Samantha: సౌత్ సినిమా స్టార్ హీరోయిన్ సమంత (Samantha) కిల్లర్ లుక్స్ తో వచ్చిన కొత్త స్టిల్స్ నెటిజన్లను, ఆమె అభిమానులను ఆకట్టుకుంటున్నాయి. అల్ట్రా మోడ్రన్ గా ఉన్న స్టిల్స్ తో సమంత కుర్రకారును హీటెక్కిస్తోందని చెప్పాలి. ప్రస్తుతం ఆమె స్టిల్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి. అయితే.. ఈ పిక్స్ ఫెమినా మ్యాగజైన్ పై మెరిశాయి.
మహిళా దినోత్సవం సందర్భంగా సమంత పిక్స్ ప్రచురించింది ఫెమినా (Femina) ఇండియా మ్యాగజైన్. ఇన్ స్టాలో పిక్స్ తోపాటు సుదీర్ఘ పోస్ట్ కూడా చేసింది. ‘ఏమాయ చేసావె నుంచి సిటాడెల్ వరకూ ఆమె జర్నీ ఎందరో మహిళలకు స్ఫర్తిని ఇస్తుంది. మానసికంగా ధృడంగా ఎలా ఉండాలో నేర్పిస్తుంద’ని పేర్కొంది.
మయోసైటిస్ నుంచి కోలుకుంటున్న సమంత ఇటివల మళ్లీ సోషల్ మీడియాలో యాక్టివ్ అవుతోంది. రీసెంట్ గా బికినీలో ఆమె పిక్స్ గంటలో 15లక్షల లైక్స్ సాధించడం విశేషం. సిటాడెల్ వెబ్ సిరీస్ కు సమంత డబ్బింగ్ చెప్పింది. మరోవైపు.. రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంలో సినిమా అంగీకరించిందని గాసిప్స్ వస్తున్నాయి.