Switch to English

విజయసాయిరెడ్డిగారూ.. ఈ ‘దేవతా వస్త్రం’ మాటేమిటి.?

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,418FansLike
57,764FollowersFollow

విజయసాయిరెడ్డి ఈజ్‌ బ్యాక్‌.! సోషల్‌ మీడియాలో ఆయన ట్వీట్ల జోరు మళ్ళీ పెరిగింది. అబ్బే, అవి ట్వీట్లు కావు.. ప్రత్యర్థులపై వేసే క్రమంలో సొంత పార్టీపైనే పరోక్షంగా వేసుకునే ‘రెట్టలు’ అని చాలామంది ఎద్దేవా చేస్తుంటారనుకోండి.. అది వేరే విషయం. వైసీపీ ముఖ్య నేత, ఆ పార్టీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి మాత్రం, అవేమీ పట్టించుకోకుండా తన మానాన తాను ట్వీట్లు వేసుకుంటూ వెళ్ళిపోతున్నారు.

తాజాగా ‘దేవతా వస్త్రం’ అంటూ ఓ ట్వీటాస్త్రం సంధించారు విజయసాయిరెడ్డి, మాజీ ముఖ్యమంత్రి టీడీపీ అధినేత చంద్రబాబు మీద. 175కి 151 ఓడిన, కొడుకుని కూడా ఓడగొట్టుకున్న చంద్రబాబు.. అంటూ విజయసాయిరెడ్డి సెలవిచ్చారు. నిజమే, ఇక్కడ విజయసాయిరెడ్డి చెప్పింది అక్షరాలా నిజం. మరి, 2014 ఎన్నికల్లో జరిగిందేమిటి.? తల్లిని కూడా ఓడగొట్టుకున్న వైఎస్‌ జగన్‌.. అని పరోక్షంగా విజయసాయిరెడ్డి తమ పార్టీ అధినేతని ఎద్దేవా చేసినట్లే కదా.?

‘బట్టలు విడిచిన మూర్ఖపు రాజు.. తాను వేసుకున్న దేవతా వస్త్రాలు మూర్ఖులకు కనిపించడం లేదనుకున్నాడట..’ అంటూ తన ట్వీట్‌లో ఘాటైన విమర్శలే చేశారు చంద్రబాబు మీద విజయసాయిరెడ్డి. చంద్రబాబు పాలనకి ఏమాత్రం తీసిపోవడంలేదు వైఎస్‌ జగన్‌ పాలన.. అని ఇప్పటికే పలుమార్లు నిరూపితమయ్యింది. కరోనా వైరస్‌ వ్యాప్తి విషయంలో దేశంలోనే ఆంధ్రప్రదేశ్‌ని అగ్రపథాన నిలబెట్టేందుకు వైఎస్‌ జగన్‌ ప్రయత్నిస్తున్నారా.? అన్న అనుమానం కలిగేలా.. రాష్ట్రంలో కరోనా వైరస్‌ పాజిటివ్‌ కేసులు పెరిగిపోతున్నాయ్‌.

మరి, ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలేంటి.? ‘టెస్టులు చేసేస్తున్నాం..’ అంటూ రికార్డులు చెప్పుకుంటున్న వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం, కరోనా వైరస్‌ విషయంలో ఆ ‘దేవతా వస్త్రాల్నే’ కదా చూడమంటున్నది. ముఖ్యమంత్రి పదవిలోకి వచ్చి ఏడాది పూర్తయ్యింది.. ఇప్పటిదాకా రాష్ట్రంలో అభివృద్ధి అన్న మాటకే తావు లేదాయె. ఇది కదా అసలు సిసలు దేవతా వస్త్రం అంటే.! ఏ ఉద్దేశ్యంతో విజయసాయిరెడ్డి ట్వీట్లు వేస్తున్నారోగానీ.. ఆయన వేసే ఒక్కో ట్వీటూ.. ఇటు చంద్రబాబుకీ, అటు వైఎస్‌ జగన్‌కీ ఒకేసారి చాలా చాలా గట్టిగా తగిలేస్తున్నాయ్‌. ఎనీ డౌట్స్‌.?

