Switch to English

కాంగ్రెస్‌ ఖేల్‌ ఖతం: బీజేపీలోకి రేవంత్‌ రెడ్డి.?

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,417FansLike
57,764FollowersFollow

తెలంగాణలో కాంగ్రెస్‌ పార్టీ పరిస్థితి నానాటికీ దిగజారుతూ వస్తోంది. అధికార తెలంగాణ రాష్ట్ర సమితి, ‘ఆపరేషన్‌ గులాబీ’ పేరుతో పార్టీ ఫిరాయింపుల్ని ప్రోత్సహించడం ఒక కారణం అయితే, కాంగ్రెస్‌ పార్టీలో అంతర్గత కుమ్ములాటలు ఇంకో కారణంగా కన్పిస్తోంది కాంగ్రెస్‌ పార్టీ పతనానికి. నేతలు ఒకరొకరుగా పార్టీ నుంచి జారుకుంటున్నా, కాంగ్రెస్‌ అధిష్టానం ఏమీ చేయలేకపోతోంది.. తెలంగాణ కాంగ్రెస్‌ నాయకత్వమూ చోద్యం చూస్తోంది.

ప్రస్తుతానికి కాంగ్రెస్‌ పార్టీ తరఫున బలంగా వాయిస్‌ విన్పిస్తోన్న రేవంత్‌ రెడ్డి కూడా రేపో మాపో కాంగ్రెస్‌ని వీడడం ఖాయంగానే కన్పిస్తోంది. ఆయన ఒకవేళ్ళ వెళ్ళకపోయినా, పార్టీ నుంచి బలవంతంగా ఆయన్ని వెల్లగొట్టేదాకా ఆగేలా లేరు, కాంగ్రెస్‌లో కొందరు నేతలు. నల్లమలలో యురేనియం తవ్వకాలపై పోరాటం సహా అనేక అంశాలకు సంబంధించి రేవంత్‌ రెడ్డి పేరు మార్మోగిపోతోన్న విషయం విదితమే. అది తెలంగాణలో కొందరు కాంగ్రెస్‌ నేతలకు నచ్చడంలేదు. పీసీసీ అధ్యక్ష పదవి కూడా రేవంత్‌ రెడ్డికి దక్కనుందన్న ఊహాగానాలు తెరపైకొచ్చాయి.

Also Read: కాంగ్రెస్ లో వ్యతిరేక పవనం ఎందుకో?

దాంతో, రేవంత్‌ వ్యతిరేకలంతా ఒక్కతాటిపైకొచ్చి.. కాంగ్రెస్‌ అధిష్టానం దగ్గర పంచాయితీ పెట్టారు. తాజా పరిణామాల నేపథ్యంలో రేవంత్‌ రెడ్డి తీవ్ర కలత చెందుతున్నట్లు తెలుస్తోంది. ‘ఇలాగైతే తెలంగాణ రాష్ట్ర సమితిని ఎదిరించి, కాంగ్రెస్‌ పార్టీని బలోపేతం చేయలేం. నాకున్న అవకాశాల్ని సద్వినియోగం చేసుకునేందుకు ప్రయత్నించాను. ఇకపై ఏం చేయడానికి వీల్లేని పరిస్థితి..’ అంటూ సన్నిహితుల వద్ద వాపోయారట రేవంత్‌ రెడ్డి ఇటీవలి కాలంలో చోటు చేసుకున్న పరిణామాలపై.

మరోపక్క, బీజేపీ ముఖ్య నేతలు రేవంత్‌ రెడ్డితో టచ్‌లోకి వచ్చినట్లు తెలుస్తోంది. రేవంత్‌ మాత్రమే కాదు, మరో కాంగ్రెస్‌ ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డికి కూడా బీజేపీ గాలం వేస్తున్నట్లు సమాచారం. కోమటిరెడ్డి వెంకటరెడ్డి సోదరుడు కోమటిరెడ్డి రాజగోపాల్‌ రెడ్డి ఆల్రెడీ బీజేపీకి మద్దతుగా మాట్లాడుతోన్న విషయం విదితమే.

