సాదారణంగా యువతులపై యువకులు యాసిడ్ దాడులు చేయడం మనం చూస్తూ ఉంటాం. ఎంతో మంది రాక్షసులు అమాయకమైన అమ్మాయిలపై యాసిడ్ దాడి చేయడం జరిగింది. అయితే ఈసారి సీన్ రివర్స్ అయ్యింది.
కర్నూలు జిల్లా నంద్యాల మండలం పెద్దకొట్టాలకు చెందిన నాగేంద్ర అనే యువకుడిపై వరుసగా రెండు సార్లు యువతి యాసిడ్ దాడి చేసింది. మొదటి సారి చేతికి స్వల్ప గాయాలు అవ్వగా ఈసారి మొహంతో పాటు శరీరంలోని పలు భాగాలకు గాయాలు అయ్యాయి.
పోలీసులు మరియు బాధితుడు చెప్పిన వివరాల ప్రకారం నాగేంద్ర కొన్నాళ్ల క్రితం ఓ యువతిని ప్రేమించాడు. ఇటీవల ఆమెను కాకుండా మరో అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. దాంతో అతడి వల్ల మోసపోయాను అంటూ ప్రేమించిన అమ్మాయి కక్ష కట్టింది.
ఇటీవలే అతడిపై యాసిడ్ తో దాడి చేయగా కేవలం అతడి చేయి మాత్రమే కాలింది. దాని నుండి కోలుకుని బయటకు వచ్చిన నాగేంద్రను ఆమె మరోసారి టార్గెట్ చేసింది. తనను మోసం చేసినందుకే ఈ పని చేసినట్లుగా ఆమె చెబుతోంది. కేసు నమోదు చేసిన పోలీసులు ఎంక్వౌరీ చేస్తున్నారు. ప్రస్తుతం నాగేంద్ర ఆరోగ్య పరిస్థితి బాగానే ఉందని, త్వరలోనే కోలుకుంటాడని నంద్యాల వైధ్యులు అంటున్నారు.
86543 814115hello i discovered your post and thought it was really informational likewise i suggest this internet site about repairing lap tops Click Here 507745
586203 227806I really enjoyed reading this website, this is great weblog. 67725
191308 294836Fairly uncommon. Is likely to appreciate it for people who consist of community forums or anything, internet site theme . a tones way for the client to communicate. Outstanding job.. 272427
387831 887729You got a really superb internet site, Glad I noticed it through yahoo. 938947