‘సైరా’పై వివాదాలకు స్కెచ్‌ రెడీ అవుతోందక్కడ..

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? admin@telugubulletion.com ని సంప్రదించండి.

89,291FansLike
57,764FollowersFollow

‘వాల్మీకి’ సినిమా టైటిల్‌ వివాదంలో ఇరుక్కోవడం.. చివరి నిమిషంలో సినిమా టైటిల్‌ని ‘గద్దలకొండ గణేష్‌’గా మార్చాల్సి రావడం.. అన్నీ అనూహ్యంగా జరిగిపోయాయి. సినిమా ఈ రోజు ప్రేక్షకుల ముందుకొచ్చింది. సినీ పరిశ్రమ మొత్తం ‘వాల్మీకి’ టీమ్‌కి అండగా నిలిచింది. మరోపక్క, సినిమా టైటిల్‌ మార్చిన తర్వాత కూడా అక్కడక్కడా సినిమాకి వ్యతిరేకంగా గళం విప్పుతున్నారు కొందరు.

సెన్సార్‌ సర్టిఫికెట్‌లో ‘వాల్మీకి’ పేరుని తొలగించాలనీ.. దాంతోపాటుగా, ఇప్పటిదాకా విడుదల చేసిన ప్రోమోస్‌ అన్నీ మార్చాలనీ వింత వాదనల్ని తెరపైకి తెస్తున్నారు ఆందోళనకారులు. ఇదిలా వుంటే, ‘సైరా నరసింహారెడ్డి’ సినిమాపైనా కొందరు కన్నేశారనీ, టైమ్‌ చూసి దెబ్బ కొట్టేందుకు తెరవెనుక వ్యూహాలు సిద్ధమవుతున్నారనీ ఓ ప్రచారం తెరపైకొచ్చింది.

‘వాల్మీకి’ వివాదం ఎలాగైతే రాయలసీమలో పుట్టుకొచ్చిందో, ‘సైరా’ మీద వివాదం కూడా అదే రాయలసీమ నుంచి రాబోతోంది. ఉయ్యాలవాడ నరసింహారెడ్డి, రాయలసీమకి చెందిన పోరాటయోధుడు. సినిమా కథ విషయమై ఉయ్యాలవాడ వంశస్తులమంటూ కొందరు ఇప్పటికే పలుమార్లు ఆందోళనలు చేశారు. ఆ మధ్య చిరంజీవి ఇంటి ముందు కూడా కొందరు నానా యాగీ చేసేందుకు ప్రయత్నించిన విషయం విదితమే.

అయితే, ఆ వివాదాలు ఎలాగోలా సద్దుమణిగాయి. కానీ, విడుదలకు ముందు ‘సైరా’ వివాదాల్ని ఎదుర్కో తప్పదనీ, తెరవెనుక రాజకీయ ఒత్తిళ్ళు ‘సైరా నరసింహారెడ్డి’కి అడ్డంకిగా మారబోతున్నాయనీ.. సినీ పరిశ్రమలో చర్చ జరుగుతోంది. తెలుగు సినీ పరిశ్రమ పట్ల ఆంధ్రప్రదేశ్‌లో ఓ రాజకీయ పార్టీ కొంతకాలంగా అసహనంతో వుందనీ, ఇప్పుడు ఆ రాజకీయ పార్టీనే ‘వాల్మీకి’ వివాదాన్ని రాజేసిందనీ, ‘సైరా’ విషయంలోనూ ఆ రాజకీయ పార్టీ ముఖ్య పాత్ర పోషించబోతోందనీ తెలుస్తోంది.

‘వాల్మీకి’ పరిస్థితి వేరు.. ‘సైరా నరసింహారెడ్డి’ పరిస్థితి వేరు. టిక్కెట్ల ధర పెంపు, అదనపు షోలు.. ఇలా చాలా వ్యవహారముంటుంది ‘సైరా నరసింహారెడ్డి’కి. మరి, ఆ విషయాల్లో నిర్మాత రామ్‌చరణ్‌, ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వాన్ని ఒప్పించగలుగుతారా.? ఎలాంటి వివాదాల్లేకుండా ‘సైరా’ విడుదల ప్రశాంతంగా జరుగుతుందా.? వేచి చూడాల్సిందే.

