Switch to English

రఘురామా.. జగన్‌ సర్కార్‌పై ఈ డిమాండ్‌ సబబేనా.!

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,421FansLike
57,764FollowersFollow

యువజన శ్రామిక రైతు కాంగ్రెస్‌ పార్టీ లోక్‌సభ సభ్యుడు రఘురామకృష్ణరాజు సొంత పార్టీకే కొరకరాని కొయ్యిలా తయారయ్యారు. ‘మా ముఖ్యమంత్రి మీద నాకు చాలా చాలా ప్రేమాభిమానాలు వున్నాయి..’ అంటూనే, వైఎస్‌ జగన్‌ ప్రభుత్వంపై ఎప్పటికప్పుడు సంచలన విమర్శలు చేస్తూనే వున్నారు. ఇటీవల మరణించిన టీడీపీ నేత కిషోర్‌ విషయమై రఘురామ చూపుతున్న అత్యుత్సాహం అంతా ఇంతా కాదు. దీన్ని ప్రభుత్వ హత్యగా ఆయన అభివర్ణిస్తున్నారు.

‘తూర్పుగోదావరి జిల్లాలో దళిత యువకుడిపై పోలీసులు నీఛంగా వ్యవహరిస్తే మా ముఖ్యమంత్రిగారు కఠిన చర్యలు తీసుకున్నారు.. గుంటూరు జిల్లాలో ఓ దళిత యువకుడి మరణానికి కారణమైన పోలీసులపై మా ప్రభుత్వం చర్యలు తీసుకుంది. మరి, కిషోర్‌ విషయంలో అధికారులపై ఎందుకు చర్యలు తీసుకోకూడదు.? కరోనా క్యాపిటల్‌గా వున్న సమయంలో కర్నూలుకి ఆయన్ని తరలించి, కరోనా రోగుల మధ్య వుంచడం పోలీసుల తప్పిదమే. ఈ తప్పిదానికి పాల్పడిన పోలీసులపై కఠినమైన చర్యలు తీసుకోవాల్సిందే.. మా ప్రభుత్వం ఆ చర్యలు తీసుకుంటుందని ఆశిస్తున్నాను’ అంటూ తాజాగా ఓ ఇంటర్వ్యూలో రఘురామకృష్ణంరాజు చెప్పుకొచ్చారు.

సోషల్‌ మీడియాలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోస్టింగ్స్‌ పెట్టాడన్నది కిషోర్‌పై ఆరోపణ. పోలీసులు అరెస్ట్‌ చేశారు.. కర్నూలుకి తరలించి మెజిస్ట్రేట్‌ ముందు హాజరు పరిచారు. ఈ క్రమంలో ఆయనకు కరోనా సోకినట్లు ప్రచారం జరుగుతోంది. ఈ విషయమై అధికారుల్ని సస్పెండ్‌ చేయాలని రఘురామ డిమాండ్‌ చేయడం భావ్యమేనా.? అన్న ప్రశ్న సర్వత్రా ఉత్పన్నమవుతోంది. ఇదిలా వుంటే, మంత్రి అవంతి శ్రీనివాస్‌ తనపై చేసిన ఆరోపణల్ని తిప్పికొట్టారు రఘురామ. ‘నా రాజీనామా గొడవ ఆయనకెందుకు.? ఆయన ఇప్పటికే చాలా పార్టీలు మారారు. ప్రజారాజ్యం, టీడీపీ.. ఇప్పుడు వైసీపీ.. ఆయనకి నన్ను విమర్శించే నైతిక హక్కు లేదు..’ అని రఘురామ ఎద్దేవా చేశారు.