4 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Jr.Ntr Birthday special: టెక్నీషియన్స్ ఫేవరెట్.. జూ.ఎన్టీఆర్..! ఉదాహరణలివే..

Jr.Ntr Birthday special: తెలుగు సినీ పరిశ్రమలో ఘనమైన కుటుంబ నేపథ్యం ఉన్న కుటుంబాల్లో ఒకటి నందమూరి. విశ్వవిఖ్యాత నట సార్వభౌమ ఎన్టీఆర్ మనవడిగా.. హరికృష్ణ...

చిరంజీవి, కమల్ హాసన్.! ఎవరు గొప్ప నటుడు.?

సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్ వార్స్, ట్రోలింగ్.. ఇవేవీ లేకపోతే, చాలామంది అనాధలైపోతారు.! అనాధలైపోవడమంటే, ఎవరూ పట్టించుకోకుండా పోతారని అర్థం. ఈ లిస్టులో కొందరు సెలబ్రిటీలనబడేవారు...

Prabhas: ప్రభాస్ చెప్పిన బుజ్జి ఇదే.. ఉత్కంఠ రేకెత్తిస్తున్న వీడియో

Prabhas: స్టార్ హీరో ప్రభాస్ (Prabhas) ఇటివల ‘హాయ్.. డార్లింగ్స్. నా లైఫ్ లోకి కొత్తగా ఒకరు వస్తున్నారు. వెయిట్ చేయండి’ అనే పోస్ట్ బాగా...

SSMB 29: మహేశ్-రాజమౌళి సినిమాలో మరో స్టార్ హీరో..! నిజమెంత..!?

SSMB 29: సూపర్ స్టార్ మహేశ్ (Mahesh) – రాజమౌళి (Rajamouli) కాంబినేషన్లో ఓ భారీ సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. సినిమా ప్రకటించినప్పటి నుంచీ...

Silk Saree: మే24న వస్తున్న రొమాంటిక్ లవ్ స్టోరీ.. ‘సిల్క్ శారీ’

Silk Saree: వాసుదేవ్ రావు, రీవా చౌదరి, ప్రీతి గోస్వామి హీరో హీరోయిన్లుగా టి. నాగేందర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా "సిల్క్ శారీ" (Silk Saree)....

రాజకీయం

కోటి రూపాయలు కొల్లగొట్టిన మహిళా ఎర్నలిస్ట్ ఎవరు.?

ఎన్నికల సమయంలో ఓ మహిలా ఎర్నలిస్టు, ఏకంగా కోటి రూపాయలు కొల్లగొట్టిందట.! ఆంధ్ర ప్రదేశ్ రాజకీయాల్లో ఇప్పుడు ఇదో హాట్ టాపిక్.! ఎవరా మహిళా ఎర్నలిస్ట్.? ఏమా కథ.? అధికార వైసీపీకి అత్యంత...

వై నాట్ 175.! వైసీపీ సరే, టీడీపీ లెక్కలేంటి.?

‘మేం వై నాట్ 175 అనే మాటకే కట్టుబడి వున్నాం. ఇంతకీ, టీడీపీ లెక్క ఎంత.?’ ఈ మాట వైసీపీ గట్టిగానే అంటోంది. తెలుగు దేశం పార్టీని ప్రశ్నిస్తోంది. టీడీపీ జాతీయ ప్రధాన...

కాంగ్రెస్ గెలవాలని వైసీపీ కోరుకుంటోందా.?

రాజకీయాల్లో శాశ్వత శతృవులు శాశ్వత మిత్రులు ఎవరూ వుండరన్నది అందరికీ తెలిసిన విషయమే.! ఆ సూత్రాన్ని వైసీపీ కూడా పాటించక తప్పేలా లేదా.? అంటే, ఔననే వాదన వినిపిస్తోందిప్పుడు.! అసలు విషయమేంటంటే, ఆంధ్ర ప్రదేశ్...

