగానే వున్నాడట ఆయన. సదరు సామాన్యుడే, కులోన్మాదంతో సదరు ఎమ్మెల్యే చెంప పగలగొట్టేశాడట. తీవ్రంగా దాడి చేశాడట. దాడిలో గాయపడి ఆసుపత్రి పాలయ్యింది...

పాపం రోజా.! ఓటమి ఖాయమైనట్టే కనిపిస్తోంది.!

అంతా అనుకున్నట్టే జరుగుతోంది. రోజా భయపడ్డట్టే జరుగుతోంది నగిరిలో.! రోజాకి శతృవులు టీడీపీలోనో, ఇంకో పార్టీలోనో లేరు.. సాక్షాత్తూ సొంత పార్టీలోనే రోజాకి శతృవులున్నారన్న విషయం ఇంకోసారి స్పష్టమైంది. ‘నాకు టీడీపీతో ఇబ్బంది లేదు.....

ఎక్కువ చదివినవి

కింగ్ మేకర్ జనసేనాని పవన్ కళ్యాణ్.!

పోలింగ్ ముగిసింది.. కౌంటింగ్ కోసం రాష్ట్రం ఎదురుచూస్తోంది.! ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికలకు సంబంధించి ప్రజా తీర్పు, ఈవీఎంలలో నిక్షిప్తమైంది. జూన్ 4న లెక్కలు తేలతాయ్.! ఈలోగా రకరకాల అంచనాలు.. ఫలానా...

బాబూ.. రాంబాబూ.! రీపోలింగ్ కావాలా.?

మంత్రి అంబటి రాంబాబుకి రీ-పోలింగ్ కావాలట.! ఎంత కష్టమొచ్చింది.? రీ-పోలింగ్ అడుగుతున్నారంటే, ఓటమిని ముందే ఒప్పుకున్నట్లు కదా.? పోలింగ్ సరళి చూశాక ‘సంబరాల’ రాంబాబుకి మైండ్ బ్లాంక్ అయ్యిందని, సత్తెనపల్లి నియోజకవర్గ ప్రజలే...

పిఠాపురంలో వైసీపీ పంపకాలు.! ఓటుకు ఐదు వేలు.. ఆ పైన.!

ఎన్నికల పోలింగ్‌కి రంగం సిద్ధమయ్యింది. ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ అలాగే, లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో, రాజకీయ పార్టీల ప్రచారం తుది అంకానికి చేరుకుంటోంది. మే 13న పోలింగ్ కావడంతో, ఒక్కసారిగా ఎన్నికల...

Telangana: తెలంగాణలో 2వారాలపాటు సినిమాలు బంద్..! కారణాలివే..

Telangana: ప్రస్తుత రోజుల్లో ధియేటర్లలో సినిమా నడవడమే కష్టమవుతోంది. బాగున్న సినిమా.. పెద్ద సినిమా.. చిన్న సినిమాగా లెక్కలు మారిపోయాయి. విడుదలైన కొద్దిరోజుల్లోనే ఓటీటీల్లో రావడం.. మరోవైపు.. ఆన్ లైన్ వేదికల్లో కొత్త...

Prabhas : కన్నప్పతో జాయిన్‌ అయిన కల్కి

Prabhas : మంచు విష్ణు ప్రతిష్టాత్మకంగా తీసుకుని నిర్మిస్తూ నటిస్తున్న కన్నప్ప మూవీలో యంగ్‌ రెబల్‌ స్టార్ ప్రభాస్‌ కనిపించబోతున్నాడు అనే విషయం తెల్సిందే. ఇప్పటికే ఆ విషయాన్ని అధికారికంగా ప్రకటించిన మంచు...