ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని నటించిన లేటెస్ట్ చిత్రం రెడ్. ఈ సినిమా షూటింగ్ ఎప్పుడో పూర్తయింది. ఏప్రిల్ లోనే విడుదల కావాల్సిన ఈ సినిమా కరోనా కారణంగా విడుదలకు నోచుకోలేదు. ప్రస్తుతం థియేటర్లు తిరిగి ప్రారంభమైన నేపథ్యంలో ఇటీవలే రామ్ రెడ్ సంక్రాంతికి విడుదల కానుందని చెప్పి ట్రైలర్ కూడా రిలీజ్ చేశారు.
తాజాగా ఈ సినిమా సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకొని సెన్సార్ బోర్డు నుంచి ‘యు/ఏ’ సర్టిఫికెట్ అందుకుంది. అలాగే రెడ్ సినిమాని సంక్రాంతి కానుకగా జనవరి 14న రిలీజ్ చేయనున్నట్లు డేట్ ను కూడా అనౌన్స్ చేసారు. స్మార్ట్ శంకర్ విజయం తర్వాత రామ్ ద్విపాత్రాభినయం పోషించిన రెడ్ సినిమాను కిషోర్ తిరుమల డైరెక్ట్ చేసాడు. మాళవిక శర్మ, నివేత పేతురాజ్ హీరోయిన్స్ గా నటించగా, మణిశర్మ సంగీతం అందించాడు. ఇప్పటికే రెడ్ లోని రెండు పాటలకు మంచి రెస్పాన్స్ వచ్చింది. మరి రెడ్ అంచనాలను ఏమాత్రం అందుకుంటుంది అన్నది ఆసక్తికరంగా మారింది.
14th JAN,2021!!!
Chaaaaaallaaa rojulayindi manam kalisi!
Eesaari Manta Maamulga Ledhu! 🔥
Love..#RAPO #REDonJan14th #RedTheFilm pic.twitter.com/smBf8TMUt9
— RAm POthineni (@ramsayz) December 26, 2020
254738 122576I discovered your weblog post web internet site on the search engines and appearance several of your early posts. Always sustain the top notch operate. I additional the Feed to my MSN News Reader. Seeking forward to reading a lot a lot more on your part down the line! 267542
59952 550805Some truly amazing articles on this site , appreciate it for contribution. 819728