Switch to English

సిగ్గు సిగ్గు: లారీ క్లీనర్‌ వర్సెస్‌ గోలీ సోడా మేకర్‌

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,424FansLike
57,764FollowersFollow

‘వెధవాయను నేను.. నీకన్న పెద్ద వెధవాయను నేను..’ అంటూ ఓ సినీ కవి ఏనాడో ఓ గొప్ప పాట రాసేశాడు. రాజకీయాల్లోనూ అంతే.! ప్రజలకు సేవ చేస్తామంటూ రాజకీయాల్లోకి వచ్చే నాయకులు.. వీధి రౌడీల స్థాయికి దిగజారిపోయి.. ఒకరి మీద ఒకరు తిట్టుకోవడం చూస్తే, పై పాట గుర్తుకు రాకుండా వుంటుందా.?

ఆంధ్రప్రదేశ్‌లో అధికార, ప్రతిపక్ష పార్టీలకు చెందిన నేతల మధ్య ‘మాటల యుద్ధం’ చూసి పై పాటని గుర్తు చేసుకుంటున్నారు ప్రజలు. ఒకాయన గతంలో లారీ క్లీనర్‌గా పనిచేశాడట. ఇంకొకాయన తండ్రి గోలీ సోడా కొట్టేవాడట. ఇలా విమర్శించుకుంటున్నారు ఒకర్నొకరు. ‘బొత్తిగా సిగ్గొదిలేశారు..’ అని జనం చీదరించుకుంటున్నా.. ఈ అడ్డగోలు విమర్శలు మాత్రం ఆగడంలేదు. ‘చాయ్‌ వాలా.. భారతదేశానికి ప్రధాని అవడం ఓ అద్భుతం..’ అని ప్రపంచమంతా కీర్తిస్తోంది. అది మన వ్యవస్థ గొప్పతనం. కానీ, ఆ వ్యవస్థని మనమే కించపర్చేసుకుంటున్నాం.

లారీ క్లీనర్‌ అయితే.. ఉన్నత పదవుల్లో వుండకూడదా.? తండ్రి గోలీ సోడాలు అమ్ముకునేవాడయితే.. కొడుకు రాజకీయంగా ఎదగకూడదా.? మాజీ మంత్రిని పట్టుకుని ‘చీర పంపిస్తా..’ అనడమేంటి.? బాధ్యతగల ప్రజా ప్రతినిధిని పట్టుకుని, ‘తాగుబోతు, లారీ క్లీనర్‌’ అనడమేంటి.? పేర్లు ప్రస్తావించడం ఇక్కడ అనవసరం.

ఆయా వ్యక్తులు.. తమ స్థాయి దిగజారిపోతోందన్న విషయాన్ని గుర్తించలేకపోతున్నారు. రాజకీయమనే ఓ పైత్యంతో సదరు నేతలు కొట్టుమిట్టాడుతున్నారు మరి. ఆ పొర వీడితే తప్ప వాళ్ళకి వాస్తవం కన్పించదు. తన పదవిని నిలబెట్టుకోవాలనే ‘కక్కుర్తి’ కారణంగా సదరు నేత, ప్రత్యర్థుల్ని బండబూతులు తిట్టడానికీ వెనుకాడ్డంలేదు.

‘గుడ్డలూడదీసి కొడతాం..’ అని ఏ ప్రజా ప్రతినిధి అయినా అనడం సబబేనా.? కానీ, ఆయన అంటాడు. ‘నీ యమ్మ మొగుడు కట్టాడా.?’ (క్షమించాలి.. ఇంతటి జుగుప్సాకరమైన పదాల్ని ప్రస్తావిస్తున్నదుకు.. కానీ తప్పడంలేదు) అంటూ విరుచుకుపడ్తాడు. ప్రజాస్వామ్యంలో వున్నామా.? ఆటవిక వ్యవస్థలో వున్నామా.? నిజానికి.. అది వీళ్ళ తప్పు కూడా కాదు. వీళ్ళని ప్రోత్సహిస్తున్న పార్టీలది. ఇంకా ఖచ్చితంగా చెప్పాంటే, ఇలాంటోళ్ళని చట్టసభలకు పంపుతున్న ప్రజల తప్పిదం కూడా వుంది.

