Switch to English

శుక్రవారం ప్రత్యేకం.. టీడీపీ నేత ధూళిపాళ్ళ అరెస్ట్.!

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,422FansLike
57,764FollowersFollow

‘శుక్రవారం అంటే, ఇకపై వైసీపీ మీద సెటైర్లు వేయడం కాదు.. పచ్చ చొక్కాలకి వెన్నులో వణుకు పుట్టాలి..’ అంటూ సోషల్ మీడియాలో కొన్నాళ్ళుగా ఓ చర్చ జరుగుతోంది. ఈ చర్చలో విషయం నిజమే అయితే, అధికార వైసీపీ, పనిగట్టుకుని కక్ష పూరితంగా ప్రతిపక్షం తెలుగుదేశం పార్టీకి చెందిన ముఖ్య నేతల మీద కేసులు బనాయించి, అరెస్టులు చేయిస్తోందని అనుకోవాలేమో.

నేడు శుక్రవారం.. టీడీపీ మాజీ ఎమ్మెల్యే ధూళిపాళ నరేంద్ర అరెస్టయ్యారు. ప్రస్తుతం ఆయన సంగం డెయిరీ ఛైర్మన్ హోదాలో వున్నారు. గత కొంతకాలంగా సంగం డెయిరీ మీద అధికార వైసీపీ ఆరోపణలు చేస్తోంది. సంగం డైరీ అక్రమాలకు సంబంధించి ఏసీబీ, ఈ రోజు ఉదయం ధూళిపాళ్ళ నరేంద్రను అరెస్ట్ చేసిందన్నది అధికార పార్టీ నుంచి ప్రభుత్వ వర్గాల నుంచి అందుతోన్న సమాచారం.

మరోపక్క, శుక్రవారం వచ్చింది కదా.. అధికార వైసీపీకి వెన్నులో వణుకు మొదలైంది.. అందుకే, టీడీపీ నేతల్ని అరెస్ట్ చేయించి పైశాచికానందం పొందుతోంది.. అంటూ సోషల్ మీడియా వేదికగా గుసగుసలు వినిపిస్తున్నాయి. కాగా, ధూళిపాళ్ళ అరెస్టు విషయమై టీడీపీ నేతలు తీవ్రంగా స్పందిస్తున్నారు. అధికార పార్టీ అరాచకాలకు ఇదొక నిదర్శనం మాత్రమే. ఇలాంటివి చాలానే జరిగాయి, జరుగుతూనే వున్నాయి, జరుగుతూనే వుంటాయి.. అంటోంది టీడీపీ.

‘ఒక్క కేసులో కూడా మమ్మల్ని దోషులుగా నిరూపించలేకపోతున్నాయి బులుగు చొక్కాలు. ఖాకీలు కూడా అధికార వైసీపీ కార్యకర్తల్లా వ్యవహరిస్తున్నారు..’ అంటూ టీడీపీ నేతలు మండిపడుతున్నారు. కొన్నాళ్ళ క్రితం మాజీ మంత్రి, టీడీపీ సీనియర్ నేత కింజరాపు అచ్చెన్నాయుడు అరెస్టయ్యారు ఈఎస్ఐ మెడికల్ స్కాంకి సంబంధించి. జైలుకెళ్ళారు, బెయిల్ మీద విడుదలయ్యారు. ఆ తర్వాత ఆ కేసు విచారణ ఎక్కడిదాకా వచ్చిందో ఎవరికీ తెలియదు.

మరో మాజీ మంత్రి కొల్లు రవీంద్రను ఏకంగా హత్యకేసులో అరెస్ట్ చేశారు. ఆ కేసు కూడా అంతే.. అలా అలా సాగుతోంది. అన్నట్టు లిస్టులో మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు, టీడీపీ అధినేత చంద్రబాబు కూడా వున్నారు. చంద్రబాబుకి హైకోర్టు స్టే ఇచ్చింది.. మాజీ మంత్రి దేవినేని ఉమ, ఈ నెల 29న సీఐడీ ముందు విచారణకు హాజరు కానున్నారు. కొసమెరుపేంటంటే, ఈ రోజు ఏప్రిల్ 23. 23వ సంఖ్యకీ.. టీడీపీకీ – బులుగు రాజకీయానికీ ప్రత్యేకమైన లింక్ వుందండోయ్. ఫిరాయింపులు, నోటీసులు, అరెస్టులు.. ఈ సంఖ్యకి ప్రత్యేకమైన గుర్తింపును తెస్తున్నాయ్.

