Switch to English

థియేటర్లు ఓపెన్‌ అవ్వడమే ఆలస్యం మూడు లైన్‌ లో పెట్టిన వర్మ

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,393FansLike
57,764FollowersFollow

వివాదాల దర్శకుడు రామ్‌ గోపాల్‌ వర్మ ఈ లాక్‌ డౌన్‌ లో కూడా బిజీ బిజీగా గడిపాడు. చిన్న సినిమాలు పెద్ద సినిమాలు కలిపి ఆయన పది వరకు పూర్తి చేసినట్లుగా ఉన్నాడు. కొన్ని ఏటీటీ ద్వారా ప్రేక్షకుల ముందుకు వస్తే కొన్ని థియేటర్ల ద్వారా విడుదలకు సిద్దం అవుతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో థియేటర్లు ఓపెన్‌ అయ్యాయి. ఈ నేపథ్యంలో వర్మ తన సినిమాలను విడుదల చేసేందుకు సిద్దం అవుతున్నాడు. ఇప్పటికే షూటింగ్‌ పూర్తి అయిన ‘కరోనా వైరస్‌’ సినిమాను ఈ నెల 11న విడుదల చేయబోతున్నట్లుగా అధికారికంగా ప్రకటన వచ్చింది.

కరోనా వైరస్‌ నేపథ్యంలో రాబోతున్న మొదటి సినిమా ఇదే అయ్యి ఉంటుంది అనడంలో సందేహం లేదు. మూడు నాలుగు నెలల క్రితమే ఈ సినిమా షూటింగ్‌ పూర్తి అయ్యింది. థియేటర్లు లేకపోవడం వల్ల వర్మ సినిమా విడుదల వాయిదా వేస్తూ వచ్చాడు. ఎట్టకేలకు ఈ సినిమా విడుదల తేదీ ప్రకటించాడు. థియేటర్లకు జనాలు వస్తారా రారా అనే విషయం వర్మకు అనవసరం అన్నట్లుగా ఉంది. అందుకే కేవలం ఆ ఒక్క సినిమా మాత్రమే కాకుండా తదుపరి వారం ‘మర్డర్‌’ ఆ తర్వాత ‘దిశ ఎన్‌ కౌంటర్‌’ ను విడుదల చేస్తానంటూ అధికారికంగా ప్రకటించాడు.

మిర్యాలగూడెంలో జరిగిన పరువు హత్య నేపథ్యంలో ‘మర్డర్’ సినిమాను రూపొందించిన విషయం తెల్సిందే. మర్డర్‌ సినిమాను విడుదల అవ్వనివ్వొద్దు అంటూ అమృత కోర్టుకు వెళ్లగా అక్కడ వర్మకు అనుకూలంగా తీర్పు వచ్చింది. దాంతో సినిమా విడుదలకు రెడీ అవుతోంది. మర్డర్‌ 18వ తారీకున విడుదల కానుండగా దిశా రేప్‌ కేసుపై తీసిన ‘దిశా ఎన్‌ కౌంటర్‌’ మూవీని 25న ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చే అవకాశం కనిపిస్తుంది. మొత్తానికి వర్మ థియేటర్లు ఓపెన్ అవ్వడమే ఆలస్యం మూడు సినిమాలను విడుదల చేస్తున్నాడు. మరి ఈ సినిమాలను చూసేందుకు జనాలు ఏమేరకు థియేటర్లకు వస్తారో చూడాలి.

2 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Indian 2: భారతీయుడు కంటే భారతీయుడు-2 మరింత పవర్ ఫుల్: శంకర్

Indian 2: కమల్ హాసన్ (Kamal Hassaan)-శంకర్ (Shankar) కాంబినేషన్లో 1996లో వచ్చిన భారతీయుడు సృష్టించిన సంచలనం తెలిసిందే. 28ఏళ్ల తర్వాత భారతీయుడు సీక్వెల్ భారతీయుడు-2...

Allu Arjun: ఫ్యాన్స్ కోసం..! రూ.10కోట్ల యాడ్ ఆఫర్ కు నో...

Allu Arjun: పుష్ప(Pushpa) పుష్పతో పాన్ ఇండియా క్రేజ్ సంపాదించుకున్నారు బన్నీ (Allu Arjun). ఎందరో అభిమానులనూ సంపాదించుకున్నారు. ప్రతి విషయం ఉన్నతంగా ఆలోచించే బన్నీ...

Villa 369: సస్పెన్స్, థ్రిల్లర్ కథాంశాలతో ‘విల్లా 369’

Villa 369: సస్పెన్స్, థ్రిల్లర్ కథాంశాలతో వచ్చిన ఎన్నో సనిమాలు ప్రేక్షకాదరణ పొందాయి. ఆకోవలనే తెరకెక్కిన సినిమా ‘విల్లా 369’ (Villa 369). విజయ్,శీతల్ భట్...

పర్ఫెక్ట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ‘గం.. గం..గణేశా’ ..సక్సెస్ మీట్ లో ఆనంద్...

ఆనంద్ దేవరకొండ హీరోగా ప్రగతి శ్రీ వాస్తవ, నయన్ సారిక హీరోయిన్లుగా నటించిన చిత్రం 'గం.. గం.. గణేశా'. శుక్రవారం థియేటర్లలో విడుదలైన ఈ సినిమా...

Krithi Shetty: ‘మనమే’.. కిడ్, పేరెంట్ ఎమోషన్ ఉన్న సినిమా: కృతి...

