భారత్ లో బద్దకస్తులు ఎక్కువవుతున్నారా..? అవుననే అంటోంది ప్రపంచ ఆరోగ్య సంస్థ. 11-17 ఏళ్ల వయసు వారిలో 74 శాతం శారీరక శ్రమ చేయడంలేదని.. వీరిలో బాలురు 72శాతం, బాలికలు 76శాతంగా పేర్కొంది. దీంతో వ్యాధులు, జబ్బులు పెరిగి చికిత్స ఖర్చులు పెరుగుతున్నాయని అంటోంది. వచ్చే పదేళ్లలో శారీరక శ్రమ చేయకపోవడం వల్ల 50కోట్ల మంది దీర్ఘకాలిక వ్యాధుల బారిన పడే అవకాశం ఉందని హెచ్చరించింది. వీరిలో దిగువ మధ్య ఆదాయ దేశాల్లోనే ఉంటాయని పేర్కొంది.
47శాతం మంది వ్యాయామం లేక బీపీ.. 43శాతం మానసిక రుగ్మతల కేసులు నమోదయ్యే అవకాశం ఉందని తెలిపింది. 18ఏళ్లు పైబడ్డ వారిలో మహిళలు 44శాతం, పురుషులు 25శాతం.. 70ఏళ్లు పైబడ్డ వారిలో 60శాతం మహిళలు, 38శాతం పురుషులు వ్యాయామం చేయడంలేదని పేర్కొంది. దీంతో షుగర్, బీపీ, గుండె, క్యాన్సర్, పెరాలసిస్, మానసిక సమస్యలు పెరుగుతున్నాయిని ఆందోళన వ్యక్తం చేసింది. ఈ జబ్బులను నయం చేసేందుకు దేశంలో ఏడాదికి చికిత్స ఖర్చులు రూ.25,600 కోట్లుగా ఉందని తెలిపింది.
రాబోయే పదేళ్లలో ఇది రూ.2.5లక్షల కోట్లకు చేరే అవకాశముందని తెలిపింది. దేశంలో సంభవించే మరణాల్లో 30శాతం గుండె సంబంధిత వ్యాధులు, 66శాతం దీర్ఘకాలిక వ్యాధులతోనే అని పేర్కొంది. మిగిలిన వారు క్యాన్సర్, ఊపిరితిత్తులు.. ఇతర వ్యాధులతో చనిపోతున్నారు. ఇదంతా శారీరక శ్రమ లేకపోవడం వల్లనే అని తెలిపింది. ఇందుకు ప్రపంచ ఆరోగ్య సంస్థ కొన్ని సూచనలు చేసింది.
-
11-17 ఏళ్ల మధ్య వయసు వారు రోజుకు గంట శారీరక శ్రమ చేయాలి
-
18ఏళ్లు పైబడ్డ వారు వారానికి రెండుసార్లు కండరాలు బలపడే వ్యాయం చేయాలి
-
18ఏళ్లు పైబడ్డ వారు వారానికి 150-300 మధ్యస్థ శారీరక శ్రమ చేయాలి
-
50ఏళ్లు పైబడ్డ వారు వారానికి 3సార్లు వ్యాయామం చేయాలి
-
ప్రతి ఒక్కరూ వారానికి 300 నిముషాల వ్యాయామం చేయాలి
-
2050 నాటికి శారీరక శ్రమ లేకపోవడం అనే స్థితిని 15శాతానికి తగ్గించాలి
-
వాకింగ్ ట్రాక్ లు నిర్మించాలి
-
వాహనాల వేగాన్ని నియంత్రణలో ఉంచాలి
-
డ్రంక్ అండ్ డ్రైవ్, మొబైల్ మాట్లాడుతూ వాహనాలు నడపడాన్ని నియంత్రించాలి
421358 362702For some cause the picture just isnt loading appropriately, is at this time there an issue? 432917
722397 228137Howdy! I just want to give an enormous thumbs up for the fantastic details you might have here on this post. I will likely be coming back to your weblog for more soon. 256009
399692 713334The Case For HIIT Cardio – Why You need to Concider it By the way you might want to take a look at this cool web site I found 106214