బిగ్ బాస్ భాషతో సంబంధం లేకుండా అత్యంత భారీ విజయం సాధించిన రియాలిటీ షో. తెలుగులో ఈ షో 4 సీజన్లను పూర్తి చేసుకుంది కానీ హిందీలో ఈ షో గత 14 సంవత్సరాల నుండి నిర్విరామంగా వస్తోంది. బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ ఈ షో ను విజయవంతంగా హోస్ట్ చేస్తున్నాడు.
ప్రస్తుతం బిగ్ బాస్ 15 కు సంబంధించిన పనులు నిర్విరామంగా జరుగుతున్నట్లు తెలుస్తోంది. కంటెస్టెంట్లను ఎంపిక చేస్తున్నారు యాజమాన్యం. అయితే స్వయంగా సల్మాన్ ఖాన్ ఒక తెలుగు నటి పేరుని రికమెండ్ చేసినట్లు వార్తలు వస్తున్నాయి.
తెలుగులో ఎన్నో విజయవంతమైన చిత్రాల్లో నటించిన భూమిక చావ్లా ఇప్పుడు క్యారెక్టర్ నటిగా కూడా బిజీగా మారింది. భూమికను బిగ్ బాస్ 15 కోసం సల్మాన్ రికమెండ్ చేసినట్లు తెలుస్తోంది. వీళ్ళిద్దరూ గతంలో తేరే నామ్ అనే బ్లాక్ బస్టర్ చిత్రంలో నటించారు. మరి భూమిక బిగ్ బాస్ లో పాల్గొంటుందా లేదా అన్నది చూడాలి.
360415 786036I appreciate your function , thanks for all of the informative weblog posts. 532435