Switch to English

జైల్లోనే టీడీపీ అధినేత చంద్రబాబు.! ఇంకెన్నాళ్ళు.?

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,422FansLike
57,764FollowersFollow

తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడు జైల్లో మగ్గిపోవాల్సిందేనట.! వైసీపీ నేతలు కొందరు ఇదే మాట చెబుతున్నారు. అధికార పార్టీ నేతలు చెబుతున్నారంటే, తెరవెనుకాల స్కెచ్ గట్టిగానే వుందన్నమాట. మరికొన్ని కేసులు చంద్రబాబు మీద నమోదు చేసి, ఆయన్ని ఇరకాటంలో పెట్టేందుకు వైసీపీ సర్కారు విశ్వ ప్రయత్నాలూ చేస్తోంది.

స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ వ్యవహారానికి సంబంధించి ఇంతవరకు చంద్రబాబు తరఫు లాయర్లు బెయిల్ పిటిషన్ న్యాయస్థానంలో మూవ్ చెయ్యకపోవడం అందర్నీ విస్మయానికి గురిచేస్తోంది. క్వాష్ పిటిషన్‌పై నేడు తీర్పు తమకు అనుకూలంగా వస్తుందని చంద్రబాబు తరఫు న్యాయవాదులు భావించారుగానీ.. ఈ కేసులోనూ విచారణ వచ్చే మంగళవారానికి వాయిదా పడింది.

ఈలోగా, స్కిల్ డెవలప్మెంట్ స్కామ్‌కి సంబంధించి ట్రయల్ కోర్టు వ్యవహారాలు చేపట్టకూడదని హైకోర్టు పేర్కొనడం గమనార్హం. అంటే, చంద్రబాబు కస్టడీ పిటిషన్ సంగతి కూడా, వచ్చే మంగళవారం వరకూ అలాగే పెండింగ్‌లో వుంటుందన్నమాట. కానీ, ఇలా ఎన్నాళ్ళు.?

చంద్రబాబేమో, స్కిల్ డెవలప్మెంట్ కేసులో బెయిల్‌ని కోరుకోవడంలేదు. అది అసలు అర్థం పర్థం లేని కేసు కాబట్టి, తన మీద మోపిన అభియోగాల్ని పూర్తిగా కొట్టేయాల్సిందిగా న్యాయ పోరాటం చేస్తామంటున్నారట చంద్రబాబు.! కానీ, చంద్రబాబు అనుకున్నట్టు జరుగుతుందా.? ఈ కేసులో చంద్రబాబు అసలు బయటకే రాలేరని వైసీపీ బలంగా నమ్ముతోంది.

ఇంకో ఆరు నెలల్లోపు చంద్రబాబు జైలు నుంచి బయటకు వచ్చే అవకాశమే లేదంటూ వైసీపీ నేతలు కుండబద్దలుగొట్టేస్తున్నారు. బెయిల్ కోసం చంద్రబాబేమో ప్రయత్నాలు చేయడంలేదు. నిజానికి, సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది సిద్దార్ధ లూధ్రా తలచుకుంటే, బెయిల్ తెచ్చెయ్యడం పెద్ద విషయం కాదు.

న్యాయం దొరకనప్పుడు.. కత్తి పట్టాల్సిందేనంటూ సిద్దార్ధ లూద్రా ఓ ‘కొటేషన్’ని పోస్ట్ చేశారు. అయితే, కత్తి పట్టడం అనేది కూడా న్యాయ మార్గంలోనే.. అంటూ లూద్రా వివరణ ఇచ్చుకున్నారనుకోండి.. అది వేరే సంగతి. లూద్రా తాజాగా, చంద్రబాబుని రాజమండ్రి జైల్లో కలిశారు.

