Switch to English

విద్యార్ధుల ఆత్మహత్య.. ఓటర్లు కాదనేనా ఈ నిర్లక్ష్యం.!

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,429FansLike
57,764FollowersFollow

వాళ్లంతా ఇంటర్మీడియట్‌ విద్యార్ధులే. ఎవరికీ ఓటు హక్కు లేదు. అందుకేనేమో ఆత్మహత్యలు చేసుకుంటున్నా, పాలకులు కళ్లు తెరవడం లేదు. ఇంటర్మీడియట్‌ పరీక్షా ఫలితాలు విద్యార్ధుల ప్రాణాలు తీసేస్తున్నాయి. ఒకట్రెండు పొరపాట్లు జరిగితే దాన్ని రాద్ధాంతం చేస్తారా.? అని తెలంగాణాలో అధికార పక్షం ప్రశ్నిస్తోంది అమాయకంగా. ఒక చిన్న పొరపాటు ఓ విద్యార్ధి ప్రాణాన్ని తీసేస్తే, దాన్ని చిన్న విషయమని ఎలా అనగలం.? ఒకరు కాదు, ఇద్దరు కాదు, 16 మందికి పైగా ప్రాణాలు పోగొట్టుకున్నారు.

99 మార్కులు రావాల్సిన ఓ విద్యార్ధికి మార్కుల లిస్టులో 00 మార్కులు పడి ఫెయిలైతే అదెంత అవమానకరం.? 425 మార్కులు రావాల్సిన ఓ విద్యార్ధికి 161 మార్కులే వచ్చాయట. 87 మార్కులు రావాల్సి ఉంటే, 27 మార్కులతో సరిపెట్టారు. చెప్పుకుంటూ పోతే ఇలాంటి పొరపాట్లు చాలా జరిగాయి. నిజానికి సమస్య ఇంత తీవ్రంగా ఉన్నప్పుడు పరీక్షా ఫలితాల విషయంలో ముఖ్యమంత్రి వివరణ ఇవ్వాల్సి ఉంది. విద్యార్ధులకు భరోసా ఇవ్వాల్సిన ముఖ్యమంత్రి పెదవి విప్పడం లేదు. విద్యాశాఖా మంత్రి జరిగిన పొరపాటు చాలా చిన్నదనీ, దానిపై అనవసర రాద్ధాంతం చేస్తున్నారనీ, విషయాన్ని చాలా చిన్నదిగా చూపే ప్రయత్నం చేస్తున్నారు. విద్యార్ధుల తల్లితండ్రులు రోడ్డెక్కి ఆందోళనలు చేస్తున్నారు. లాఠీలు విరగడం ఒక్కటే తక్కువ. అరెస్టుల పర్వంతో ఇంటర్‌ బోర్డు కార్యాలయం వద్ద తీవ్ర గందరగోళం చోటు చేసుకుంది. ఒక్క మాటలో చెప్పాలంటే విద్యార్ధుల భవిష్యత్తుకు సంబంధించి ఇది అత్యవరసర పరిస్థితి.

ఫీజు కట్టండి.. రీ వెరిఫికేషన్‌ చేసుకోండి.. అంటూ అధికారులు చెబుతున్న సమాధానాలు విద్యార్దులకూ, వారి తల్లితండ్రులకు పుండు మీద కారం చల్లినట్లుంటుంది. ఎవరో తప్పు చేస్తే ఆ తప్పుకి తామెందుకు ఫీజు చెల్లించాలని బాధితులు ప్రశ్నిస్తున్నారు. బాధితులైన విద్యార్ధులు, వారి తల్లితండ్రుల ఆవేదనలోనూ అర్ధముంది. ఆ వెరిఫికేషన్‌ ఫీజులేవో తప్పు చేసినవాళ్లే చెల్లించాలని రూలింగ్‌ ఇస్తే, ఇంకోసారి ఇలాంటి తప్పు దొర్లకుండా ఉంటుంది. అంతేకానీ, మీ చావు మీరు చావండి.. అని ఇలాంటి పరిస్థితుల్లో లైట్‌ తీసుకోవడం అధికారంలో ఉన్నవారిక తగదు.