జనసేన మీద వైసీపీ నేతలు బెట్టింగ్ కాస్తున్నారా.?

ఇదో ఇంట్రెస్టింగ్ పరిణామం.! అదీ, ఉభయ గోదావరి జిల్లాల్లో చోటు చేసుకుంటున్న వైపరీత్యం.! జనసేన పార్టీ గెలుస్తుందని వైసీపీ నేత ఒకరు భారీ స్థాయిలో డబ్బులు పందెం కాశారట. వేలల్లో అయితే వింతేమీ...

నాగబాబు ఈజ్ బ్యాక్.! ట్వీటుని తొలగించిన వైనం.!

సినీ నటుడు, జనసేన నేత కొణిదెల నాగబాబు ట్విట్టర్ అకౌంట్ నుంచి ఓ ట్వీటు పడింది. ‘మాతో వుంటూ ప్రత్యర్థులకి పని చేసేవాడు మా వాడైనా పరాయివాడే, మాతో నిలబడేవాడు పరాయివాడైనా మావాడే..’...

ఎక్కువ చదివినవి

ఎర్ర టవల్ చూస్తే వంగా గీతకు అంత భయమెందుకు.?

పిఠాపురం వైసీపీ అభ్యర్థి వంగా గీతకి ఓ పోలింగ్ కేంద్రంలో చిత్రమైన అనుభవం ఎదురయ్యింది. ‘నమస్కారం పెడుతూ, నాకు ఓటెయ్యడం మర్చిపోవద్దు..’ అంటూ క్యూలైన్లలో వున్న ఓటర్లను అభ్యర్థిస్తూ వెళ్ళడంపై కొందరు ఓటర్లు...

డబ్బులు పోనాయ్.. మేమేటి సేత్తాం.?

ఎన్నికలంటేనే, వందల కోట్లు.. వేల కోట్ల ఖర్చు వ్యవహారం.! అసెంబ్లీ అభ్యర్థి అయినా యాభై నుంచి వంద కోట్లు చూసుకోవాల్సిందే.! కేంద్ర ఎన్నికల సంఘం నిర్దేశించిన విధంగా అభ్యర్థులు పరిమితికి లోబడి ఖర్చు...

Jr Ntr: స్థల వివాదంలో జూ.ఎన్టీఆర్..! వార్తలపై క్లారిటీ ఇచ్చిన హీరో టీమ్

Jr Ntr: ఓ స్థలం వివాదం విషయమై హీరో ఎన్టీఆర్ హైకోర్టుని ఆశ్రయించారంటూ సోషల్ మీడియాలో ఈరోజు పలు వార్తలు హల్ చల్ చేశాయి. అయితే.. దీనిపై ఎన్టీఆర్ టీమ్ స్పందించింది. ప్రస్తుతం...

వైసీపీ కొంప ముంచేసిన ‘నాడు – నేడు’.!

రాష్ట్ర వ్యాప్తంగా ‘నాడు - నేడు’ కార్యక్రమం ద్వారా ప్రభుత్వ స్కూళ్ళలో అత్యద్భుతమైన అభివృద్ధి చూపించామని వైసీపీ అధినేత, ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చెబుతూ వచ్చారు. వైసీపీ...

నాగబాబు ట్విట్టర్ హ్యాండిల్ మాయం.! అల్లు అర్జున్ ఆర్మీ ఎఫెక్టేనా.?

బాబోయ్ బూతులు.. ఇవి మామూలు బూతులు కావు.! బండ బూతులు.! సినీ అభిమానులంటే, అత్యంత జుగుప్సాకరంగా ప్రవర్తించాలా.? సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్ వార్స్ చేసుకోవడం తప్ప, సదరు అభిమానులకి వేరే పనే...