Switch to English

ఆయన ‘పెట్‌ డాగ్‌’ అయితే, ఈయనెవరు.?

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,421FansLike
57,764FollowersFollow

తెలుగుదేశం పార్టీకి వేరే శతృవులు అక్కర్లేదు. సొంత పార్టీ నేతలు చాలు, పార్టీని సర్వనాశనం చేసెయ్యడానికి. అదనంగా అను’కుల’ మీడియా వుండనే వుంది. ఇటీవలి ఎన్నికల్లో టీడీపీ ఇంత ఘోర పరాజయానికి కారణం ఇంకెవరో కాదు, టీడీపీ నేతలే. పార్టీ ఇంతలా నాశనమయ్యాక కూడా, తెలుగుదేశం పార్టీ నేతల కడుపు మంట చల్లారినట్లు కన్పించడంలేదు. ఇంకా టీడీపీని అదఃపాతాళానికి తొక్కేయాలన్న పట్టుదలతో తెలుగు తమ్ముళ్ళు ప్రయత్నిస్తున్నారు.

టీడీపీకి ఈ ఎన్నికల్లో మిగిలింది ముగ్గురు లోక్‌సభ సభ్యులు మాత్రమే. అందులో కేశినేని నాని ఒకరు. టీడీపీని పూర్తిగా కాలగర్భంలో కలిపేసేందుకు తనవంతు కృషి చేస్తున్నారాయన. బ్లాక్‌మెయిలింగ్‌ రాజకీయాలకు తెరలేపారు. మరోపక్క, చంద్రబాబుకి విశ్వాసపాత్రుడిగా చెప్పుకునే బుద్ధా వెంకన్న సైతం, టీడీపీ అంతు చూడటమే లక్ష్యంగా పెట్టుకున్నట్లున్నారు.

నిన్నంతా కేశినేని నాని – బుద్ధా వెంకన్న మధ్య ట్వీట్ల రచ్చ చోటు చేసుకుంది. అన్నట్టు, గతంలో ఈ ఇద్దరూ కలిసి రవాణా కమిషనర్‌గా పనిచేసిన సీనియర్‌ ఐపీఎస్‌ అధికార మీద దాడికి వెళ్ళారండోయ్‌. అప్పట్లో వీరిద్దరి మధ్యా సఖ్యత అంత గొప్పగా వుండేది. ఇప్పుడేమో, కేశినేని నాని బస్సుల పేరుతో చేసిన ‘నేరాలు’ బుద్ధా వెంకన్నకు కన్పిస్తున్నాయి. బుద్ధా వెంకన్న ‘కొబ్బరి చిప్పల’ వ్యవహారం కేశినేనా నానికి కన్పిస్తోంది. ‘చంద్రబాబుకి పెట్‌ డాగ్‌’ అంటూ బుద్ధా వెంకన్నపై కేశినేని నాని లేటెస్ట్‌గా విరుచుకుపడ్డారు.

ఆ పెట్‌ డాగ్‌ని కంట్రోల్‌ పెడతారా.? లేదంటే నన్ను పార్టీకి రాజీనామా చెయ్యమంటారా.? అంటూ చంద్రబాబుని ట్విట్టర్‌ వేదికగా కేశినేని నాని బ్లాక్‌మెయిల్‌ చేయడంతో, ‘చంద్రబాబు కోసం ట్వీట్ల యుద్ధం మానేస్తున్నా’ అని బుద్ధా వెంకన్న సెలవిచ్చారు. ఇంతకీ, బుద్దా వెంకన్న పెట్‌ డాగ్‌ అయితే, కేశినేని నాని ఏంటబ్బా.? అని కృష్ణా జిల్లా తెలుగు తమ్ముళ్ళలో ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది. కేశినేని నానిపై బుద్ధా వెంకన్న చేసిన సంచలన ఆరోపణ ఏంటంటే, దివంగత బాలయోగి ఆస్తుల్ని కేశినేని నాని కొట్టేశారని.