8 COMMENTS

సినిమా

మిస్ ఇండియా నుంచి టాలీవుడ్ వరకూ.. మీనాక్షి చౌదరి ప్రయాణం

ఈరోజు అందం, ప్రతిభ కలగలిసిన హీరోయిన్ మీనాక్షి చౌదరి పుట్టిన రోజు. మిస్ ఇండియా వేదిక నుంచి సినీ ప్రపంచంలోకి అడుగుపెట్టి, తక్కువ సమయంలోనే తెలుగు...

ముందుగానే రానున్న ‘ఉస్తాద్ భగత్ సింగ్’ తుఫాన్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న భారీ మాస్ ఎంటర్‌టైనర్ ‘ఉస్తాద్ భగత్ సింగ్’ విడుదల తేదీ ముందుకు వచ్చింది. ముందుగా...

DeviSri-Mythri: దేవిశ్రీ-మైత్రి మధ్య దూరం..! నెట్టింట చర్చ

DeviSri-Mythri: సినిమా విజయానికి సంగీతం ఎంతో కీలకం. ముఖ్యంగా భారతీయ సినిమాల్లో పాటలు, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ సినిమాకి ప్రాణం లాంటివి. ఒక సినిమా విడుదలకు ముందే...

Allu Arjun: నటి పావలా శ్యామలకు అల్లు అర్జున్ ఆర్ధిక సాయం.....

Allu Arjun: వెండితెరపై క్యారెక్టర్ ఆర్టిస్టుగా, కమెడియన్ గా నటించిన పావలా శ్యామల కొన్నేళ్లుగా అనారోగ్యంతో బాధపడుతున్న సంగతి తెలిసిందే. చిరంజీవితోసహా ఆమెకు ఆర్ధికసాయం చేసిన...

Pawan Kalyan: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ కు మరో మ్యూజిక్ డైరక్టర్.....

Pawan Kalyan: పవన్ కల్యాణ్ హీరోగా హరీశ్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా ‘ఉస్తాద్ భగత్ సింగ్’. భారీ అంచనాలతో సినిమా ఈనెల 26న విడుదల...

రాజకీయం

కొత్త జిల్లాల ప్రాతిపదికన జడ్పీ ఎన్నికలు నిర్వహిస్తాం: పవన్ కళ్యాణ్

రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో భాగంగా జడ్పీ ఎన్నికలను కొత్తగా విభజించిన జిల్లాల ప్రాతిపదికన నిర్వహించేందుకు ప్రభుత్వం యోచిస్తున్నట్లు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తెలిపారు. ఈ దిశగా ఇప్పటికే ప్రభుత్వం కసరత్తు...

కల్తీ నెయ్యి డబ్బులపై ధూళిపాళ్ల సంచలన ఆరోపణలు

టీడీపీ ఎమ్మెల్యే, సంగం డెయిరీ చైర్మన్ ధూళిపాళ్ల తాజాగా కల్తీ నెయ్యి వ్యవహారంపై తీవ్ర ఆరోపణలు చేశారు. కల్తీ నెయ్యి అక్రమ సొమ్ము కోట్ల రూపాయలుగా విజయవాడ, చెన్నైలకు చేరిందని ఆయన పేర్కొన్నారు....

నారా లోకేష్ ఆత్మీయ విందు.. ఉత్తరాంధ్ర ప్రజాప్రతినిధులతో ఉల్లాస సమ్మేళనం

ఉత్తరాంధ్రలోని విశాఖపట్నం, అరకు పార్లమెంట్ పరిధిలోని ప్రజాప్రతినిధులు, వారి కుటుంబసభ్యులతో రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖ మంత్రి నారా లోకేష్ నిర్వహించిన ఆత్మీయ విందు సమావేశం ఆనందభరిత వాతావరణంలో జరిగింది. ఉండవల్లిలోని...