‘మూడు రాజధానులకు నేను వ్యతిరేకం కాదు. కానీ, అమరావతిని ఎగ్జిక్యూటివ్‌ క్యాపిటల్‌గా చెయ్యాలి. మీరంటే ప్రత్యేక విమానాల్లో తిరుగుతారు.. మీకు నచ్చినవారికి ప్రత్యేక విమానాలు సమకూరుస్తారు.. ప్రజలందరికీ ప్రత్యేక విమానాలు వుండవు కదా..’ అంటూ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌పైనే సెటైర్లు వేశారు నర్సాపురం ఎంపీ. ‘నాపై అనర్హత వేటు వేయాలన్న మా పార్టీ పెద్దల కోరిక నెరవేరదు. అందుకే, మంత్రులు ఇతర ముఖ్య నేతలు నా మీద అడ్డగోలు విమర్శలు చేస్తున్నారు..’ అంటూ రఘురామకృష్ణ తనదైన స్టయిల్లో విరుచుకుపడ్డారు.

2 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Jr.Ntr Birthday special: టెక్నీషియన్స్ ఫేవరెట్.. జూ.ఎన్టీఆర్..! ఉదాహరణలివే..

Jr.Ntr Birthday special: తెలుగు సినీ పరిశ్రమలో ఘనమైన కుటుంబ నేపథ్యం ఉన్న కుటుంబాల్లో ఒకటి నందమూరి. విశ్వవిఖ్యాత నట సార్వభౌమ ఎన్టీఆర్ మనవడిగా.. హరికృష్ణ...

చిరంజీవి, కమల్ హాసన్.! ఎవరు గొప్ప నటుడు.?

సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్ వార్స్, ట్రోలింగ్.. ఇవేవీ లేకపోతే, చాలామంది అనాధలైపోతారు.! అనాధలైపోవడమంటే, ఎవరూ పట్టించుకోకుండా పోతారని అర్థం. ఈ లిస్టులో కొందరు సెలబ్రిటీలనబడేవారు...

Prabhas: ప్రభాస్ చెప్పిన బుజ్జి ఇదే.. ఉత్కంఠ రేకెత్తిస్తున్న వీడియో

Prabhas: స్టార్ హీరో ప్రభాస్ (Prabhas) ఇటివల ‘హాయ్.. డార్లింగ్స్. నా లైఫ్ లోకి కొత్తగా ఒకరు వస్తున్నారు. వెయిట్ చేయండి’ అనే పోస్ట్ బాగా...

SSMB 29: మహేశ్-రాజమౌళి సినిమాలో మరో స్టార్ హీరో..! నిజమెంత..!?

SSMB 29: సూపర్ స్టార్ మహేశ్ (Mahesh) – రాజమౌళి (Rajamouli) కాంబినేషన్లో ఓ భారీ సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. సినిమా ప్రకటించినప్పటి నుంచీ...

Silk Saree: మే24న వస్తున్న రొమాంటిక్ లవ్ స్టోరీ.. ‘సిల్క్ శారీ’

Silk Saree: వాసుదేవ్ రావు, రీవా చౌదరి, ప్రీతి గోస్వామి హీరో హీరోయిన్లుగా టి. నాగేందర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా "సిల్క్ శారీ" (Silk Saree)....

రాజకీయం

కాంగ్రెస్ గెలవాలని వైసీపీ కోరుకుంటోందా.?

రాజకీయాల్లో శాశ్వత శతృవులు శాశ్వత మిత్రులు ఎవరూ వుండరన్నది అందరికీ తెలిసిన విషయమే.! ఆ సూత్రాన్ని వైసీపీ కూడా పాటించక తప్పేలా లేదా.? అంటే, ఔననే వాదన వినిపిస్తోందిప్పుడు.! అసలు విషయమేంటంటే, ఆంధ్ర ప్రదేశ్...

జనసేన మీద వైసీపీ నేతలు బెట్టింగ్ కాస్తున్నారా.?

ఇదో ఇంట్రెస్టింగ్ పరిణామం.! అదీ, ఉభయ గోదావరి జిల్లాల్లో చోటు చేసుకుంటున్న వైపరీత్యం.! జనసేన పార్టీ గెలుస్తుందని వైసీపీ నేత ఒకరు భారీ స్థాయిలో డబ్బులు పందెం కాశారట. వేలల్లో అయితే వింతేమీ...

