Venkatesh Maha: దర్శకుడు వెంకటేశ్ మహా (Venkatesh Maha) తన సోషల్ మీడియా అకౌంట్ తొలగించడం చర్చకు దారి తీసింది. ఇందుకు ఆయన చేసిన పోస్టులే కారణమని తెలుస్తోంది. ఇటివల.. ‘షారుఖ్ (Sharukh Khan) డంకీ (Dunkey) కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నా. సెన్సార్ నుంచి ప్రశంసలు వచ్చాయని తెలుస్తోంది. అదే నిజమైతే ప్రేక్షకులకు మరో అద్భుతమైన సినిమా చూసినట్టే’నని అన్నారు. సలార్ (Salaar) ను తక్కువ చేసేందుకే ఈ పోస్ట్ చేశారని నెటిజన్లు కామెంట్ చేశారు.
దీనికి మహా ప్రతిస్పందిస్తూ.. ‘సలార్ ట్రైలర్ విడుదలైందని మీ కామెంట్స్ చూశాకే తెలిసింది. ఇప్పుడే చూశా. బాగుంది. నేను సలార్ ను తక్కువ చేయలేదు. డంకీ చూడాలనుందని మాత్రమే అన్నాను. అన్నింటినీ తప్పుగా చూడొద్దు. వాస్తవాలను పక్కదారి పట్టించొద్ద’ని అన్నారు. అయితే.. ఈ పోస్ట్ పెట్టిన కాసేపటికే తన అకౌంట్ డీయాక్టివేట్ చేయడం విశేషం.
గతంలో ప్రశాంత్ నీల్ తెరకెక్కించిన కేజీఎఫ్ పై వెంకటేశ్ మహా చేసిన కామెంట్స్ పై తీవ్ర దుమారం చెలరేగింది. ఆయనే సలార్ కూడా తెరకెక్కించడంతో ఆయన ట్వీట్ వార్తల్లో నిలిచింది.
Very great post. I just stumbled upon your blog and wished to say that I’ve truly loved surfing around your blog posts.
After all I’ll be subscribing on your feed and I hope you write again very soon!