Krithi Shetty: శర్వానంద్ (Sharwanand) హీరోగా తెరకెక్కుతున్న 35వ మూవీ 'మనమే' (Maname). కృతి శెట్టి (Krithi Shetty) హీరోయిన్. శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో టిజి...

రాజకీయం

మాట నిలబెట్టుకుంటున్న పవన్ కళ్యాణ్.!

‘నేను గెలవడం కోసం కాదు.. రాష్ట్రం కోసం నన్ను నేను తగ్గించుకుంటున్నాను. నా పార్టీ కోసం కాదు, నా ప్రజల కోసం మమ్మల్ని మేం తగ్గించుకుంటున్నాం..’ అని పదే పదే చెబుతూ వచ్చారు...

ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన పోలింగ్ స్టేషన్.. ఈ విశేషాలు తెలుసా?

దేశంలో సార్వత్రిక ఎన్నికలు ముగిశాయి. ఈ ఎన్నికల్లో పోలింగ్ శాతం పెంచేందుకు కేంద్ర ఎన్నికల సంఘం ఎన్నో వినూత్న కార్యక్రమాలకు శ్రీకారం చుట్టింది. ముఖ్యంగా మారుమూలో గ్రామాల్లో ఉన్న ఓటర్లను పోలింగ్ స్టేషన్...

ఎగ్జిట్ పోల్స్.. ఏ సర్వే ఏం చెబుతోంది?

దేశవ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికల పోలింగ్ ముగిసింది. ఇక అందరి దృష్టి ఎగ్జిట్ పోల్స్ పై పడింది. ఏడో దశ పోలింగ్ సమయం పూర్తయిన వెంటనే ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు వెలువడ్డాయి. వివిధ మీడియా...

ఏపీ రాజకీయాలు.! సినిమా బెట్టింగులు.!

ఆంధ్ర ప్రదేశ్ రాజకీయాలకు సంబంధించి సినీ పరిశ్రమలో బెట్టింగులు జోరుగా సాగుతున్నాయా.? ఇందులో తప్పేముంది.? ఇది కూడా ఓ గేమ్.! కాకపోతే, ఓ జూదం లాంటి వ్యవహారం.! క్రికెట్ మీద బెట్టింగులు, రాజకీయాల...

ఏ ఎగ్జిట్ పోల్ అంచనా ఎలా వుండబోతోంది.?

కాస్సేపట్లో ఎగ్జిట్ పోల్ అంచనాలు వెల్లడి కానున్నాయి. దేశవ్యాప్తంగా జరుగుతున్న సార్వత్రిక ఎన్నికలు (లోక్ సభ ఎన్నికలు), దాంతోపాటుగా, ఆంధ్ర ప్రదేశ్ సహా పలు రాష్ట్రాల్లో జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి తుది...

ఎక్కువ చదివినవి

ఎగ్జిట్ పోల్స్ వచ్చేస్తున్నాయ్.! వాటినెలా నమ్మేది.?

మేమే గెలిచేస్తాం.. అని ప్రధాన రాజకీయ పార్టీలు చెప్పడం చూస్తున్నాం. చెప్పాలి కూడా.! గెలుపు మీద నమ్మకం లేకపోతే రాజకీయాల్లో మనుగడ కష్టం. గెలవడానికే ఎవరైనా ప్రయత్నిస్తారు.. కొందరైతే ఎంతకైనా తెగిస్తారు.. అది...

Election Results: బిగ్ స్క్రీన్ పై ఎన్నికల ఫలితాలు.. ఏఏ సినిమా ధియేటర్లలో తెలుసా..

Election Results: జూన్ 1న జరుగబోయే చివరి దశ పోలింగ్ తో దేశంలో ఎన్నికల సందడి ముగియనుంది. దీంతో యావత్ దేశం జూన్ 4న వెలువడే లోక్ సభ ఎన్నికల ఫలితాల (...

తెలంగాణలో ఈ ‘మార్పు’ మంచిదేనా రేవంత్ రెడ్డీ.?

తెలంగాణ రాజకీయాల్లో రచ్చకి ఓ ‘మార్పు’ కారణమవుతోంది. ముందేమో, ‘టీఎస్’ నుంచి, ‘టీజీ’గా జరిగిన ‘మార్పు’ చుట్టూ రగడ షురూ అయ్యింది. ఇప్పుడేమో, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ అధికారిక చిహ్నం మార్పు వ్యవహారం...

Daily Horoscope: రాశి ఫలాలు: బుధవారం 29 మే 2024

పంచాంగం తేదీ 29- 05-2024, బుధవారం, శ్రీ క్రోధి నామ సంవత్సరం, ఉత్తరాయణం, వైశాఖమాసం,వసంత రుతువు సూర్యోదయం: ఉదయం 5:31 గంటలకు సూర్యాస్తమయం: సాయంత్రం 6:27 గంటలకు తిథి: బహుళ షష్ఠి పగలు 1.10 వరకు తదుపరి సప్తమి నక్షత్రం:...

వైఎస్సార్సీపీ దగ్గర వున్న ‘ప్లాన్-బి’ అదేనా.?

‘ఎట్టి పరిస్థితుల్లోనూ అధికాంలోకి వస్తాం..’ అని అంటోంది వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ. 150 ప్లస్ సీట్లతో ఇంకోసారి అదికారం చేపడతామని ఇప్పటికే ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, తన కోసం గత...