Switch to English

ఏమిటీ వైపరీత్యం: ప్రత్యేక హోదా కోసం వైసీపీ పోరాటమా.?

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,421FansLike
57,764FollowersFollow

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాల్సిందేనంటూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పోరుబాట పట్టింది. అదేంటీ, వైసీపీ.. ఇప్పుడు అధికారంలోనే వుంది కదా.? ప్రత్యేక హోదా ఉద్యమాన్ని మర్చిపోయి దాదాపు రెండేళ్ళయ్యింది కదా.? మళ్ళీ ఇప్పుడెందుకు ప్రత్యేక హోదా కోసం వైసీపీ ఉద్యమిస్తోంది.? అన్న ప్రశ్నలు సర్వత్రా వినిపిస్తుండడం వింతేమీ కాదు.

కానీ, అధికార పార్టీలోనే కొంత ఆశ్చర్యం వ్యక్తమవుతోందట ఈ విషయమై. ‘అడుగుతూనే వుంటాం.. అంతకు మించి ఏం చేయగలం.?’ అంటూ పలు సందర్భాల్లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేతులెత్తేసిన వైనాన్ని చూశాం. కానీ, సీన్ మారింది. కేంద్రం మెడలు వంచేస్తాం.. అన్న స్థాయిలోనే ఇటీవల వైసీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ (రాజ్యసభ) విజయసాయిరెడ్డి హంగామా చేశారు. అందుకు అనుగుణంగానే చట్ట సభల్లో (పార్లమెంటు) వైసీపీ సభ్యులు హంగామా షురూ చేశారు.

ఈ పనేదో గడచిన రెండేళ్ళలో చిత్తశుద్ధితో చేసి వుంటే, ఈపాటికి సీన్ ఇంకోలా వుండేది. ఎక్కడో ఏదో తేడా కొడుతోంది. బలమైన రాజకీయ ప్రయోజనాలు లేకుండా.. ఎవరో వెనకనుండి ప్రోత్సహించకుండా.. వైసీపీ ఈ స్థాయిలో ప్రత్యేక హోదా కోసం ఉద్యమించే పరిస్థితి వుండదు. కరోనా నేపథ్యంలో కేంద్రంలోని మోడీ సర్కార్ నానా తంటాలూ పడాల్సి వస్తోంది. స్వీయ తప్పిదాలతో మోడీ సర్కార్, ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకతని ఎదుర్కొంటోంది. పెట్రోధరల వాత, వ్యాక్సినేషన్ ప్రక్రియలో లోపాలు.. వెరసి, విపక్షాలకు సమాధానం చెప్పలేని స్థితిలో వుంది కేంద్రం.

ఇలాంటి పరిస్థితుల్లో అధికార బీజేపీని గట్టున పడేయాలంటే, ఓ నాటకీయ కార్యక్రమం అవసరం. అదే కార్యక్రమాన్ని బీజేపీ, తనకు తెరవెనుకాల వివిధ అంశాల్లో మద్దతిస్తోన్న వైసీపీ ద్వారా చేయిస్తోందా.? అన్న అనుమానాలు కలుగుతున్నాయి. వైసీపీ నిలదీస్తోందట.. అధికార పక్షం మిన్నకుండిపోతోందట.. ఇదీ వైసీపీ అనుకూల మీడియా వైసీపీ ప్రత్యేక హోదా పోరు గురించి అల్లుతున్న కథనాల సారాంశం.

చంద్రబాబు హయాంలో, వైసీపీ ఎంపీలు ప్రత్యేక హోదా కోసం రాజీనామాస్త్రాలు సంధించారు. అప్పుడే కేంద్రం దిగొచ్చింది లేదు. అసలు పట్టించుకున్నదీ లేదు. అలాంటిది, ఇప్పుడు వైసీపీ ఎంపీలు పోరాటం చేస్తే ఉపయోగం ఏమన్నా వుంటుందా.? ఛాన్సే లేదు. ఆ విషయం వైసీపీకి కూడా తెలుసు. ప్రత్యేక హోదా ముసుగులో వైసీపీ చేస్తున్నది పోరాటం కానే కాదు.. మోడీ సర్కారుపై విపక్షాల దాడి వ్యవహారాన్ని డైల్యూట్ చేయడానికి.. అంటే డైవర్షన్ పాలిటిక్స్‌లో భాగంగానే వైసీపీ ఇదంతా చేస్తోందన్నమాట.

