అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న పుష్ప సినిమాలో పలువురు విలన్ లు కనిపించబోతున్నారు. ఆ పాత్రల కోసం బాలీవుడ్ నుండి టాలీవుడ్ వరకు ఎంతో మంది ప్రముఖులను సుకుమార్ ఎంపిక చేస్తున్నాడనే వార్తలు వస్తున్నాయి. విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం అల్లు అర్జున్ తో ఢీ కొట్టే అవకాశంను సునీల్ కు కూడా సుకుమార్ ఇచ్చాడనే వార్తలు వస్తున్నాయి. ఆ పాత్ర కోసం మరి కొందరిని కూడా పరిశీలించినా కూడా తుది జాబితాలో సునీల్ ఉన్నట్లుగా ప్రచారం జరుగుతోంది.
సునీల్ ఈ విషయంలో చాలా హ్యాపీగా ఉన్నాడు. కమెడియన్ గా చేసిన సునీల్ హీరోగా మారాడు. కొన్నాళ్ల తర్వాత మళ్లీ కమెడియన్ గా చేసేందుకు సిద్దం అయ్యాడు. కమెడియన్ ఆఫర్లు రాకపోవడంతో విలన్ గా సెటిల్ అవ్వాలని ప్రయత్నాలు చేస్తున్నాడు. ఇప్పటికే రెండు మూడు సినిమాల్లో విలన్ గా కనిపించాడు. కనుక పుష్పలో విలన్ గా ఆఫర్ వచ్చే అవకాశాలు ఉండటంతో సునీల్ ఫుల్ హ్యాపీగా ఉన్నాడు. ప్రస్తుతం సినిమా హైదరాబాద్ శివారు ప్రాంతంలో చిత్రీకరణ జరుపుతున్నారు. త్వరలోనే సినిమాకు సంబంధించిన అప్ డేట్ ఇవ్వబోతున్నారు.
685943 374232An incredibly fascinating go by means of, I might not concur entirely, nonetheless you do make some genuinely legitimate factors. 315957