Suman: అడపాదడపా రాజకీయాలపై స్పందించే హీరో సుమన్ (Suman) ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. సీట్ల సర్దుబాటు సక్రమంగా జరిగితే టీడీపీ (Tdp)-జనసేన (Janasena) కూటమి గెలుపు ఖాయమని అన్నారు. ఆదివారం మధ్యాహ్నం తిరుపతిలోని తాతయ్యగుంటలోని ఆలయంలో గంగమ్మ అమ్మవారిని దర్శించుకున్నారు. ఆలయ అధికారులు ఆయనకు స్వాగతం పలిక అమ్మవారి దర్శనం కల్పించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ..
‘ఏపీలో టీడీపీ-జనసేన గాలి వీస్తోంది. సీట్ల సర్దుబాటు సవ్యంగా జరిగితే అధికారం వారిదే. రాజకీయాల్లో నాకు చంద్రబాబు గురువు. పరిపాలన ఎలా చేయాలో తెలిసిన వ్యక్తి. ఓటర్లు ఓటు వేసే ముందు ఆలోచించుకుని సరైన నిర్ణయం తీసుకవాలిజ డబ్బు, మద్యం ప్రలోభాలకు గురి కావొద్దు. ఇప్పటికిప్పుడు ఎన్నికల్లో పోటీ చేసే ఉద్దేశం లేదు’.
‘తమిళ హీరో విజయ్ రాజకీయాల్లోకి రావడం ఆహ్వానించదగ్గ పరిణామం. ఆలోచనతో కూడిన అడుగులు వేస్తున్నారు. అయోధ్య రామమందిర నిర్మాణం చారిత్రాత్మక విజయం. శ్రీరాముని దర్శన భాగ్యం కలగడం పూర్వజన్మ సుకృతం’ అని అన్నారు.