5 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Jr.Ntr Birthday special: టెక్నీషియన్స్ ఫేవరెట్.. జూ.ఎన్టీఆర్..! ఉదాహరణలివే..

Jr.Ntr Birthday special: తెలుగు సినీ పరిశ్రమలో ఘనమైన కుటుంబ నేపథ్యం ఉన్న కుటుంబాల్లో ఒకటి నందమూరి. విశ్వవిఖ్యాత నట సార్వభౌమ ఎన్టీఆర్ మనవడిగా.. హరికృష్ణ...

చిరంజీవి, కమల్ హాసన్.! ఎవరు గొప్ప నటుడు.?

సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్ వార్స్, ట్రోలింగ్.. ఇవేవీ లేకపోతే, చాలామంది అనాధలైపోతారు.! అనాధలైపోవడమంటే, ఎవరూ పట్టించుకోకుండా పోతారని అర్థం. ఈ లిస్టులో కొందరు సెలబ్రిటీలనబడేవారు...

Prabhas: ప్రభాస్ చెప్పిన బుజ్జి ఇదే.. ఉత్కంఠ రేకెత్తిస్తున్న వీడియో

Prabhas: స్టార్ హీరో ప్రభాస్ (Prabhas) ఇటివల ‘హాయ్.. డార్లింగ్స్. నా లైఫ్ లోకి కొత్తగా ఒకరు వస్తున్నారు. వెయిట్ చేయండి’ అనే పోస్ట్ బాగా...

SSMB 29: మహేశ్-రాజమౌళి సినిమాలో మరో స్టార్ హీరో..! నిజమెంత..!?

SSMB 29: సూపర్ స్టార్ మహేశ్ (Mahesh) – రాజమౌళి (Rajamouli) కాంబినేషన్లో ఓ భారీ సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. సినిమా ప్రకటించినప్పటి నుంచీ...

Silk Saree: మే24న వస్తున్న రొమాంటిక్ లవ్ స్టోరీ.. ‘సిల్క్ శారీ’

Silk Saree: వాసుదేవ్ రావు, రీవా చౌదరి, ప్రీతి గోస్వామి హీరో హీరోయిన్లుగా టి. నాగేందర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా "సిల్క్ శారీ" (Silk Saree)....

రాజకీయం

కోటి రూపాయలు కొల్లగొట్టిన మహిళా ఎర్నలిస్ట్ ఎవరు.?

ఎన్నికల సమయంలో ఓ మహిలా ఎర్నలిస్టు, ఏకంగా కోటి రూపాయలు కొల్లగొట్టిందట.! ఆంధ్ర ప్రదేశ్ రాజకీయాల్లో ఇప్పుడు ఇదో హాట్ టాపిక్.! ఎవరా మహిళా ఎర్నలిస్ట్.? ఏమా కథ.? అధికార వైసీపీకి అత్యంత...

వై నాట్ 175.! వైసీపీ సరే, టీడీపీ లెక్కలేంటి.?

‘మేం వై నాట్ 175 అనే మాటకే కట్టుబడి వున్నాం. ఇంతకీ, టీడీపీ లెక్క ఎంత.?’ ఈ మాట వైసీపీ గట్టిగానే అంటోంది. తెలుగు దేశం పార్టీని ప్రశ్నిస్తోంది. టీడీపీ జాతీయ ప్రధాన...

కాంగ్రెస్ గెలవాలని వైసీపీ కోరుకుంటోందా.?

రాజకీయాల్లో శాశ్వత శతృవులు శాశ్వత మిత్రులు ఎవరూ వుండరన్నది అందరికీ తెలిసిన విషయమే.! ఆ సూత్రాన్ని వైసీపీ కూడా పాటించక తప్పేలా లేదా.? అంటే, ఔననే వాదన వినిపిస్తోందిప్పుడు.! అసలు విషయమేంటంటే, ఆంధ్ర ప్రదేశ్...