3 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Hema: ‘నన్ను ఇందులోకి లాగొద్దు..’ బెంగళూరు రేవ్ పార్టీపై నటి హేమ

Hema: బెంగళూరు (Bengaluru) నగర శివారులోని ఎలక్ట్రానిక్ సిటీ సమీపంలో జరిగిన రేవ్ పార్టీ కలకలం రేపుతోంది. ఓ ఫామ్ హౌస్ లో జరిగినట్టుగా వార్తలు...

Jr.Ntr Birthday special: యాక్టింగ్ డైనమైట్.. అభిమానుల సంబరం.. ‘జూ.ఎన్టీఆర్’..

Jr.Ntr Birthday special: బాల నటుడిగానే అద్భుతమైన ప్రతిభ.. యుక్త వయసులోనే హీరో.. తక్కువ సమయంలోనే స్టార్ స్టేటస్.. నటనలో డైనమైట్.. డ్యాన్స్ లో స్పీడ్.....

Jr.Ntr Birthday special: టెక్నీషియన్స్ ఫేవరెట్.. జూ.ఎన్టీఆర్..! ఉదాహరణలివే..

Jr.Ntr Birthday special: తెలుగు సినీ పరిశ్రమలో ఘనమైన కుటుంబ నేపథ్యం ఉన్న కుటుంబాల్లో ఒకటి నందమూరి. విశ్వవిఖ్యాత నట సార్వభౌమ ఎన్టీఆర్ మనవడిగా.. హరికృష్ణ...

చిరంజీవి, కమల్ హాసన్.! ఎవరు గొప్ప నటుడు.?

సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్ వార్స్, ట్రోలింగ్.. ఇవేవీ లేకపోతే, చాలామంది అనాధలైపోతారు.! అనాధలైపోవడమంటే, ఎవరూ పట్టించుకోకుండా పోతారని అర్థం. ఈ లిస్టులో కొందరు సెలబ్రిటీలనబడేవారు...

Prabhas: ప్రభాస్ చెప్పిన బుజ్జి ఇదే.. ఉత్కంఠ రేకెత్తిస్తున్న వీడియో

Prabhas: స్టార్ హీరో ప్రభాస్ (Prabhas) ఇటివల ‘హాయ్.. డార్లింగ్స్. నా లైఫ్ లోకి కొత్తగా ఒకరు వస్తున్నారు. వెయిట్ చేయండి’ అనే పోస్ట్ బాగా...

రాజకీయం

కింగ్ మేకర్ జనసేనాని: వైసీపీ అంతర్గత సర్వేల్లో ఇదే తేలిందా.?

టీడీపీ - వైసీపీకి సమానంగా సీట్లు రావొచ్చు. జనసేన పార్టీకి తక్కువలో తక్కువ పన్నెండు సీట్లు వస్తాయ్.! రెండు ఎంపీ సీట్లు కూడా జనసేన గెలుచుకోబోతోంది. ఈ పరిస్థితుల్లో జనసేన అధినేత పవన్...

ఓటు అమ్ముకున్న పోలీస్.! వింతేముంది.?

దొరికేదాకా దొరలే.! దొరికితేనే దొంగ.! ఓ పోలీస్ అధికారి ఓటుని అమ్ముకుని, సస్పెండ్ అయ్యాడు.! ఏంటీ, భారతదేశంలో ఓటుని అమ్ముకోవడం నేరమా.? మరి, కొనుక్కుంటున్న రాజకీయ పార్టీలు, రాజకీయ నాయకుల సంగతేంటి.? ఎమ్మెల్యే టిక్కెట్...

జగన్, చంద్రబాబు.. విదేశీ ‘రాజకీయ’ పర్యటనల వెనుక.!

వైఎస్ జగన్ మోహన్ రెడ్డి లండన్ వెళ్ళారు. నారా చంద్రబాబునాయుడు విదేశాలకు వెళ్ళనున్నారు. పవన్ కళ్యాణ్ కూడా విదేశాలకు వెళ్ళే అవకాశం వుందట. విదేశాలకు వెళితే తప్పేముంది.? ఒకరు విదేశాలకు వెళితే, పారిపోయినట్టు...

