తన మేనమామ తమ ఆస్తి కాజేయాలని చూస్తున్నాడని, తనను శారీరకంగా, మానసికంగా వేధిస్తున్నాడని ప్రముఖ కన్నడ నటి జయశ్రీ రామయ్య పోలీసులకు పిర్యాదు చేసింది. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ తన తల్లిదండ్రులకు చెందిన ఆస్తిని కాజేయడానికి తన మేన మామ కుట్ర పన్నాడని ఆమె ఆరోపించారు.
ఆస్థి కోసం చాలా కాలంగా తమను వేధిస్తున్నాడని, ముఖ్యంగా తనను మానసికంగా, శారీరకంగా వేధింపులకు గురిచేస్తున్నాడని ఆమె పేర్కొంది. ఈ నెల 10న మా ఇంటికి వచ్చి .. మా అమ్మను ఇంటినుండి బయటకు గెంటేసాడని తెలిపింది. అంతే కాదు చాలా సందర్భాల్లో నను బూట్లతో కూడా కొట్టాడంటూ చెప్పడం సంచలనం రేపుతోంది. జయశ్రీ కంప్లైంట్ ని ఫైల్ చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
