సూయజ్ కాలువలో గత మంగళవారం చిక్కుకుపోయిన ఎవర్ గివెన్ నౌక గురించి తెలిసిందే. కొరకరాని కొయ్యగా మారి ప్రపంచ వాణిజ్యంపై తీవ్ర ప్రభావం చూపుతోంది. ఎప్పుడు కదులుతుందో.. అసలు కదులుతుందో లేదో కూడా తెలీని పరిస్థితుల్లో ఈ నౌక 30 డిగ్రీల మేర కదలడం సూయజ్ కెనాల్ అధారిటీస్ ను సంతోషంలో ముంచెత్తుతోంది. నౌక కింద నీటి ప్రవాహం మొదలైందని ప్రస్తుతానికి 20వేల టన్నుల ఇసుకను తొలగించడంతో ఇది సాధ్యమైందని కెనాల్ అధారిటీ అధారిటీ కీలక ప్రకటన చేసింది.
ప్రపంచవ్యాప్తంగా 15 శాతం నౌకలు ఈ సూయజ్ కాలువ ద్వారానే ప్రయాణిస్తూంటాయి. నాలుగు ఫుట్ బాల్ గ్రౌండ్స్ పొడవుండే ఈ నౌక ఆగిపోవడం యూరప్ వాణిజ్యంపై తీవ్ర ప్రభావం చూపుతోంది. ఈ నౌక వల్ల ఇరువైపులా అనేక నౌకలు నిలిచిపోయాయి. ఇప్పటికి వచ్చిన చిన్న కదలికతో ఆ మార్గాన్ని క్లియర్ చేసేందుకు సూయజ్ కాలువ అధారిటీ నిపుణులు తీవ్రంగా శ్రమిస్తున్నారు.
556862 955364This style is incredible! You undoubtedly know how to keep a reader amused. Between your wit and your videos, I was almost moved to start my own weblog (effectively, almostHaHa!) Amazing job. I actually loved what you had to say, and a lot more than that, how you presented it. Too cool! 502522
957630 38343Watch the strategies presented continue reading to discover and just listen how to carry out this incredible like you organize your company at the moment. educational 793906