తెలంగాణలో బీజేపీ బలం పెరుగుతూనే ఉంది. ఇటీవలే ఈటెల రాజేందర్ చేరికతో ఆ పార్టీ బలం పెరిగింది.. తాజాగా తీన్మార్ మల్లన్న కూడా బీజేపీలో చేరిపోయాడు. కేసీఆర్ ను ఓ రేంజ్ లో విమర్శిస్తూ అనేక కేసులు ఎదుర్కొన్న తీన్మార్ మల్లన్న నేడు ఢిల్లీ లో బీజేపీ కండువా కప్పుకున్నాడు. తీన్మార్ మల్లన్నకు తెలంగాణ బీజేపీ నాయకత్వం మరియు కేంద్ర నాయకత్వం కూడా సాదరంగా స్వాగతం పలికింది. ఇక బీజేపీ లో ఉండి కేసీఆర్ బరతం పడుతాను అంటూ తీన్మార్ మల్లన్న చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం చర్చనీయాంశం అయ్యాయి. బీజేపీలో ఎందుకు తీన్మార్ మల్లన్న జాయిన్ అయ్యాడు అనేది ఇప్పుడు కొందరు వేస్తున్న ప్రశ్న.. ఆ ప్రశ్నకు అనేక మంది వద్ద ఉన్న సమాధానం ఒకటే… కేసుల భయంతోనే తీన్మార్ మల్లన్న బీజేపీలో చేరిపోయాడు. ఈటెల రాజేందర్ పై ఎన్నో కేసులు పెట్టారు.
బీజేపీలో జాయిన్ అయిన వెంటనే ఆ కేసులకు సంబంధించి ఎలాంటి ఊసే లేకుండా పోయింది. ఇప్పుడు తీన్మార్ మల్లన్నపై కూడా చాలా కేసులు ఉన్నాయి. రెండు మూడు నెలల పాటు జైల్లో కూడా ఉండి వచ్చాడు. మళ్లీ జైలుకు కూడా పంపించే అవకాశాలు లేకపోలేదు. అందుకే తీన్మార్ మల్లన్న బీజేపీలో జాయిన్ అయ్యాడని అంటున్నారు. మల్లన్న బీజేపీలో ఉండటం వల్ల ఇంతకు ముందులా కేసీఆర్ ను విమర్శించగలడా అంటూ కొందరు ప్రశ్నిస్తున్నారు. ఇప్పుడు తాను మరింత ఉత్సాహంతో కేసీఆర్ ను బజారుకు ఈడ్చుతాను అంటూ మీడియా ముందు చెప్పుకొచ్చాడు. ముందు ముందు రాజకీయ పరిణామలు ఎలా ఉంటాయో చూడాలి.
277163 420096There is numerous separate years Los angeles Weight reduction eating strategy with each a person can be a necessity. The pioneer part can be your original getting rid of belonging towards the extra pounds. la weight loss 823056
937133 292264Extremely nicely written story. It is going to be beneficial to everyone who utilizes it, as properly as myself. Keep up the great function – i will definitely read a lot more posts. 665354