3 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Jr.Ntr Birthday special: టెక్నీషియన్స్ ఫేవరెట్.. జూ.ఎన్టీఆర్..! ఉదాహరణలివే..

Jr.Ntr Birthday special: తెలుగు సినీ పరిశ్రమలో ఘనమైన కుటుంబ నేపథ్యం ఉన్న కుటుంబాల్లో ఒకటి నందమూరి. విశ్వవిఖ్యాత నట సార్వభౌమ ఎన్టీఆర్ మనవడిగా.. హరికృష్ణ...

చిరంజీవి, కమల్ హాసన్.! ఎవరు గొప్ప నటుడు.?

సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్ వార్స్, ట్రోలింగ్.. ఇవేవీ లేకపోతే, చాలామంది అనాధలైపోతారు.! అనాధలైపోవడమంటే, ఎవరూ పట్టించుకోకుండా పోతారని అర్థం. ఈ లిస్టులో కొందరు సెలబ్రిటీలనబడేవారు...

Prabhas: ప్రభాస్ చెప్పిన బుజ్జి ఇదే.. ఉత్కంఠ రేకెత్తిస్తున్న వీడియో

Prabhas: స్టార్ హీరో ప్రభాస్ (Prabhas) ఇటివల ‘హాయ్.. డార్లింగ్స్. నా లైఫ్ లోకి కొత్తగా ఒకరు వస్తున్నారు. వెయిట్ చేయండి’ అనే పోస్ట్ బాగా...

SSMB 29: మహేశ్-రాజమౌళి సినిమాలో మరో స్టార్ హీరో..! నిజమెంత..!?

SSMB 29: సూపర్ స్టార్ మహేశ్ (Mahesh) – రాజమౌళి (Rajamouli) కాంబినేషన్లో ఓ భారీ సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. సినిమా ప్రకటించినప్పటి నుంచీ...

Silk Saree: మే24న వస్తున్న రొమాంటిక్ లవ్ స్టోరీ.. ‘సిల్క్ శారీ’

Silk Saree: వాసుదేవ్ రావు, రీవా చౌదరి, ప్రీతి గోస్వామి హీరో హీరోయిన్లుగా టి. నాగేందర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా "సిల్క్ శారీ" (Silk Saree)....

రాజకీయం

కాంగ్రెస్ గెలవాలని వైసీపీ కోరుకుంటోందా.?

రాజకీయాల్లో శాశ్వత శతృవులు శాశ్వత మిత్రులు ఎవరూ వుండరన్నది అందరికీ తెలిసిన విషయమే.! ఆ సూత్రాన్ని వైసీపీ కూడా పాటించక తప్పేలా లేదా.? అంటే, ఔననే వాదన వినిపిస్తోందిప్పుడు.! అసలు విషయమేంటంటే, ఆంధ్ర ప్రదేశ్...

జనసేన మీద వైసీపీ నేతలు బెట్టింగ్ కాస్తున్నారా.?

ఇదో ఇంట్రెస్టింగ్ పరిణామం.! అదీ, ఉభయ గోదావరి జిల్లాల్లో చోటు చేసుకుంటున్న వైపరీత్యం.! జనసేన పార్టీ గెలుస్తుందని వైసీపీ నేత ఒకరు భారీ స్థాయిలో డబ్బులు పందెం కాశారట. వేలల్లో అయితే వింతేమీ...

నాగబాబు ఈజ్ బ్యాక్.! ట్వీటుని తొలగించిన వైనం.!

సినీ నటుడు, జనసేన నేత కొణిదెల నాగబాబు ట్విట్టర్ అకౌంట్ నుంచి ఓ ట్వీటు పడింది. ‘మాతో వుంటూ ప్రత్యర్థులకి పని చేసేవాడు మా వాడైనా పరాయివాడే, మాతో నిలబడేవాడు పరాయివాడైనా మావాడే..’...