2 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Silk Saree: మే24న వస్తున్న రొమాంటిక్ లవ్ స్టోరీ.. ‘సిల్క్ శారీ’

Silk Saree: వాసుదేవ్ రావు, రీవా చౌదరి, ప్రీతి గోస్వామి హీరో హీరోయిన్లుగా టి. నాగేందర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా "సిల్క్ శారీ" (Silk Saree)....

Jr Ntr: స్థల వివాదంలో జూ.ఎన్టీఆర్..! వార్తలపై క్లారిటీ ఇచ్చిన హీరో...

Jr Ntr: ఓ స్థలం వివాదం విషయమై హీరో ఎన్టీఆర్ హైకోర్టుని ఆశ్రయించారంటూ సోషల్ మీడియాలో ఈరోజు పలు వార్తలు హల్ చల్ చేశాయి. అయితే.....

Prabhas: ఎవరా కొత్త వ్యక్తి..? సెన్సేషన్ క్రియేట్ చేస్తోన్న ప్రభాస్ పోస్ట్

Prabhas: చాలా తక్కువగా సోషల్ మీడియాలో యాక్టివ్ అయ్యే స్టార్ హీరో ప్రభాస్ చేసిన ఇన్ స్టా పోస్ట్ ప్రస్తుతం నెట్టింట విపరీతంగా వైరల్ అవుతోంది....

నాగబాబు ట్విట్టర్ హ్యాండిల్ మాయం.! అల్లు అర్జున్ ఆర్మీ ఎఫెక్టేనా.?

బాబోయ్ బూతులు.. ఇవి మామూలు బూతులు కావు.! బండ బూతులు.! సినీ అభిమానులంటే, అత్యంత జుగుప్సాకరంగా ప్రవర్తించాలా.? సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్ వార్స్ చేసుకోవడం...

Indian 2 : మరో ఇండియన్‌ సర్‌ప్రైజ్‌ చేయనున్నాడా?

Indian 2 : యూనివర్శిల్‌ స్టార్‌ కమల్‌ హాసన్‌ హీరోగా శంకర్ దర్శకత్వంలో వచ్చిన భారతీయుడు సినిమాకు సీక్వెల్‌ రూపొందుతుంది. పాన్ ఇండియా రేంజ్ లో...

రాజకీయం

జనసేన మీద వైసీపీ నేతలు బెట్టింగ్ కాస్తున్నారా.?

ఇదో ఇంట్రెస్టింగ్ పరిణామం.! అదీ, ఉభయ గోదావరి జిల్లాల్లో చోటు చేసుకుంటున్న వైపరీత్యం.! జనసేన పార్టీ గెలుస్తుందని వైసీపీ నేత ఒకరు భారీ స్థాయిలో డబ్బులు పందెం కాశారట. వేలల్లో అయితే వింతేమీ...

నాగబాబు ఈజ్ బ్యాక్.! ట్వీటుని తొలగించిన వైనం.!

సినీ నటుడు, జనసేన నేత కొణిదెల నాగబాబు ట్విట్టర్ అకౌంట్ నుంచి ఓ ట్వీటు పడింది. ‘మాతో వుంటూ ప్రత్యర్థులకి పని చేసేవాడు మా వాడైనా పరాయివాడే, మాతో నిలబడేవాడు పరాయివాడైనా మావాడే..’...

ఐదేళ్ళుగా సినీ పరిశ్రమను దోచేశాం: వైసీపీ అను‘కుల’ మీడియా.!

