కరోనా మహమ్మారిని నిరోధించడానికి అమెరికా ఫార్మా కంపెనీ ఫైజర్ అభివృద్ధి చేసిన వ్యాక్సిన్ కు ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) ఆమోదం తెలిపింది. అత్యవసర ప్రాతిపదికన ఈ టీకాను వినియోగించవచ్చని పేర్కొంది. తద్వారా డబ్ల్యూహెచ్ఓ ఆమోదం పొందిన తొలి కరోనా వ్యాక్సిన్ గా ఫైజర్ టీకా గుర్తింపు తెచ్చుకున్నట్టయింది. జర్మన్ కంపెనీ బయోఎన్ టెక్ తో కలిసి ఫైజర్ కంపెనీ ఈ టీకాను రూపొందించింది. ఇప్పటికే ఈ వ్యాక్సిన్ ను అగ్రరాజ్యం అమెరికాతోపాటు బ్రిటన్, కెనడా, బహ్రెయిన్ తదితర దేశాల్లో అత్యవసర ప్రాతిపదికన వినియోగిస్తున్నారు.
అమెరికాలో ఫైజర్ తోపాటు మోడెర్నా టీకాకూ అనుమతి ఇవ్వగా.. బ్రిటన్ లో ఆస్ట్రాజెనెకా వ్యాక్సిన్ కు అనుమతి ఇచ్చారు. మనదేశంలోనూ ఫైజర్ టీకా వినియోగించాలని తొలుత భావించినా.. చివరకు ఆక్స్ ఫర్డ్ యూనివర్సిటీ సహకారంతో ఆస్ట్రాజెనెకా రూపొందించిన టీకాకే కేంద్ర ప్రభుత్వం మొగ్గు చూపింది. ఫైజర్ వ్యాక్సిన్ ఖరీదు ఎక్కువ కావడంతోపాటు నిల్వ చేసే విషయంలో ఉన్న పరిమితుల కారణంగా ఆస్ట్రాజెనెకా టీకాను వినియోగించాలని కేంద్రం భావిస్తోంది. ఫైజర్ తో పోలిస్తే ఆస్ట్రాజెనెకా వ్యాక్సిన్ ఖరీదు తక్కువే కాకుండా.. నిల్వ చేసే విషయంలోనూ సౌకర్యవంతంగా ఉండటమే ఇందుకు కారణం.
786790 391971Numerous thanks for this certain info I was basically browsing all Search engines to discover it! 571943
108446 586234Absolutely pent topic matter, appreciate it for selective details . 500368