నాగబాబు ఈజ్ బ్యాక్.! ట్వీటుని తొలగించిన వైనం.!

సినీ నటుడు, జనసేన నేత కొణిదెల నాగబాబు ట్విట్టర్ అకౌంట్ నుంచి ఓ ట్వీటు పడింది. ‘మాతో వుంటూ ప్రత్యర్థులకి పని చేసేవాడు మా వాడైనా పరాయివాడే, మాతో నిలబడేవాడు పరాయివాడైనా మావాడే..’...

ఐదేళ్ళుగా సినీ పరిశ్రమను దోచేశాం: వైసీపీ అను‘కుల’ మీడియా.!

ఐదేళ్ళపాటు అధికారంలో వున్నాం.. అందినకాడికి సినీ పరిశ్రమని అడ్డగోలుగా దోచేసుకున్నాం.! ఇదీ వైసీపీ అను‘కుల’ మీడియా చెబుతున్నమాట.! ఆంధ్ర ప్రదేశ్‌లో ఐదేళ్ళపాటు అధికారం వెలగబెట్టిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, తన చెప్పు చేతల్లో...

గ్రౌండ్ రిపోర్ట్: సంక్షేమ పథకాలు ఓట్లను రాల్చుతాయా.?

ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌కి ముందూ, పోలింగ్ తర్వాతా.. అధికార వైసీపీ, ‘సంక్షేమ పథకాలే మమ్మల్ని గెలిపిస్తాయ్..’ అని చెబుతుండడం చూస్తున్నాం. సంక్షేమం పేరుతో ఓటు బ్యాంకు రాజకీయాలు చేయడం అనేది...

ఎక్కువ చదివినవి

Allu Arjun : ‘పుష్ప 2’ లో కీలక రీప్లేస్‌మెంట్‌…!

Allu Arjun : అల్లు అర్జున్‌ హీరోగా సుకుమార్‌ దర్శకత్వంలో రూపొందుతున్న పుష్ప 2 పై అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి. ఆగస్టు లో సినిమా విడుదల అవ్వబోతున్న విషయం తెల్సిందే. విడుదల...

కింగ్ మేకర్ జనసేనాని పవన్ కళ్యాణ్.!

పోలింగ్ ముగిసింది.. కౌంటింగ్ కోసం రాష్ట్రం ఎదురుచూస్తోంది.! ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికలకు సంబంధించి ప్రజా తీర్పు, ఈవీఎంలలో నిక్షిప్తమైంది. జూన్ 4న లెక్కలు తేలతాయ్.! ఈలోగా రకరకాల అంచనాలు.. ఫలానా...

వైసీపీ కొంప ముంచేసిన ‘నాడు – నేడు’.!

రాష్ట్ర వ్యాప్తంగా ‘నాడు - నేడు’ కార్యక్రమం ద్వారా ప్రభుత్వ స్కూళ్ళలో అత్యద్భుతమైన అభివృద్ధి చూపించామని వైసీపీ అధినేత, ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చెబుతూ వచ్చారు. వైసీపీ...

PM Modi: ‘మీరు చెప్పింది నిజమే..’ రష్మిక పోస్టుకు ప్రధాని మోదీ స్పందన..

PM Modi: ముంబైలో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన ‘ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్’ (MTHL)పై నటి రష్మిక (Rashmika) ప్రయాణించి సోషల్ మీడియాలో తన అనుభూతిని పంచుకున్నారు. దీనిపై ప్రధాని మోదీ (PM Modi)...

జనసేన మీద వైసీపీ నేతలు బెట్టింగ్ కాస్తున్నారా.?

ఇదో ఇంట్రెస్టింగ్ పరిణామం.! అదీ, ఉభయ గోదావరి జిల్లాల్లో చోటు చేసుకుంటున్న వైపరీత్యం.! జనసేన పార్టీ గెలుస్తుందని వైసీపీ నేత ఒకరు భారీ స్థాయిలో డబ్బులు పందెం కాశారట. వేలల్లో అయితే వింతేమీ...