క్రికెట్ అంటేనే అంత.! ఏ ‘ఆట’లోనూ ఇలాంటి ప్రత్యేక పరిస్థితులుండవు. వికెట్లు తీసినన్నాళ్ళే బౌలర్ గొప్ప. పరుగులు ఝుళిపించగలిగనన్నాళ్ళే బ్యాట్స్‌మెన్ గొప్ప. వికెట్ కీపర్ పరిస్థితి కూడా అంతే. కాస్త తేడా వచ్చిందో.. ఇక, ఆ క్రికెటర్.. ఒకప్పుడు ఎన్ని ఘనతలు సాధించినాసరే.. పూచిక పుల్లతో తీసి పారేస్తారు. సచిన్ టెండూల్కర్, సౌరవ్ గంగూలీ వంటి మేటి క్రికెటర్లకే తప్పలేదు. ఆ మాటకొస్తే సునీల్ గవాస్కర్, కపిల్ దేవ్ లాంటి వారూ కెరీర్ చివర్లో చాలా విమర్శలు ఎదుర్కొన్నారు. ఇప్పుడు వంతు ధోనీది. ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో ధోనీ సరిగా ఆడలేకపోతుండడంతో క్రికెట్ అభిమానులు ఆయన మీద రెచ్చిపోయి మరీ విమర్శలు చేసేస్తున్నారు.
చెన్నయ్ సూపర్ కింగ్స్ వరుస ఓటములకు కెప్టెన్ ధోనీయే కారణమన్నది మెజార్టీ క్రికెట్ అభిమానుల వాదన. మొన్నటికి మొన్న ఓడిపోయే మ్యాచ్‌లో చివర్లో ధోనీ రెచ్చిపోయి మూడు సిక్సర్లు కొట్టేశాడు. ఇప్పుడేమో అర్థ సెంచరీకి దగ్గరగా వచ్చినా మ్యాచ్‌ని గెలిపించలేకపోయాడు. ఆట అన్నాక గెలుపోటములు సహజం. మ్యాచ్‌ని ధోనీ గెలిపించలేకపోయాడన్న చిన్న కారణంతో ఆయన్ని విమర్శించడం ఎంతవరకు సబబు.? అన్నది ధోనీ అభిమానుల వాదన. ధోనీ ఇప్పటికే అంతర్జాతీయ క్రికెట్‌కి గుడ్ బై చెప్పేశాడు. ఈ ఐపీఎల్ సీజన్ తర్వాత దీనికి కూడా గుడ్ బై చెప్పేసినా ఆశ్చర్యపోవాల్సిన పనిలేదు. ముందు ముందు ఈ సీజన్లో ధోనీ ఇంకెన్ని విమర్శలు ఎదుర్కోవాలోగానీ.. క్రికెట్లో అత్యద్భుత శిఖరాల్ని అందుకున్న ధోనీకి మాత్రం ఇది నిజంగానే కష్టకాలం.
ధోనీ బ్యాట్ ఝుళిపించగలడు.. ధోనీ వికెట్ల వెనకాల అద్భుతాలు చేయగలడు.. ధోనీ అత్యద్భుతమైన కెప్టెన్సీతో ప్రత్యర్థిని వణికించగలడు.. ఇవన్నీ క్రికెట్ అభిమానులకు తెలుసు. కానీ, ఒక్క మ్యాచ్ ఫలితంతో ధోనీ మీద విమర్శలు మాత్రం చేసేస్తుంటారు. క్రికెట్ అంటేనే అంత. మహామహులకే తప్పలేదు ఈ పరిస్థితి.
962454 233493I basically must tell you that you have written an exceptional and special post that I genuinely enjoyed reading. Im fascinated by how nicely you laid out your material and presented your views. Thank you. 671284