రానా, సాయిపల్లవి జంటగా వేణు ఊడుగుల దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘విరాటపర్వం’. ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న ఈ చిత్రంపై ఇటీవల విడుదలైన ట్రైలర్ మరింత అంచనాలని పెంచింది. జూన్ 17న ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా థియేటర్లోకి రానున్న నేపధ్యంలో చిత్ర దర్శకుడు వేణు ఊడుగుల మీడియాతో మాట్లాడారు.
నేను పుట్టి పెరిగిన వాతావరణం. చూసిన జీవితం. చదివిన పుస్తకాలు,.. నేను ఎలాంటి సినిమా తీయాలో అనే ఒక విజన్ ని ఇచ్చాయి. బరువైన కథ చెప్పాలని గానీ క్లిష్టమైన కథ చెప్పాలని గానీ అనుకోను. ఈ కథ చెప్పాలని అనుకున్నాను చెప్పాను తప్పితే ఇది బరువైనదా క్లిష్టమైనదా? అనే ఆలోచన లేదు. ఒక రాజకీయ, సంక్లిష్టమైన వాతారవణంలో పెరిగా. తెలంగాణ ఒక రాజకీయ ప్రయోగశాల. ఇక్కడ జరిగిన పరిణామాలు దేశ రాజకీయాలని ప్రభావితం చేసిన వాతావరణం. యదార్ధ సంఘటనలు ఆధారంగానే ఈ చిత్రాన్ని తీశాం. సరళ అనే ఒక అమ్మాయి జీవితం.
ఈ సినిమా చాలా కొత్తగా ఉండబోతుంది. ఓటీటీ కొన్ని ఆఫర్లు వచ్చాయి. ఐతే మా నిర్మాతలు సుధాకర్ చెరుకూరి, శ్రీకాంత్ గారు సినిమాని బలంగా నమ్మారు. ప్రేమ అనేది ఇద్దరు వ్యక్తుల మధ్య వుండేదే కాదు.. ఒక సమూహానికి వ్యక్తి మధ్య వుండే ప్రేమ. రానా గారు ఈ కథ ఒప్పుకోవడం నా గొప్పదనం కాదు రానాగారి గొప్పదనం. నేను సురేష్ బాబు గారికి ఈ కథ చెప్పాను. సురేష్ బాబు గారు ‘రానాకి లైన్ నచ్చింది చెప్తావా’ అన్నారు. రానా గారికి చెప్పాను.
కథ విన్న తర్వాత రానా గారు చేస్తా అన్నారు. ఈ కథ రానా గారు ఎందుకు చేస్తానన్నారో కాసేపు అర్ధం కాలేదు. ఇలాంటి సినిమా మనం చేయకపోతే ఎవరు చేస్తారనే గొప్ప మనసుతో రానా గారు ఈ సినిమాని చేశారు. సాయి పల్లవి గారికి పది నిమిషాలు కథ చెప్పాను. పది నిమిషాల తర్వాత ఓకే చేశారు. సాయి పల్లవే కాదు సురేష్ బాబు గారు మిగతా అందరూ సింగల్ సిట్టింగ్ లోనే కథని ఓకే చేశారు. ఈ కథలోనే అంత గొప్ప వైబ్రేషన్ వుంది.
366458 301847The electronic cigarette uses a battery and a small heating factor the vaporize the e-liquid. This vapor can then be inhaled and exhaled 751192
251243 566304I enjoy this site, will definitely arrive back. Make certain you carry on writing high quality posts. 446643