జనసేన మీద వైసీపీ నేతలు బెట్టింగ్ కాస్తున్నారా.?

ఇదో ఇంట్రెస్టింగ్ పరిణామం.! అదీ, ఉభయ గోదావరి జిల్లాల్లో చోటు చేసుకుంటున్న వైపరీత్యం.! జనసేన పార్టీ గెలుస్తుందని వైసీపీ నేత ఒకరు భారీ స్థాయిలో డబ్బులు పందెం కాశారట. వేలల్లో అయితే వింతేమీ...

నాగబాబు ఈజ్ బ్యాక్.! ట్వీటుని తొలగించిన వైనం.!

సినీ నటుడు, జనసేన నేత కొణిదెల నాగబాబు ట్విట్టర్ అకౌంట్ నుంచి ఓ ట్వీటు పడింది. ‘మాతో వుంటూ ప్రత్యర్థులకి పని చేసేవాడు మా వాడైనా పరాయివాడే, మాతో నిలబడేవాడు పరాయివాడైనా మావాడే..’...

ఎక్కువ చదివినవి

Allu Shirish : ఎట్టకేలకు అల్లు శిరీష్ అప్‌డేట్‌ తో వచ్చాడు

Allu Shirish : అల్లు శిరీష్ హీరోగా గాయత్రి భరద్వాజ్ హీరోయిన్‌ గా శామ్‌ ఆంటోనీ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం 'బడ్డీ'. స్టూడియో గ్రీన్ ఫిలింస్ బ్యానర్‌ పై కేఈ జ్ఞానవేల్‌ రాజా,...

Jr Ntr: స్థల వివాదంలో జూ.ఎన్టీఆర్..! వార్తలపై క్లారిటీ ఇచ్చిన హీరో టీమ్

Jr Ntr: ఓ స్థలం వివాదం విషయమై హీరో ఎన్టీఆర్ హైకోర్టుని ఆశ్రయించారంటూ సోషల్ మీడియాలో ఈరోజు పలు వార్తలు హల్ చల్ చేశాయి. అయితే.. దీనిపై ఎన్టీఆర్ టీమ్ స్పందించింది. ప్రస్తుతం...

నాగబాబు ట్విట్టర్ హ్యాండిల్ మాయం.! అల్లు అర్జున్ ఆర్మీ ఎఫెక్టేనా.?

బాబోయ్ బూతులు.. ఇవి మామూలు బూతులు కావు.! బండ బూతులు.! సినీ అభిమానులంటే, అత్యంత జుగుప్సాకరంగా ప్రవర్తించాలా.? సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్ వార్స్ చేసుకోవడం తప్ప, సదరు అభిమానులకి వేరే పనే...

Jr.Ntr Birthday special: టెక్నీషియన్స్ ఫేవరెట్.. జూ.ఎన్టీఆర్..! ఉదాహరణలివే..

Jr.Ntr Birthday special: తెలుగు సినీ పరిశ్రమలో ఘనమైన కుటుంబ నేపథ్యం ఉన్న కుటుంబాల్లో ఒకటి నందమూరి. విశ్వవిఖ్యాత నట సార్వభౌమ ఎన్టీఆర్ మనవడిగా.. హరికృష్ణ తనయుడిగా బాలనటుడిగా తెరంగేట్రం చేసి తొలి...

ఎర్ర టవల్ చూస్తే వంగా గీతకు అంత భయమెందుకు.?

పిఠాపురం వైసీపీ అభ్యర్థి వంగా గీతకి ఓ పోలింగ్ కేంద్రంలో చిత్రమైన అనుభవం ఎదురయ్యింది. ‘నమస్కారం పెడుతూ, నాకు ఓటెయ్యడం మర్చిపోవద్దు..’ అంటూ క్యూలైన్లలో వున్న ఓటర్లను అభ్యర్థిస్తూ వెళ్ళడంపై కొందరు ఓటర్లు...