Switch to English

రేవంత్ కే పట్టం: ఈ రాత్రికి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,058FansLike
57,764FollowersFollow

అందరూ ఊహించిన విధంగానే కాంగ్రెస్ రేవంత్ రెడ్డికి సీఎం కుర్చీ ని అప్పగించింది. సోమవారం రాత్రి 7 గంటలకు రేవంత్ రెడ్డి తెలంగాణ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. రాష్ట్ర గవర్నర్ తమిళసై సౌందరరాజన్ ఆయనతో రాజభవన్ లో ప్రమాణ స్వీకారం చేయిస్తారు.

కాంగ్రెస్ సభాపక్ష నేత ఎంపిక కోసం ఎమ్మెల్యేలందరూ గచ్చిబౌలిలోని ఓ హోటల్లో సమావేశం అయ్యారు. ఎంపిక బాధ్యతను ఎమ్మెల్యేలందరూ అధిష్టానానికి అప్పగించారు. ఈ మేరకు ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున కర్గే ఏకగ్రీవంగా అప్పగించారు. దీనికి సంబంధించి పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ప్రవేశపెట్టిన ఏకవాక్య తీర్మానాన్ని ఎమ్మెల్యే సీతక్క, భట్టి విక్రమార్క సహా పలువురు ఎమ్మెల్యేలు బలపరిచారు. రాష్ట్ర నాయకత్వం పంపిన నిర్ణయాన్ని పరిశీలించిన ఏఐసీసీ.. రేవంత్ రెడ్డి వైపే మొగ్గు చూపింది.

562 COMMENTS