‘వెల్లువొచ్చి గోదారమ్మ..’ అంటూ చాన్నాళ్ళ క్రితం ఓ పాట తెలుగు సినీ అభిమానుల్ని ఓ ఊపు ఊపేసింది. అప్పటికీ ఇప్పటికీ ఎప్పటికీ అదో సంచలనం. ఆ పాటని ‘వాల్మీకి’ కోసం వాడుతున్నారు. పాత పాట తాలూకు ‘గౌరవం’ ఎక్కడా చెడిపోకుండా, ఆ పాట గౌరవాన్ని మరింత పెంచేలా ‘వాల్మీకి’ కోసం రీమిక్స్ చేశామని అంటున్నారు దర్శకుడు హరీష్ శంకర్. శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీ అందించిన ఈ సాంగ్‌లో అలనాటి అందాల తార శ్రీదేవిని మ్యాచ్ చేసేలానే కన్పిస్తోంది పూజా హెగ్దే.
మేకింగ్ వీడియో చూస్తే, సాంగ్ కోసం ఎంత కష్టపడ్డారో అర్థమవుతుంది. పదుల సంఖ్యలో బిందుల్ని గోదారి తీరాన అత్యంత అందంగా అమర్చారు. అచ్చం ఆ పాటలానే కాస్ట్యూమ్స్ కూడా డిజైన్ చేశారు. ఓల్డ్ గెటప్‌లో వరుణ్ తేజ్, ఆ పక్కనే శ్రీదేవి గెటప్‌లో పూజా హెగ్దే.. డాన్స్ చేస్తోంటే, ఒక్కసారిగా ఆ పాత జ్ఞాపకాలు అందరికీ కలుగుతున్నాయి.
మేకింగ్ వరకూ ఇదొక అద్భుతంగానే కన్పిస్తున్నా, తెరపై ఎలా వుంటుందన్న సందేహం చాలామందిలో వుంది. ‘ఆ సందేహమే అవసరం లేదు. పాట చిత్రీకరణ కోసం చాలా కష్టపడ్డాం. మా శ్రమకు మంచి గుర్తింపు లభిస్తుందని ఆశిస్తున్నాం..’ అని చిత్ర దర్శక నిర్మాతలు భావిస్తున్నారు.
Also Read: వరుణ్ తేజ్ పెళ్ళంట.. వధువు ఎవరంట.?
మెగా హీరోలకి, మెగా సాంగ్స్ రీమిక్స్ చేయడం కొత్తేమీ కాదు. అయితే, కాస్త డిఫరెంట్‌గా మెగా ప్రిన్స్, శోభన్ బాబు సాంగ్‌ని ‘వాల్మీకి’ కోసం రిస్క్ చేస్తున్నాడు. సాధారణంగా ఇలాంటి ప్రయోగాల్ని అప్పట్లో పవన్ కళ్యాణ్ సక్సెస్‌ఫుల్‌గా చేసేశారు. ‘ఆడవారి మాటలకు..’ అంటూ సాగే పాటని ఏ రేంజ్లో పవన్, ‘ఖుషీ’ కోసం రీమిక్స్ చేశాడో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.
మరి, ఆ పవన్ కళ్యాణ్‌కి భక్తుడైన హరీష్ శంకర్ దర్శకత్వంలో, ఆ పవన్ కళ్యాణ్‌కి అన్నయ్య కొడుకైన వరుణ్ తేజ్, ‘వెల్లువొచ్చి గోదారమ్మా..’ పాటని ఇంకెలా రీమేక్ చేసి వుంటారో.! ఈ నెల 20న ‘వాల్మీకి’ ప్రేక్షకుల ముందుకు రానున్న విషయం విదితమే.
67542 59440Were glad to become visitor on this pure internet site, regards in this rare info! 104037
349003 27002Just a smiling visitant here to share the enjoy (:, btw outstanding style . 802525
252696 395058Hello there, just became alert to your weblog by way of Google, and discovered that it is genuinely informative. Im going to watch out for brussels. I will appreciate if you continue this in future. Several folks will probably be benefited from your writing. Cheers! 563388
504309 415645I was examining some of your content material on this internet website and I believe this web site is rattling instructive! Maintain putting up. 302131