జనసేన పార్టీకి ఒక్క ఎమ్మెల్యే కూడా లేరు.. ఆ పార్టీకి సరైన క్యాడర్ కూడా లేని పరిస్థితి. అయినా, జనసేన పార్టీ మీద రెండు ప్రధాన పార్టీలు ‘కుట్రలు’ పన్నుతున్నాయి. ఒకటేమో నిత్యం విషం చిమ్ముతోంటే, ఇంకొకటేమో.. సమయానుకూలంగా తేనె పూసిన కత్తెలా వ్యవహరిస్తూ జనసేన గొంతు కోసేందుకు ప్రయత్నిస్తోంది. ఇంతకీ, ఈ రెండు పార్టీల విషయంలో జనసేన వైఖరి ఎలా వుంది.? ఇదే, జనసేన శ్రేణులకు కాస్తంత క్లారిటీ కావాల్సిన అంశం.
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబుకి పవన్ కళ్యాణ్ అమ్ముడుపోయారన్నది వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆరోపణ. ఇది ఎప్పటినుంచో చేస్తున్న ఆరోపణే. అయితే, కొన్నాళ్ళ క్రితం ‘జనసేన అధినేత మాతో టచ్‌లో వున్నారు.. కలిసి పనిచేసే అవకాశం వుంది..’ అని సాక్షాత్తూ వైఎస్సార్సీపీకి చెందిన కొందరు ముఖ్య నేతలే ప్రకటించుకున్నారు.. అయితే, అది ఎన్నికలకు ముందు వ్యవహారం.
ఇక, తెలుగుదేశం పార్టీ విషయానికొస్తే.. ఆ పార్టీ జనసేన విషయంలో క్లియర్‌గానే డబుల్ గేమ్ ఆడేస్తోంది. ‘పవన్ కళ్యాణ్ మావాడే.. అందుకే, జనసేన శ్రేణులు మాకే ఓటెయ్యాలి.. లేకపోతే, వైసీపీని ఎదుర్కోలేం..’ అని ఎన్నికల వేళ ఓ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి ప్రకటించుకున్నాడు.
అన్నట్టు, గుంటూరు జిల్లాకి చెందిన ఓ వైసీపీ అభ్యర్థి అయితే, జనసేన శ్రేణులకు ‘నమస్కారం’ చేసి మరీ, కంటతడి పెట్టుకున్నారు.. తనను గెలిపించమని. ఆయా పార్టీల రాజకీయాలు ఇలా తగలడ్డాయి. వాళ్ళ రాజకీయ అవసరాల కోసం పవన్ కళ్యాణ్ ఇమేజ్ కావాలి.. జనసేన మద్దతుదారుల నుంచి మద్దతు కావాలి. అదే సమయంలో, పవన్ కళ్యాణ్ మాత్రం రాజకీయంగా ఎదగకూడదు.
రాజధాని అమరావతి విషయంలో రైతులు, పవన్ కళ్యాణ్ పట్ల విపరీతమైన అభిమానం కనబరుస్తున్నారు. ఇది గిట్టని టీడీపీ శ్రేణులు తెలివిగా, పవన్‌ని వెనకేసుకొస్తున్నారు.. తద్వారా అధికార పార్టీ నేతలు, జనసేనానిపై నిప్పులు చెరగాలన్నది టీడీపీ వ్యూహం అనుకోవాలేమో. టీడీపీ – జనసేన ఒక్కటేనన్న భావన కలిగిస్తే అది టీడీపీకి మేలు, అదే సమయంలో వైసీపీకి కూడా అడ్వాంటేజ్. మధ్యలో నాశనమయిపోయేది జనసేన పార్టీ మాత్రమే. ‘దొంగలు దొంగలు ఊళ్ళు పంచుకోవడం’ అంటే ఇదేనేమో.!
293198 75677quite good post, i certainly actually like this remarkable website, maintain on it 399154
388632 595123More than and over once more I like to think about this difficulties. As a matter of fact it wasnt even a month ago that I thought about this extremely thing. To be honest, what could be the answer though? 94806