‘నేను గానీ బూతులు గానీ తిట్టానంటే..’ అంటూ తాజాగా ఈ రోజు ఇంకోసారి విరుచుకుపడిపోయాడాయన. ఇంతకన్నా ఇంకేం బూతులుంటాయ్‌.? ఈయనగారేమన్నా బూతుల్లో పీహెచ్‌డీ చేసేశారా.? అన్న అనుమానం కలగకమానదు.

2 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Jr Ntr: స్థల వివాదంలో జూ.ఎన్టీఆర్..! వార్తలపై క్లారిటీ ఇచ్చిన హీరో...

Jr Ntr: ఓ స్థలం వివాదం విషయమై హీరో ఎన్టీఆర్ హైకోర్టుని ఆశ్రయించారంటూ సోషల్ మీడియాలో ఈరోజు పలు వార్తలు హల్ చల్ చేశాయి. అయితే.....

Prabhas: ఎవరా కొత్త వ్యక్తి..? సెన్సేషన్ క్రియేట్ చేస్తోన్న ప్రభాస్ పోస్ట్

Prabhas: చాలా తక్కువగా సోషల్ మీడియాలో యాక్టివ్ అయ్యే స్టార్ హీరో ప్రభాస్ చేసిన ఇన్ స్టా పోస్ట్ ప్రస్తుతం నెట్టింట విపరీతంగా వైరల్ అవుతోంది....

నాగబాబు ట్విట్టర్ హ్యాండిల్ మాయం.! అల్లు అర్జున్ ఆర్మీ ఎఫెక్టేనా.?

బాబోయ్ బూతులు.. ఇవి మామూలు బూతులు కావు.! బండ బూతులు.! సినీ అభిమానులంటే, అత్యంత జుగుప్సాకరంగా ప్రవర్తించాలా.? సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్ వార్స్ చేసుకోవడం...

Indian 2 : మరో ఇండియన్‌ సర్‌ప్రైజ్‌ చేయనున్నాడా?

Indian 2 : యూనివర్శిల్‌ స్టార్‌ కమల్‌ హాసన్‌ హీరోగా శంకర్ దర్శకత్వంలో వచ్చిన భారతీయుడు సినిమాకు సీక్వెల్‌ రూపొందుతుంది. పాన్ ఇండియా రేంజ్ లో...

Devara : ఎన్టీఆర్‌ VS చరణ్.. బిగ్‌ ఫైట్‌ తప్పదా?

Devara : ఎన్టీఆర్‌ మరియు రామ్‌ చరణ్ కలిసి 'ఆర్‌ఆర్‌ఆర్‌' సినిమాలో నటించారు. ఆ సినిమా ఇద్దరికి కూడా పాన్‌ ఇండియా రేంజ్‌ లోనే కాకుండా...

రాజకీయం

ఐదేళ్ళుగా సినీ పరిశ్రమను దోచేశాం: వైసీపీ అను‘కుల’ మీడియా.!

ఐదేళ్ళపాటు అధికారంలో వున్నాం.. అందినకాడికి సినీ పరిశ్రమని అడ్డగోలుగా దోచేసుకున్నాం.! ఇదీ వైసీపీ అను‘కుల’ మీడియా చెబుతున్నమాట.! ఆంధ్ర ప్రదేశ్‌లో ఐదేళ్ళపాటు అధికారం వెలగబెట్టిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, తన చెప్పు చేతల్లో...

గ్రౌండ్ రిపోర్ట్: సంక్షేమ పథకాలు ఓట్లను రాల్చుతాయా.?

ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌కి ముందూ, పోలింగ్ తర్వాతా.. అధికార వైసీపీ, ‘సంక్షేమ పథకాలే మమ్మల్ని గెలిపిస్తాయ్..’ అని చెబుతుండడం చూస్తున్నాం. సంక్షేమం పేరుతో ఓటు బ్యాంకు రాజకీయాలు చేయడం అనేది...

