Switch to English

జనసేనకు సైలెంట్ ఓటింగ్?

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,421FansLike
57,764FollowersFollow

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన ప్రభావం బాగానే ఉండనుందా? ఆ పార్టీకి జనం నుంచి చక్కని స్పందనే వచ్చిందా? సైలెంట్ గా ఓట్లు పడి ఉంటాయా? ప్రస్తుతం ఈ అంశం హాట్ టాపిక్ గా మారింది. ఏపీ ఎన్నికల ఫలితాలు రావడానికి సరిగ్గా నెల రోజుల సమయం ఉంది. ఫలితాలు ఎలా ఉండబోతున్నాయనే అంశంపై చర్చోపచర్చలు ఇంకా సాగుతూనే ఉన్నాయి. ఎవరికి వారు తమకు ఇన్ని సీట్లు వస్తాయని లెక్కలు వేసుకుంటున్నారు. విజయంపై అందరూ ధీమాగానే ఉన్నారు. పైకి విజయం తమదే అని స్పష్టంచేస్తున్నప్పటికీ, లోపల మాత్రం వారిని గుబులు వెంటాడుతోంది.

ఏపీలో ప్రధానంగా రెండు పార్టీల మధ్యే పోరు ఉంటే, ఇంత టెన్షన్ ఉండేది కాదు. కానీ పవన్ కల్యాణ్ నేతృత్వంలోని జనసేన కూడా పోటీకి దిగడంతో ఓ మోస్తరు స్థానాల్లో ముక్కోణపు పోరు జరిగింది. ప్రభుత్వ వ్యతిరేక ఓటుకు గణనీయంగా జనసేన గండి కొట్టింది. వాస్తవానికి జనసేన ప్రభావం పెద్దగా ఉండదని, కేవలం కాపు కమ్యూనిటీలోని యువత ఓట్లు మాత్రమే ఆ పార్టీకి పడే అవకాశం ఉందని తొలుత విశ్లేషణలు వచ్చాయి. దీనికి తగ్గట్టుగానే ఎన్నికల ముందు వచ్చిన సర్వేలు కూడా జనసేనను అంతగా పట్టించుకోలేదు. జాతీయ సర్వేలైతే అస్సలు జనసేన పేరే ప్రస్తావించలేదు. లోకల్ సర్వేలు మాత్రం జనసేన సింగిల్ డిజిట్ కే పరిమితం అవుతుందని తేల్చాయి. ఇలాంటి పరిస్థితుల నడుమ బీఎస్పీ, సీపీఐ, సీపీఎంలతో కలసి జనసేన బరిలోకి దిగింది.

జనసేన పోటీలో ఉండటం వల్ల తెలుగుదేశం పార్టీకి నష్టమని ఒక వాదన వినిపించగా.. అది వైఎస్సార్ సీపీకే గండి కొడుతుందని మరో వాదన తెరపైకి వచ్చింది. జనసేన పార్టీ అభ్యర్థులు ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలుస్తారని, ఫలితంగా ఆ ఓట్లు వైఎస్సార్ సీపీకి దక్కవని, అది తమకే లాభమని టీడీపీ నేతలు విశ్లేషించుకున్నారు. అయితే, గత ఎన్నికల్లో జనసేన, బీజేపీతో కలిసి పోటీ చేసినప్పడు చాలా స్థానాల్లో బొటాబొటీ మెజార్టీతోనే టీడీపీ గట్టెక్కిందని.. ఇప్పుడు ఆ రెండు పార్టీల మద్దతు లేకుండా ఒంటరిగా బరిలోకి దిగిన అధికార పార్టీకి జనసేన రూపంలో దెబ్బ తప్పదని వైఎస్సార్ సీపీ నాయకులు అంచనా వేస్తున్నారు. తమ ఓటు బ్యాంకు పదిలంగా ఉందని, ప్రభుత్వ వ్యతిరేక ఓటును చీల్చడం ద్వారా జనసేన తమకు లాభం చేకూర్చనుందని చెబుతున్నారు.