ఎచ్చెర్లలో వైసీపీ నేతలు వరుసగా జనసేనలోకి చేరిక

మంచి వ్యక్తిత్వం ఉన్నవారినే జనసేన పార్టీలోకి ఆహ్వానిస్తున్నామని ఎమ్మెల్సీ, జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి కె. నాగబాబు స్పష్టం చేశారు. జనసేనలో చేరే నాయకులు, కార్యకర్తలు ఎవరు అయినా సరే ముందుగా జనసైనికులు...

ప్రేమ కుమార్ సమక్షంలో జనసేనలోకి గాయత్రి నగర్ మహిళల చేరిక

హైదరాబాద్ కూకట్‌పల్లి నియోజకవర్గంలో జనసేన పార్టీకి మద్దతు క్రమంగా పెరుగుతోంది. ఈ నేపథ్యంలో అల్లాపూర్ గాయత్రి నగర్ డివిజన్‌కు చెందిన మహిళలు పెద్ద సంఖ్యలో జనసేన పార్టీలో చేరారు. కెపిహెచ్‌బి కాలనీలోని జనసేన...

ఎక్కువ చదివినవి

Daily HoroScope: సింహ రాశికి ఉద్యోగ అవకాశాలు మెరుగ్గా – మీన రాశి వారికి కుటుంబంలో శుభవార్తలు

మార్చి 3, 2026 మంగళవారం రాశిఫలాలు: మేషం (Aries): ఈ రోజు మీకు ఉత్సాహంగా ప్రారంభమవుతుంది. పనిలో కొత్త బాధ్యతలు వస్తాయి. అధికారులతో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. కుటుంబ సభ్యుల సహకారం లభిస్తుంది. ఆర్థిక...

అభివృద్ధి చెందిన రాష్ట్రాలే దేశానికి బలం: నారా లోకేష్

ముంబయిలో జరిగిన ‘ఐడియాస్ ఆఫ్ ఇండియా - 2026’ సదస్సులో ఆంధ్రప్రదేశ్ విద్య, ఐటి, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ కీలక వ్యాఖ్యలు చేశారు. అభివృద్ధి చెందిన రాష్ట్రాలే దేశాన్ని బలంగా...

వేట్లపాలెం పేలుడు ఘటనపై రాజమండ్రిలో సీఎం–డిప్యూటీ సీఎం భేటీ,

రాజమండ్రి: వేట్లపాలెంలో జరిగిన భారీ పేలుడు ఘటనపై రాష్ట్ర ప్రభుత్వం అత్యవసరంగా స్పందిస్తోంది. ఈ నేపథ్యంలో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి Pawan Kalyan రాజమండ్రి విమానాశ్రయానికి చేరుకున్నారు. అక్కడి నుంచి నేరుగా కాకినాడ...

దేవుడిని రాజకీయాల్లోకి లాగొద్దు: మండలిలో లోకేష్ ఘాటు వ్యాఖ్యలు

తిరుమల లడ్డూలో నెయ్యి కల్తీ అంశంపై ఆంధ్రప్రదేశ్ శాసనమండలిలో తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. ఈ సందర్భంగా వైసీపీ సభ్యులు చేసిన ఆరోపణలపై విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ తీవ్రంగా...

చంద్ర గ్రహణం 2026: మీ రాశిపై ప్రభావం ఎంత? ఏ రంగు బట్టలు మంచివి?

మార్చి 3, 2026 సాయంత్రం జరగబోయే చంద్ర గ్రహణం అనేక రాశులపై ప్రభావం చూపే అవకాశం ఉందని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు. చంద్ర గ్రహణం సాధారణంగా మన భావోద్వేగాలు, ఆర్థిక పరిస్థితులు, కుటుంబ...