PM Modi: ‘మీరు చెప్పింది నిజమే..’ రష్మిక పోస్టుకు ప్రధాని మోదీ స్పందన..

PM Modi: ముంబైలో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన ‘ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్’ (MTHL)పై నటి రష్మిక (Rashmika) ప్రయాణించి సోషల్ మీడియాలో తన అనుభూతిని పంచుకున్నారు. దీనిపై ప్రధాని మోదీ (PM Modi)...

జగన్ ధీమా సరే.! వైసీపీ దాడుల సంగతేంటి.?

గెలిచే పార్టీ అయితే, తమ ప్రతిష్టను తామే దిగజార్చుకోవాలని అనుకుంటుందా.? రాష్ట్ర వ్యాప్తంగా అల్లర్లకు తెగబడుతుందా.? రాష్ట్రంలో ఎన్నికల పోలింగ్ అనంతరం చోటు చేసుకుంటున్న ఘర్షణలపై ఎవరికైనా సహజంగా కలిగే అనుమానమే ఇది. పల్నాడులో...

క్రాస్ ఓటింగ్ లేదు, గ్లాస్ ఓటింగే.!

పిఠాపురం, కాకినాడ.. ఈ రెండు పేర్లూ మార్మోగిపోతున్నాయి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో. తెలంగాణలోనూ, ఈ రెండు పేర్ల చుట్టూ బోల్డంత చర్చ జరుగుతోంది. ఒకటేమో, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేసిన...

ఎక్కువ చదివినవి

Allu Arjun : ‘పుష్ప 2’ లో కీలక రీప్లేస్‌మెంట్‌…!

Allu Arjun : అల్లు అర్జున్‌ హీరోగా సుకుమార్‌ దర్శకత్వంలో రూపొందుతున్న పుష్ప 2 పై అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి. ఆగస్టు లో సినిమా విడుదల అవ్వబోతున్న విషయం తెల్సిందే. విడుదల...

డబ్బులు పోనాయ్.. మేమేటి సేత్తాం.?

ఎన్నికలంటేనే, వందల కోట్లు.. వేల కోట్ల ఖర్చు వ్యవహారం.! అసెంబ్లీ అభ్యర్థి అయినా యాభై నుంచి వంద కోట్లు చూసుకోవాల్సిందే.! కేంద్ర ఎన్నికల సంఘం నిర్దేశించిన విధంగా అభ్యర్థులు పరిమితికి లోబడి ఖర్చు...

గ్రౌండ్ రిపోర్ట్: సంక్షేమ పథకాలు ఓట్లను రాల్చుతాయా.?

ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌కి ముందూ, పోలింగ్ తర్వాతా.. అధికార వైసీపీ, ‘సంక్షేమ పథకాలే మమ్మల్ని గెలిపిస్తాయ్..’ అని చెబుతుండడం చూస్తున్నాం. సంక్షేమం పేరుతో ఓటు బ్యాంకు రాజకీయాలు చేయడం అనేది...

PM Modi: ‘మీరు చెప్పింది నిజమే..’ రష్మిక పోస్టుకు ప్రధాని మోదీ స్పందన..

PM Modi: ముంబైలో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన ‘ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్’ (MTHL)పై నటి రష్మిక (Rashmika) ప్రయాణించి సోషల్ మీడియాలో తన అనుభూతిని పంచుకున్నారు. దీనిపై ప్రధాని మోదీ (PM Modi)...

కడపలో వైసీపీని వైఎస్ షర్మిల అంతలా దెబ్బ కొట్టిందా.?

ఉమ్మడి కడప జిల్లాతోపాటు రాయలసీమ వ్యాప్తంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి వైఎస్ షర్మిల నుంచి గట్టి దెబ్బ తగలనుందా.? రాష్ట్రంలోని మిగతా జిల్లాల్లోనూ కొన్ని చోట్ల వైఎస్ షర్మిల ఇంపాక్ట్‌కి వైసీపీ కుదేలవనుందా.? ఏపీసీసీ...