టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు, ప్రస్తుత వైఎస్ జగన్ ప్రభుత్వానికి డెడ్లైన్ విధించారు. ’48 గంటల్లో అసెంబ్లీని రద్దు చేయాలి’ అన్నది చంద్రబాబు పెట్టిన డెడ్లైన్. ‘మూడు రాజధానులపై మీ వాదన సబబేనని మీరు నమ్ముతోంటే, 48 గంటల్లో అసెంబ్లీని రద్దు చేసి, ఎన్నికలకు వెళ్ళాలి.. అప్పుడు ప్రజా తీర్పు మూడు రాజధానులకు అనుకూలమో, అమరావతికి అనుకూలమో తేలిపోతుంది..’ అని చంద్రబాబు వీరావేశంతో అల్టిమేటం జారీ చేసేశారు వైఎస్ జగన్ ప్రభుత్వానికి. ‘మేమెందుకు రాజీనామా చేస్తాం.?’ అని ఇప్పటికే అధికార పార్టీ ‘చేతులెత్తేసిన వైనం’పై ఆ పార్టీ నేతలు ప్రకటనలు చేసేశారనుకోండి.. అది వేరే సంగతి.
ఇంతకీ, 48 గంటల డెడ్లైన్ తర్వాత చంద్రబాబు ఏం చేస్తారు.? టీడీపీకి చెందిన 23 మంది ఎమ్మెల్యేలతో రాజీనామా చేసి, ఉప ఎన్నికలకు వెళతారా.? ఈ విషయమై రాష్ట్ర రాజకీయాల్లో ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది. నిజానికి రాజీనామా అనేది ‘చివరి అస్త్రం’. వైసీపీ ఎంపీలు, ప్రత్యేక హోదా కోసమంటూ గతంలో రాజీనామా చేశారు.. కానీ, ఎప్పుడు.? తమ రాజీనామాలతో ఉప ఎన్నికలు రావని తెలిశాక. ఢిల్లీలో మేటర్ మొత్తం క్లియర్ చేసుకున్నాక, తెలివిగా వైసీపీ ఎంపీలు రాజీనామా చేశారు.. అది వారికి, 2019 ఎన్నికల్లో బాగా కలిసొచ్చింది.
ఎన్నికలు జరిగి ఏడాది మాత్రమే పూర్తయ్యింది. ఇంకో మూడున్నరేళ్ళదాకా ఎన్నికల గోల లేదు. మరి, ఇప్పుడెందుకు వైసీపీ ప్రజా ప్రతినిథులు రాజీనామా చేస్తారు.? టీడీపీ అయినా ఆ పని ఎందుకు చేయగలుగుతుంది.? ఒకవేళ చంద్రబాబు నిర్ణయం తీసుకున్నా, 23 మంది ఎమ్మెల్యేలలో ఎంతమంది రాజీనామా చేస్తారు.? ఇలా చాలా ప్రశ్నలున్నాయి.
అమరావతికి వెన్నుపోటు పొడిచిన చంద్రబాబే, ఇప్పుడు అమరావతి కోసం మొసలి కన్నీరు కార్చుతున్నారు. వైఎస్ జగన్ సంగతి సరే సరి. ఏడాది కాలంగా అమరావతిని అయోమయంలో పడేసి, ఇప్పుడు విశాఖనీ.. కర్నూలునీ ఉద్ధరించేస్తానంటున్నారు. మొత్తమ్మీద, చంద్రబాబు డెడ్లైన్.. ఇటు టీడీపీకే కాదు, అటు వైసీపీకి కూడా కాస్త సంకటంగా మారింది. ‘గెలుస్తామని నమ్మకం వుంటే, రాజీనామా చేయడానికి నొప్పేంటి.?’ అన్న ప్రశ్నకి వైసీపీ నేతలు సమాధానం చెప్పలేక బిక్కుబిక్కుమంటుండడం గమనార్హం.
27291 483578The electronic cigarette uses a battery and a small heating factor the vaporize the e-liquid. This vapor can then be inhaled and exhaled 510769
834844 655985Spot up for this write-up, I really believe this internet internet site requirements a terrific deal more consideration. Ill likely to end up once more to read a whole lot a lot more, a lot of thanks for that information. 454542