Tillu Square: డీజే టిల్లు (DJ Tillu) తో సక్సెస్ సాధించిన యువ హీరో సిద్ధు జొన్నలగడ్డ (Siddhu Jonnalagadda) ‘టిల్లు స్క్వేర్’ (Tillu Square) తో మళ్లీ ప్రేక్షకులను అలరించనున్నారు. మల్లిక్ రామ్ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా మార్చి 29న విడుదలవుతోంది. ఇటివలే రిలీజ్ అయిన ట్రైలర్ తో సినిమాపై అంచనాలు రెట్టింపయ్యాయి. ప్రస్తుతం సినిమాకు సంబంధించి ఓ ఆసక్తికరమైన వార్త రౌండ్ అవుతోంది.
సినిమా రన్ టైమ్ 121 నిముషాలు (2గంటల 1నిముషం) మాత్రమే ఉంటుందని తెలుస్తోంది. ప్రస్తుత సినిమాలతో పోలిస్తే ఇది చాలా తక్కువే. కానీ.. ఇందులోనే అన్ లిమిటెడ్ ఫన్ ఉంటుందని యూనిట్ అంటోంది. సిద్ధు నటన, అనుపమ హాట్ సీన్స్, సరదా అంతా.. అప్పుడే సినిమా అయిపోయిందా అనే ఫీల్ తీసుకొస్తుందని అంటున్నారు.
డీజే టిల్లులో రాధికగా అలరించిన నేహాశెట్టినే టిల్లు స్క్వేర్ లో ఉంటుందని భావించారు. అంతగా నేహా మెప్పించింది. అయితే.. టిల్లు స్క్వేర్ లో రాధిక మెరుపులా వచ్చి.. దాదాపు 15నిముషాలు సందడి చేస్తుందని తెలుస్తోంది. దీంతో సినిమాపై అంచనాలు పెరిగిపోయాయి.