2024 ఎన్నికల్లో చంద్రబాబు జైలు నుంచి బయటకు రాకపోతే ఏం జరుగుతుంది.? జైల్లో వుండే, చంద్రబాబు ఎన్నికల నామినేషన్ ఫైల్ చేస్తారా.? చంద్రబాబుకి బదులుగా ఆయన సతీమణి భువనేశ్వరి కుప్పం నుంచి పోటీ చేస్తారా.? బోల్డన్ని ఇలాంటి ప్రశ్నలు తెరపైకొస్తున్నాయ్.!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

SSMB 29: మహేశ్-రాజమౌళి సినిమాలో మరో స్టార్ హీరో..! నిజమెంత..!?

SSMB 29: సూపర్ స్టార్ మహేశ్ (Mahesh) – రాజమౌళి (Rajamouli) కాంబినేషన్లో ఓ భారీ సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. సినిమా ప్రకటించినప్పటి నుంచీ...

Silk Saree: మే24న వస్తున్న రొమాంటిక్ లవ్ స్టోరీ.. ‘సిల్క్ శారీ’

Silk Saree: వాసుదేవ్ రావు, రీవా చౌదరి, ప్రీతి గోస్వామి హీరో హీరోయిన్లుగా టి. నాగేందర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా "సిల్క్ శారీ" (Silk Saree)....

Jr Ntr: స్థల వివాదంలో జూ.ఎన్టీఆర్..! వార్తలపై క్లారిటీ ఇచ్చిన హీరో...

Jr Ntr: ఓ స్థలం వివాదం విషయమై హీరో ఎన్టీఆర్ హైకోర్టుని ఆశ్రయించారంటూ సోషల్ మీడియాలో ఈరోజు పలు వార్తలు హల్ చల్ చేశాయి. అయితే.....

Prabhas: ఎవరా కొత్త వ్యక్తి..? సెన్సేషన్ క్రియేట్ చేస్తోన్న ప్రభాస్ పోస్ట్

Prabhas: చాలా తక్కువగా సోషల్ మీడియాలో యాక్టివ్ అయ్యే స్టార్ హీరో ప్రభాస్ చేసిన ఇన్ స్టా పోస్ట్ ప్రస్తుతం నెట్టింట విపరీతంగా వైరల్ అవుతోంది....

నాగబాబు ట్విట్టర్ హ్యాండిల్ మాయం.! అల్లు అర్జున్ ఆర్మీ ఎఫెక్టేనా.?

బాబోయ్ బూతులు.. ఇవి మామూలు బూతులు కావు.! బండ బూతులు.! సినీ అభిమానులంటే, అత్యంత జుగుప్సాకరంగా ప్రవర్తించాలా.? సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్ వార్స్ చేసుకోవడం...

రాజకీయం

జనసేన మీద వైసీపీ నేతలు బెట్టింగ్ కాస్తున్నారా.?

ఇదో ఇంట్రెస్టింగ్ పరిణామం.! అదీ, ఉభయ గోదావరి జిల్లాల్లో చోటు చేసుకుంటున్న వైపరీత్యం.! జనసేన పార్టీ గెలుస్తుందని వైసీపీ నేత ఒకరు భారీ స్థాయిలో డబ్బులు పందెం కాశారట. వేలల్లో అయితే వింతేమీ...

నాగబాబు ఈజ్ బ్యాక్.! ట్వీటుని తొలగించిన వైనం.!

సినీ నటుడు, జనసేన నేత కొణిదెల నాగబాబు ట్విట్టర్ అకౌంట్ నుంచి ఓ ట్వీటు పడింది. ‘మాతో వుంటూ ప్రత్యర్థులకి పని చేసేవాడు మా వాడైనా పరాయివాడే, మాతో నిలబడేవాడు పరాయివాడైనా మావాడే..’...

ఐదేళ్ళుగా సినీ పరిశ్రమను దోచేశాం: వైసీపీ అను‘కుల’ మీడియా.!

ఐదేళ్ళపాటు అధికారంలో వున్నాం.. అందినకాడికి సినీ పరిశ్రమని అడ్డగోలుగా దోచేసుకున్నాం.! ఇదీ వైసీపీ అను‘కుల’ మీడియా చెబుతున్నమాట.! ఆంధ్ర ప్రదేశ్‌లో ఐదేళ్ళపాటు అధికారం వెలగబెట్టిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, తన చెప్పు చేతల్లో...