ఇలా ఎవరికి వారు విశ్లేషణలు చేసుకుంటున్నప్పటికీ, జనసేన మాత్రం ఇలాంటి లెక్కలు వేసుకోవడంలేదు. తాము అధికారం చేజిక్కించుకునే స్థాయిలో సీట్లు గెలుచుకోలేమని జనసేనకూ తెలుసు. అయితే, హంగ్ ఏర్పడితే తాము కీలకం కావొచ్చన్నది మాత్రమే ఆ పార్టీ ఆశ. అయితే, ఆ పార్టీకి క్షేత్రస్థాయిలో ఎన్ని ఓట్లు పడ్డాయనే అంశంపై తాజాగా కొత్త విశ్లేషణలు తెరపైకి వచ్చాయి. ఒక్క కాపు కమ్యూనిటీకి చెందిన యువతే కాకుండా వివిధ సామాజిక వర్గాలకు చెందినవారు కూడా జనసేన వైపు మొగ్గు చూపారని అంటున్నారు. పవన్ వల్ల మార్పునకు నాంది పడే అవకాశం ఉందని వారు నమ్మడంతో జనసేనుడి పక్షాన నిలిచారని చెబుతున్నారు. పైగా వారు తమ ఓట్లు వేయడమే కాకుండా కుటుంబ సభ్యులపై కూడా ఒత్తిడి తెచ్చినట్టు సమాచారం.

మహిళలు, వృద్ధుల ఓట్లు ప్రధాన పార్టీలు పంచుకున్నప్పటికీ, యువత ఓట్లలో అధిక భాగం జనసేనకు పడి ఉండొచ్చని కొత్త అంచనాలు వస్తున్నాయి. మొత్తమ్మీద జనసేనకు సైలెంట్ ఓటింగ్ పడిందని అంటున్నారు. అయితే, ఇది భారీగా సీట్లు గెలుచుకునే స్థాయిలో ఉండకపోయినా, ఓటింగ్ షేర్ మాత్రం బాగానే ఉంటుందని చెబుతున్నారు. జనసేన అధినేత తమకు 15 సీట్లు రావొచ్చని అంచనా వేసుకున్నారు. అంటే, సింగిల్ డిజిట్ కే పరిమితం అవుతుందనుకున్న పార్టీ.. బాగానే ప్రభావం చూపించిందని భావించొచ్చు.

5 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Jr.Ntr Birthday special: టెక్నీషియన్స్ ఫేవరెట్.. జూ.ఎన్టీఆర్..! ఉదాహరణలివే..

Jr.Ntr Birthday special: తెలుగు సినీ పరిశ్రమలో ఘనమైన కుటుంబ నేపథ్యం ఉన్న కుటుంబాల్లో ఒకటి నందమూరి. విశ్వవిఖ్యాత నట సార్వభౌమ ఎన్టీఆర్ మనవడిగా.. హరికృష్ణ...

చిరంజీవి, కమల్ హాసన్.! ఎవరు గొప్ప నటుడు.?

సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్ వార్స్, ట్రోలింగ్.. ఇవేవీ లేకపోతే, చాలామంది అనాధలైపోతారు.! అనాధలైపోవడమంటే, ఎవరూ పట్టించుకోకుండా పోతారని అర్థం. ఈ లిస్టులో కొందరు సెలబ్రిటీలనబడేవారు...

Prabhas: ప్రభాస్ చెప్పిన బుజ్జి ఇదే.. ఉత్కంఠ రేకెత్తిస్తున్న వీడియో

Prabhas: స్టార్ హీరో ప్రభాస్ (Prabhas) ఇటివల ‘హాయ్.. డార్లింగ్స్. నా లైఫ్ లోకి కొత్తగా ఒకరు వస్తున్నారు. వెయిట్ చేయండి’ అనే పోస్ట్ బాగా...

SSMB 29: మహేశ్-రాజమౌళి సినిమాలో మరో స్టార్ హీరో..! నిజమెంత..!?

SSMB 29: సూపర్ స్టార్ మహేశ్ (Mahesh) – రాజమౌళి (Rajamouli) కాంబినేషన్లో ఓ భారీ సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. సినిమా ప్రకటించినప్పటి నుంచీ...

Silk Saree: మే24న వస్తున్న రొమాంటిక్ లవ్ స్టోరీ.. ‘సిల్క్ శారీ’

Silk Saree: వాసుదేవ్ రావు, రీవా చౌదరి, ప్రీతి గోస్వామి హీరో హీరోయిన్లుగా టి. నాగేందర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా "సిల్క్ శారీ" (Silk Saree)....

రాజకీయం

కోటి రూపాయలు కొల్లగొట్టిన మహిళా ఎర్నలిస్ట్ ఎవరు.?

ఎన్నికల సమయంలో ఓ మహిలా ఎర్నలిస్టు, ఏకంగా కోటి రూపాయలు కొల్లగొట్టిందట.! ఆంధ్ర ప్రదేశ్ రాజకీయాల్లో ఇప్పుడు ఇదో హాట్ టాపిక్.! ఎవరా మహిళా ఎర్నలిస్ట్.? ఏమా కథ.? అధికార వైసీపీకి అత్యంత...

వై నాట్ 175.! వైసీపీ సరే, టీడీపీ లెక్కలేంటి.?