ఐదేళ్ళపాటు అధికారంలో వున్నాం.. అందినకాడికి సినీ పరిశ్రమని అడ్డగోలుగా దోచేసుకున్నాం.! ఇదీ వైసీపీ అను‘కుల’ మీడియా చెబుతున్నమాట.! ఆంధ్ర ప్రదేశ్‌లో ఐదేళ్ళపాటు అధికారం వెలగబెట్టిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, తన చెప్పు చేతల్లో...

గ్రౌండ్ రిపోర్ట్: సంక్షేమ పథకాలు ఓట్లను రాల్చుతాయా.?

ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌కి ముందూ, పోలింగ్ తర్వాతా.. అధికార వైసీపీ, ‘సంక్షేమ పథకాలే మమ్మల్ని గెలిపిస్తాయ్..’ అని చెబుతుండడం చూస్తున్నాం. సంక్షేమం పేరుతో ఓటు బ్యాంకు రాజకీయాలు చేయడం అనేది...

PM Modi: ‘మీరు చెప్పింది నిజమే..’ రష్మిక పోస్టుకు ప్రధాని మోదీ స్పందన..

PM Modi: ముంబైలో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన ‘ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్’ (MTHL)పై నటి రష్మిక (Rashmika) ప్రయాణించి సోషల్ మీడియాలో తన అనుభూతిని పంచుకున్నారు. దీనిపై ప్రధాని మోదీ (PM Modi)...

ఎక్కువ చదివినవి

వైసీపీ అభ్యర్థి చెంప పగలగొట్టిన సామాన్యుడు.!

ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో పెను సంచలనం ఇది.! ఓ అభ్యర్థి చెంప పగిలింది. అది కూడా అధికార పార్టీకి చెందిన అభ్యర్థి చెంప పగలగొట్టాడో సామాన్యుడు.! ఈ ఘటన, అధికార వైసీపీలోనే...

Rashmika: ముంబై బ్రిడ్జి ప్రయాణంపై రష్మిక పోస్టు.. నెటిజన్స్ ట్రోలింగ్స్

Rashmika: ముంబైలో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన ‘ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్’ (MTHL)పై నేషనల్ క్రష్ రష్మిక (Rashmika) మందన ప్రయాణించి తన అనుభూతిని పంచుకున్నారు. మీడియాలో మాట్లాడుతూ.. ‘ఇటువంటివి సాధ్యమవుతాయని మనం కలలో కూడా...

ఎర్ర టవల్ చూస్తే వంగా గీతకు అంత భయమెందుకు.?

పిఠాపురం వైసీపీ అభ్యర్థి వంగా గీతకి ఓ పోలింగ్ కేంద్రంలో చిత్రమైన అనుభవం ఎదురయ్యింది. ‘నమస్కారం పెడుతూ, నాకు ఓటెయ్యడం మర్చిపోవద్దు..’ అంటూ క్యూలైన్లలో వున్న ఓటర్లను అభ్యర్థిస్తూ వెళ్ళడంపై కొందరు ఓటర్లు...

పిలవని పేరంటానికి ఎందుకెళ్ళావ్ పుష్ప రాజ్.?

పుష్ప రాజ్ అలియాస్ బన్నీ అలియాస్ అల్లు అర్జున్, వైసీపీకి చెందిన శిల్పా రవిచంద్రారెడ్డి ఇంటికి వెళ్ళారు.! సరిగ్గా ఎన్నికల సమయంలో, అదీ.. పోలింగుకి జస్ట్ రెండ్రోజుల ముందర వైసీపీ అభ్యర్థి ఇంటికి...

నాగబాబు ట్విట్టర్ హ్యాండిల్ మాయం.! అల్లు అర్జున్ ఆర్మీ ఎఫెక్టేనా.?

బాబోయ్ బూతులు.. ఇవి మామూలు బూతులు కావు.! బండ బూతులు.! సినీ అభిమానులంటే, అత్యంత జుగుప్సాకరంగా ప్రవర్తించాలా.? సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్ వార్స్ చేసుకోవడం తప్ప, సదరు అభిమానులకి వేరే పనే...