గ్రౌండ్ రిపోర్ట్: సంక్షేమ పథకాలు ఓట్లను రాల్చుతాయా.?

ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌కి ముందూ, పోలింగ్ తర్వాతా.. అధికార వైసీపీ, ‘సంక్షేమ పథకాలే మమ్మల్ని గెలిపిస్తాయ్..’ అని చెబుతుండడం చూస్తున్నాం. సంక్షేమం పేరుతో ఓటు బ్యాంకు రాజకీయాలు చేయడం అనేది...

PM Modi: ‘మీరు చెప్పింది నిజమే..’ రష్మిక పోస్టుకు ప్రధాని మోదీ స్పందన..

PM Modi: ముంబైలో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన ‘ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్’ (MTHL)పై నటి రష్మిక (Rashmika) ప్రయాణించి సోషల్ మీడియాలో తన అనుభూతిని పంచుకున్నారు. దీనిపై ప్రధాని మోదీ (PM Modi)...

ఎక్కువ చదివినవి

క్రాస్ ఓటింగ్ లేదు, గ్లాస్ ఓటింగే.!

పిఠాపురం, కాకినాడ.. ఈ రెండు పేర్లూ మార్మోగిపోతున్నాయి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో. తెలంగాణలోనూ, ఈ రెండు పేర్ల చుట్టూ బోల్డంత చర్చ జరుగుతోంది. ఒకటేమో, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేసిన...

హింస, అశాంతి.! ఇది వైసీపీ మార్కు రాజకీయం.!

రాష్ట్రంలో ప్రశాతంగా ఎన్నికల పోలింగ్ ముగిసింది. మరీ ప్రశాంతంగా కాదుగానీ, ఫర్లేదు.! వైసీపీ ఓటమి ఖాయమని పోలింగ్‌కి ముందే సంకేతాలు రావడంతో, కొన్ని చోట్ల హింసకు తెరలేపాయి వైసీపీ శ్రేణులు. బీసీ, మైనార్టీలు, ఎస్సీ,...

జగన్ ధీమా సరే.! వైసీపీ దాడుల సంగతేంటి.?

గెలిచే పార్టీ అయితే, తమ ప్రతిష్టను తామే దిగజార్చుకోవాలని అనుకుంటుందా.? రాష్ట్ర వ్యాప్తంగా అల్లర్లకు తెగబడుతుందా.? రాష్ట్రంలో ఎన్నికల పోలింగ్ అనంతరం చోటు చేసుకుంటున్న ఘర్షణలపై ఎవరికైనా సహజంగా కలిగే అనుమానమే ఇది. పల్నాడులో...

Kajal : ఎన్టీఆర్‌ పై అభిమానంతో అది చేశా..!

Kajal : టాలీవుడ్‌ చందమామ కాజల్ అగర్వాల్‌ పెళ్లి తర్వాత కాస్త స్లో అయ్యింది. తల్లి అయ్యాక సినిమాలకు గ్యాప్‌ ఇచ్చింది. ఇప్పుడు మళ్లీ సినిమాలతో బిజీ అయ్యేందుకు కాజల్‌ ప్రయత్నాలు చేస్తుంది....

బాబూ.. రాంబాబూ.! రీపోలింగ్ కావాలా.?

మంత్రి అంబటి రాంబాబుకి రీ-పోలింగ్ కావాలట.! ఎంత కష్టమొచ్చింది.? రీ-పోలింగ్ అడుగుతున్నారంటే, ఓటమిని ముందే ఒప్పుకున్నట్లు కదా.? పోలింగ్ సరళి చూశాక ‘సంబరాల’ రాంబాబుకి మైండ్ బ్లాంక్ అయ్యిందని, సత్తెనపల్లి నియోజకవర్గ ప్రజలే...