శ్రీదేవి కూతురు జాన్వీ హీరోయిన్ గా పరిచయం కాకముందే తన స్నేహితుడు ఇషాన్ కట్టర్ తో ఘాటు ప్రేమాయణంలో ఉందంటూ అప్పుడే బి టౌన్ మీడియాలో గుసగుసలు వినిపించాయి. అప్పట్లోనే డేటింగ్స్, చాటింగ్స్ అంటూ నానా రచ్చ చేసి మీడియాలో పెద్ద దుమారం రేపారు. వీరిద్దరూ కలిసి ఒకే సినిమాతో పరిచయం అయిన విషయం తెలిసిందే. వీరింకా ప్రేమలోనే ఉన్నారంటూ తాజాగా మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఈ వార్తల విషయంలో జాన్వీ లవర్ ఇషాన్ కట్టర్ స్పందించాడు.
తాజాగా ఓ టివి షో లో ఈ వ్యవహారం పై అడిగిన ప్రశ్నకు సమాధానంగా ఇషాన్ స్పందిస్తూ నాకు .. జాన్వికి మధ్య ఏమి లేదు? అని చెప్పకుండా మా మధ్య ప్రేమా.. స్నేహమా అన్న విషయం పై క్లారిటీ లేదు .. అన్నట్టుగా సమాధానం ఇచ్చాడు ఇషాన్. నేను ప్రస్తుతం రిలేషన్ షిప్ లో ఉన్నాను .. అదికూడా కాఫీతో అంటూ జవాబు చెప్పాడు ఇషాన్ ? అంటే కాఫీతో రిలేషన్ లో ఉన్నాను అంటే దాని అర్థం ఏమిటని అడిగితె మాత్రం ఎలాంటి సమాధానం ఇవ్వలేదు.
మా ఇద్దరి మధ్య ప్రేమాయణం ఉందన్న విషయం చెప్పకుండా ఇలా సస్పెన్స్ లో పెట్టేసాడు ఇషాన్. ఈ వ్యవహారం పై గతంలో జాన్వీ కూడా స్పందిస్తూ నాకు ఇషాన్ కు మధ్య ఎలాంటి రిలేషన్ లేదని చెప్పింది. మొత్తానికి ఇద్దరి సమాధానాలు విన్న తరువాత .. ఈ వ్యవహారంలో కావాలనే అసలు విషయాన్నీ దాచిపెడుతున్నారన్న విషయం అర్థం అవుతుంది.