ఐదేళ్ళుగా సినీ పరిశ్రమను దోచేశాం: వైసీపీ అను‘కుల’ మీడియా.!

ఐదేళ్ళపాటు అధికారంలో వున్నాం.. అందినకాడికి సినీ పరిశ్రమని అడ్డగోలుగా దోచేసుకున్నాం.! ఇదీ వైసీపీ అను‘కుల’ మీడియా చెబుతున్నమాట.! ఆంధ్ర ప్రదేశ్‌లో ఐదేళ్ళపాటు అధికారం వెలగబెట్టిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, తన చెప్పు చేతల్లో...

గ్రౌండ్ రిపోర్ట్: సంక్షేమ పథకాలు ఓట్లను రాల్చుతాయా.?

ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌కి ముందూ, పోలింగ్ తర్వాతా.. అధికార వైసీపీ, ‘సంక్షేమ పథకాలే మమ్మల్ని గెలిపిస్తాయ్..’ అని చెబుతుండడం చూస్తున్నాం. సంక్షేమం పేరుతో ఓటు బ్యాంకు రాజకీయాలు చేయడం అనేది...

ఎక్కువ చదివినవి

ఎర్ర టవల్ చూస్తే వంగా గీతకు అంత భయమెందుకు.?

పిఠాపురం వైసీపీ అభ్యర్థి వంగా గీతకి ఓ పోలింగ్ కేంద్రంలో చిత్రమైన అనుభవం ఎదురయ్యింది. ‘నమస్కారం పెడుతూ, నాకు ఓటెయ్యడం మర్చిపోవద్దు..’ అంటూ క్యూలైన్లలో వున్న ఓటర్లను అభ్యర్థిస్తూ వెళ్ళడంపై కొందరు ఓటర్లు...

డబ్బులు పోనాయ్.. మేమేటి సేత్తాం.?

ఎన్నికలంటేనే, వందల కోట్లు.. వేల కోట్ల ఖర్చు వ్యవహారం.! అసెంబ్లీ అభ్యర్థి అయినా యాభై నుంచి వంద కోట్లు చూసుకోవాల్సిందే.! కేంద్ర ఎన్నికల సంఘం నిర్దేశించిన విధంగా అభ్యర్థులు పరిమితికి లోబడి ఖర్చు...

క్రాస్ ఓటింగ్ లేదు, గ్లాస్ ఓటింగే.!

పిఠాపురం, కాకినాడ.. ఈ రెండు పేర్లూ మార్మోగిపోతున్నాయి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో. తెలంగాణలోనూ, ఈ రెండు పేర్ల చుట్టూ బోల్డంత చర్చ జరుగుతోంది. ఒకటేమో, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేసిన...

ఎమ్మెల్యే చెంప పగలగొట్టిన సామాన్యుడికి ‘కులాన్ని’ ఆపాదిస్తారా.?

ఎమ్మెల్యేని ఓ సామాన్యుడు దూషించాడట.! దాంతో, ఎమ్మెల్యేకి కోపమొచ్చిందట. అయినాగానీ, శాంతంగానే వున్నాడట ఆయన. సదరు సామాన్యుడే, కులోన్మాదంతో సదరు ఎమ్మెల్యే చెంప పగలగొట్టేశాడట. తీవ్రంగా దాడి చేశాడట. దాడిలో గాయపడి ఆసుపత్రి పాలయ్యింది...

కడపలో వైసీపీని వైఎస్ షర్మిల అంతలా దెబ్బ కొట్టిందా.?

ఉమ్మడి కడప జిల్లాతోపాటు రాయలసీమ వ్యాప్తంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి వైఎస్ షర్మిల నుంచి గట్టి దెబ్బ తగలనుందా.? రాష్ట్రంలోని మిగతా జిల్లాల్లోనూ కొన్ని చోట్ల వైఎస్ షర్మిల ఇంపాక్ట్‌కి వైసీపీ కుదేలవనుందా.? ఏపీసీసీ...