కొందరు విద్యార్ధులు మాకు ఓటు హక్కు లేదు కనుక మమ్మల్ని పట్టించుకోరా.? అని నిలదీస్తున్నారు. విద్యార్ధుల చావులంటే అంత చులకనైపోయాయా.? అని ప్రశ్నిస్తున్నారు. రెవెన్యూ శాఖలో అవినీతపై ఉక్కుపాదం మోపుతానంటోన్న ముఖ్యమంత్రి విద్యావ్యవస్థ మీద ఎందుకు దృష్టి పెట్టడం లేదనీ ప్రశ్నిస్తున్నారు. విద్యను కొనుక్కోవాలి.. విద్యని అభ్యసించాక ఫలితాలూ కొనుక్కోవాలి.. ఇదేం దుస్థితి అని విద్యార్ధులు వాపోతున్న వైనం అందర్నీ కంట తడి పెట్టిస్తోంది. 99కి 0కి తేడా తెలియని రీతిలో మార్కుల ప్రక్రియ నడుస్తోందంటే నిర్లక్ష్యం ఏ స్థాయిలో రాజ్యమేలుతోందో ముఖ్యమంత్రి కేసీఆర్‌ గుర్తించాలి.

ఆందోళ చేస్తున్న వారిపై ఉక్కుపాదం మోపడం ద్వారా ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు వెళ్తున్నాయి. సమాధానం చెప్పాల్సిన అధికార యంత్రాంగం చేతులెత్తేస్తే.. అధికారంలో ఉన్న వారు నిర్లక్ష్యంగా మాట్లాడుతుంటే, విద్యార్ధులకు దిక్కెవరు.? దేశంలో అన్ని రంగాల్లోనూ తెలంగాణా దూసుకుపోతోందని చెబుతున్న తెలంగాణా ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఇంటర్మీడియట్‌ పరీక్షా ఫలితాల్లో అవకతవకలపై ఏం సమాధానం చెబుతారు.? బ్రాండ్‌ తెలంగాణాకి మచ్చ తెచ్చిన ఈ ప్రక్రియపై కేసీఆర్‌ ఎలా తన ప్రభుత్వాన్ని సమర్ధించుకోగలరు.?

5 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

నాగబాబు ట్విట్టర్ హ్యాండిల్ మాయం.! అల్లు అర్జున్ ఆర్మీ ఎఫెక్టేనా.?

బాబోయ్ బూతులు.. ఇవి మామూలు బూతులు కావు.! బండ బూతులు.! సినీ అభిమానులంటే, అత్యంత జుగుప్సాకరంగా ప్రవర్తించాలా.? సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్ వార్స్ చేసుకోవడం...

Indian 2 : మరో ఇండియన్‌ సర్‌ప్రైజ్‌ చేయనున్నాడా?

Indian 2 : యూనివర్శిల్‌ స్టార్‌ కమల్‌ హాసన్‌ హీరోగా శంకర్ దర్శకత్వంలో వచ్చిన భారతీయుడు సినిమాకు సీక్వెల్‌ రూపొందుతుంది. పాన్ ఇండియా రేంజ్ లో...

Devara : ఎన్టీఆర్‌ VS చరణ్.. బిగ్‌ ఫైట్‌ తప్పదా?

Devara : ఎన్టీఆర్‌ మరియు రామ్‌ చరణ్ కలిసి 'ఆర్‌ఆర్‌ఆర్‌' సినిమాలో నటించారు. ఆ సినిమా ఇద్దరికి కూడా పాన్‌ ఇండియా రేంజ్‌ లోనే కాకుండా...

Kajal : ఎన్టీఆర్‌ పై అభిమానంతో అది చేశా..!

Kajal : టాలీవుడ్‌ చందమామ కాజల్ అగర్వాల్‌ పెళ్లి తర్వాత కాస్త స్లో అయ్యింది. తల్లి అయ్యాక సినిమాలకు గ్యాప్‌ ఇచ్చింది. ఇప్పుడు మళ్లీ సినిమాలతో...

Allu Arjun : ‘పుష్ప 2’ లో కీలక రీప్లేస్‌మెంట్‌…!

Allu Arjun : అల్లు అర్జున్‌ హీరోగా సుకుమార్‌ దర్శకత్వంలో రూపొందుతున్న పుష్ప 2 పై అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి. ఆగస్టు లో సినిమా...

రాజకీయం

జగన్ ధీమా సరే.! వైసీపీ దాడుల సంగతేంటి.?

గెలిచే పార్టీ అయితే, తమ ప్రతిష్టను తామే దిగజార్చుకోవాలని అనుకుంటుందా.? రాష్ట్ర వ్యాప్తంగా అల్లర్లకు తెగబడుతుందా.? రాష్ట్రంలో ఎన్నికల పోలింగ్ అనంతరం చోటు చేసుకుంటున్న ఘర్షణలపై ఎవరికైనా సహజంగా కలిగే అనుమానమే ఇది. పల్నాడులో...