వంగా గీత మెగాభిమానం.! నిజమేనా.? నమ్మొచ్చా.?

మెగాస్టార్ చిరంజీవి అన్నయ్య అంటే, నాకు అమితమైన అభిమానం. చిరంజీవి తమ్ముడిగా పవన్ కళ్యాణ్ అన్నా కూడా అభిమానమే. నాగబాబు అంటే కూడా అంతే గౌరవం.! ఈ మాటలు అన్నదెవరో కాదు, కాకినాడ ఎంపీ...

కోటి రూపాయలు కొల్లగొట్టిన మహిళా ఎర్నలిస్ట్ ఎవరు.?

ఎన్నికల సమయంలో ఓ మహిలా ఎర్నలిస్టు, ఏకంగా కోటి రూపాయలు కొల్లగొట్టిందట.! ఆంధ్ర ప్రదేశ్ రాజకీయాల్లో ఇప్పుడు ఇదో హాట్ టాపిక్.! ఎవరా మహిళా ఎర్నలిస్ట్.? ఏమా కథ.? అధికార వైసీపీకి అత్యంత...

ఎక్కువ చదివినవి

కడపలో వైసీపీని వైఎస్ షర్మిల అంతలా దెబ్బ కొట్టిందా.?

ఉమ్మడి కడప జిల్లాతోపాటు రాయలసీమ వ్యాప్తంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి వైఎస్ షర్మిల నుంచి గట్టి దెబ్బ తగలనుందా.? రాష్ట్రంలోని మిగతా జిల్లాల్లోనూ కొన్ని చోట్ల వైఎస్ షర్మిల ఇంపాక్ట్‌కి వైసీపీ కుదేలవనుందా.? ఏపీసీసీ...

Silk Saree: మే24న వస్తున్న రొమాంటిక్ లవ్ స్టోరీ.. ‘సిల్క్ శారీ’

Silk Saree: వాసుదేవ్ రావు, రీవా చౌదరి, ప్రీతి గోస్వామి హీరో హీరోయిన్లుగా టి. నాగేందర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా "సిల్క్ శారీ" (Silk Saree). కమలేష్ కుమార్ నిర్మాత. మే24న విడుదలవుతోన్న...

ఓటు అమ్ముకున్న పోలీస్.! వింతేముంది.?

దొరికేదాకా దొరలే.! దొరికితేనే దొంగ.! ఓ పోలీస్ అధికారి ఓటుని అమ్ముకుని, సస్పెండ్ అయ్యాడు.! ఏంటీ, భారతదేశంలో ఓటుని అమ్ముకోవడం నేరమా.? మరి, కొనుక్కుంటున్న రాజకీయ పార్టీలు, రాజకీయ నాయకుల సంగతేంటి.? ఎమ్మెల్యే టిక్కెట్...

జనసేన మీద వైసీపీ నేతలు బెట్టింగ్ కాస్తున్నారా.?

ఇదో ఇంట్రెస్టింగ్ పరిణామం.! అదీ, ఉభయ గోదావరి జిల్లాల్లో చోటు చేసుకుంటున్న వైపరీత్యం.! జనసేన పార్టీ గెలుస్తుందని వైసీపీ నేత ఒకరు భారీ స్థాయిలో డబ్బులు పందెం కాశారట. వేలల్లో అయితే వింతేమీ...

ఐదేళ్ళుగా సినీ పరిశ్రమను దోచేశాం: వైసీపీ అను‘కుల’ మీడియా.!

ఐదేళ్ళపాటు అధికారంలో వున్నాం.. అందినకాడికి సినీ పరిశ్రమని అడ్డగోలుగా దోచేసుకున్నాం.! ఇదీ వైసీపీ అను‘కుల’ మీడియా చెబుతున్నమాట.! ఆంధ్ర ప్రదేశ్‌లో ఐదేళ్ళపాటు అధికారం వెలగబెట్టిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, తన చెప్పు చేతల్లో...