‘మేం వై నాట్ 175 అనే మాటకే కట్టుబడి వున్నాం. ఇంతకీ, టీడీపీ లెక్క ఎంత.?’ ఈ మాట వైసీపీ గట్టిగానే అంటోంది. తెలుగు దేశం పార్టీని ప్రశ్నిస్తోంది. టీడీపీ జాతీయ ప్రధాన...

కాంగ్రెస్ గెలవాలని వైసీపీ కోరుకుంటోందా.?

రాజకీయాల్లో శాశ్వత శతృవులు శాశ్వత మిత్రులు ఎవరూ వుండరన్నది అందరికీ తెలిసిన విషయమే.! ఆ సూత్రాన్ని వైసీపీ కూడా పాటించక తప్పేలా లేదా.? అంటే, ఔననే వాదన వినిపిస్తోందిప్పుడు.! అసలు విషయమేంటంటే, ఆంధ్ర ప్రదేశ్...

జనసేన మీద వైసీపీ నేతలు బెట్టింగ్ కాస్తున్నారా.?

ఇదో ఇంట్రెస్టింగ్ పరిణామం.! అదీ, ఉభయ గోదావరి జిల్లాల్లో చోటు చేసుకుంటున్న వైపరీత్యం.! జనసేన పార్టీ గెలుస్తుందని వైసీపీ నేత ఒకరు భారీ స్థాయిలో డబ్బులు పందెం కాశారట. వేలల్లో అయితే వింతేమీ...

నాగబాబు ఈజ్ బ్యాక్.! ట్వీటుని తొలగించిన వైనం.!

సినీ నటుడు, జనసేన నేత కొణిదెల నాగబాబు ట్విట్టర్ అకౌంట్ నుంచి ఓ ట్వీటు పడింది. ‘మాతో వుంటూ ప్రత్యర్థులకి పని చేసేవాడు మా వాడైనా పరాయివాడే, మాతో నిలబడేవాడు పరాయివాడైనా మావాడే..’...

ఎక్కువ చదివినవి

నాగబాబు ఈజ్ బ్యాక్.! ట్వీటుని తొలగించిన వైనం.!

సినీ నటుడు, జనసేన నేత కొణిదెల నాగబాబు ట్విట్టర్ అకౌంట్ నుంచి ఓ ట్వీటు పడింది. ‘మాతో వుంటూ ప్రత్యర్థులకి పని చేసేవాడు మా వాడైనా పరాయివాడే, మాతో నిలబడేవాడు పరాయివాడైనా మావాడే..’...

Kajal : ఎన్టీఆర్‌ పై అభిమానంతో అది చేశా..!

Kajal : టాలీవుడ్‌ చందమామ కాజల్ అగర్వాల్‌ పెళ్లి తర్వాత కాస్త స్లో అయ్యింది. తల్లి అయ్యాక సినిమాలకు గ్యాప్‌ ఇచ్చింది. ఇప్పుడు మళ్లీ సినిమాలతో బిజీ అయ్యేందుకు కాజల్‌ ప్రయత్నాలు చేస్తుంది....

కోటి రూపాయలు కొల్లగొట్టిన మహిళా ఎర్నలిస్ట్ ఎవరు.?

ఎన్నికల సమయంలో ఓ మహిలా ఎర్నలిస్టు, ఏకంగా కోటి రూపాయలు కొల్లగొట్టిందట.! ఆంధ్ర ప్రదేశ్ రాజకీయాల్లో ఇప్పుడు ఇదో హాట్ టాపిక్.! ఎవరా మహిళా ఎర్నలిస్ట్.? ఏమా కథ.? అధికార వైసీపీకి అత్యంత...

ఆ పధ్నాలుగు వేల కోట్ల రూపాయలు ఏమైపోయాయ్.?

పధ్నాలుగు వేల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు వందల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు కోట్ల రూపాయలకీ చాలా తేడా వుంది.! చాలా చాలా తేడా వుంది.! ఒకటి కాదు, రెండు కాదు... పదీ కాదు,...

జగన్ ధీమా సరే.! వైసీపీ దాడుల సంగతేంటి.?

గెలిచే పార్టీ అయితే, తమ ప్రతిష్టను తామే దిగజార్చుకోవాలని అనుకుంటుందా.? రాష్ట్ర వ్యాప్తంగా అల్లర్లకు తెగబడుతుందా.? రాష్ట్రంలో ఎన్నికల పోలింగ్ అనంతరం చోటు చేసుకుంటున్న ఘర్షణలపై ఎవరికైనా సహజంగా కలిగే అనుమానమే ఇది. పల్నాడులో...