క్రాస్ ఓటింగ్ లేదు, గ్లాస్ ఓటింగే.!

పిఠాపురం, కాకినాడ.. ఈ రెండు పేర్లూ మార్మోగిపోతున్నాయి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో. తెలంగాణలోనూ, ఈ రెండు పేర్ల చుట్టూ బోల్డంత చర్చ జరుగుతోంది. ఒకటేమో, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేసిన...

ఆ పధ్నాలుగు వేల కోట్ల రూపాయలు ఏమైపోయాయ్.?

పధ్నాలుగు వేల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు వందల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు కోట్ల రూపాయలకీ చాలా తేడా వుంది.! చాలా చాలా తేడా వుంది.! ఒకటి కాదు, రెండు కాదు... పదీ కాదు,...

డబ్బులు పోనాయ్.. మేమేటి సేత్తాం.?

ఎన్నికలంటేనే, వందల కోట్లు.. వేల కోట్ల ఖర్చు వ్యవహారం.! అసెంబ్లీ అభ్యర్థి అయినా యాభై నుంచి వంద కోట్లు చూసుకోవాల్సిందే.! కేంద్ర ఎన్నికల సంఘం నిర్దేశించిన విధంగా అభ్యర్థులు పరిమితికి లోబడి ఖర్చు...

కడపలో వైసీపీని వైఎస్ షర్మిల అంతలా దెబ్బ కొట్టిందా.?

ఉమ్మడి కడప జిల్లాతోపాటు రాయలసీమ వ్యాప్తంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి వైఎస్ షర్మిల నుంచి గట్టి దెబ్బ తగలనుందా.? రాష్ట్రంలోని మిగతా జిల్లాల్లోనూ కొన్ని చోట్ల వైఎస్ షర్మిల ఇంపాక్ట్‌కి వైసీపీ కుదేలవనుందా.? ఏపీసీసీ...

ఎక్కువ చదివినవి

Kajal : ఎన్టీఆర్‌ పై అభిమానంతో అది చేశా..!

Kajal : టాలీవుడ్‌ చందమామ కాజల్ అగర్వాల్‌ పెళ్లి తర్వాత కాస్త స్లో అయ్యింది. తల్లి అయ్యాక సినిమాలకు గ్యాప్‌ ఇచ్చింది. ఇప్పుడు మళ్లీ సినిమాలతో బిజీ అయ్యేందుకు కాజల్‌ ప్రయత్నాలు చేస్తుంది....

‘రామ జన్మభూమి’ తో సీనియర్‌ స్టార్‌ డైరెక్టర్‌ రీ ఎంట్రీ

సినీ ప్రేక్షకులకు ఎన్నో సూపర్‌ హిట్ సినిమాలను అందించిన సీనియర్ దర్శకుడు సముద్ర ఈ మధ్య కాలంలో సినిమాలకు కాస్త దూరంగా ఉంటున్నారు. ఆయన నుంచి మళ్లీ ఎప్పుడెప్పుడు సినిమాలు వస్తాయా అంటూ...

వైసీపీ ఇస్తే తీసుకుంటాం.! ఓటు మాత్రం కూటమికే వేస్తాం.!

‘ఈ రోజుల్లో రాజకీయ నాయకుల్ని నమ్మడానికి వీల్లేదు. ఆ పార్టీ నుంచి గెలిచి, ఈ పార్టీలోకి దూకేస్తారు. పూటకో పార్టీ మార్చేస్తారు..’ అని జనం చర్చించుకోవడం చూస్తున్నాం. మరి, ఆ జనం గురించి...

Allu Arjun : ‘పుష్ప 2’ లో కీలక రీప్లేస్‌మెంట్‌…!

Allu Arjun : అల్లు అర్జున్‌ హీరోగా సుకుమార్‌ దర్శకత్వంలో రూపొందుతున్న పుష్ప 2 పై అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి. ఆగస్టు లో సినిమా విడుదల అవ్వబోతున్న విషయం తెల్సిందే. విడుదల...

జగన్ ప్రజల్ని బిచ్చగాళ్ళలా చూశారా.? ప్రశాంత్ కిషోర్ ఉవాచ ఇదేనా.?

ప్రజాధనాన్ని అభివృద్ధి కోసం వినియోగించకుండా, సంక్షేమ పథకాల పేరుతో సొంత పబ్లిసిటీ చేసుకోవడానికి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వినియోగించారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు 2019 ఎన్నికల్లో వైసీపీ విజయం కోసం పని...