Switch to English

ఔనా.? రఘురామ చుట్టూ అంత పెద్ద కుట్ర జరిగిందా.?

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,429FansLike
57,764FollowersFollow

తగ్గేదే లేదంటున్నారు వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణరాజు. నడవడానికి వీల్లేని పరిస్థితుల్లో వున్నా.. బెయిల్ షరతులతో నోరు కుట్టేసుకోవాల్సి వచ్చినా.. రఘురామ తన పని తాను చేసుకుపోతున్నారు. మీడియా ముందుకు వచ్చి మాట్లాడలేకపోతున్న రఘురామ, ప్రజా ప్రతినిథిగా.. ఓ పౌరుడిగా తనకున్న ఏ అవకాశాన్నీ వదులుకోవడంలేదు. తాజాగా, ఆర్మీ ఆసుపత్రి రిజిస్ట్రార్ మీదనే కేంద్ర రక్షణ మంత్రికి ఫిర్యాదు చేసి తనదైన ప్రత్యేకతను చాటుకున్నారు నర్సాపురం ఎంపీ.

రాజద్రోహం కేసులో అరెస్టయిన రఘురామ, ఏసీబీ కస్టడీలో వుండగానే దాడికి గురైన విషయం విదితమే. అసలు ఆ దాడి జరిగిందా.? లేదా.? అన్నదానిపై భిన్నవాదనలున్నాయిగానీ, ఆయన శరీరమ్మీద గాయాల్ని మాత్రం న్యాయస్థానాలు గుర్తించాయి. ఈ నేపథ్యంలోనే ఆయనకు సికింద్రాబాద్ ఆర్మీ ఆసుపత్రిలో వైద్య చికిత్స అందాల్సిందిగా సర్వోన్నత న్యాయస్థానం ఆదేశించింది.

కొద్ది రోజులపాటు ఆర్మీ ఆసుపత్రిలో చికిత్స పొందిన రఘురామ, మరికొన్ని రోజులు అక్కడే చికిత్స పొందాలనుకున్నారు. కానీ, ఇంతలోనే ఏమయ్యిందో రఘురామని ఆసుపత్రి నుంచి డిశ్చార్జి చేసేశారు. ఈ వ్యవహారంపై రఘురామకి అనుమానాలున్నాయి. ఆ అనుమానాల నేపథ్యంలోనే రక్షణ శాఖ మంత్రికి రఘురామ ఫిర్యాదు చేయడం గమనార్హం. సికింద్రాబాద్ ఆర్మీ ఆసుపత్రి రిజిస్ట్రార్ కేపీ రెడ్డిపైనా, టీటీడీ జేఈఓ ధర్మారెడ్డి, గుంటూరు ఎస్పీ అమ్మిరెడ్డిపై ఫిర్యాదు చేశారు రఘురామ.

తనను కుట్ర పూరితంగా ఆర్మీ ఆసుపత్రి నుంచి డిశ్చార్జి చేశారన్నది రఘురామ ఆరోపణ. డిఫెన్స్ అకౌంట్స్ అండ్ ఆడిట్ సర్వీస్ అధికారి కూడా అయిన టీటీడీ జేఈఓ ధర్మారెడ్డి డిప్యుటేషన్ మీద తిరుపతి నుంచి హైదరాబాద్ వచ్చారనీ, ఆ తర్వాత తనకు వ్యతిరేకంగా కుట్ర నడిచిందనీ రఘురామ ఆరోపిస్తున్నారు. ఏపీ పోలీస్ విభాగానికి చెందిన 15 మందికి చెల్లించిన మెస్ బిల్లుల్ని కూడా కేంద్ర మంత్రి రాజ్ నాథ్ సింగ్ కి చేసిన ఫిర్యాదు లేఖతో రఘురామ జత చేయడం గమనార్హం.

రఘురామ చేసింది సాదా సీదా ఆరోపణ కాదు. ఓ ఎంపీ అయి వుండీ, ఆయనేదో అడ్డగోలుగా ఆరోపణలు చేస్తారని అనుకోలేం. ఒకవేళ అలా అడ్డగోలు ఆరోపణలు చేస్తే, తీవ్రమైన పరిణామాల్ని ఎదుర్కోవాల్సి వుంటుంది. ఇంతకీ, ఏం జరిగింది ఆర్మీ ఆసుపత్రిలో.? ఇదే ఇప్పుడు మిలియన్ డాలర్ల ప్రశ్న.

1 COMMENT

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Rashmika: ముంబై బ్రిడ్జి ప్రయాణంపై రష్మిక పోస్టు.. నెటిజన్స్ ట్రోలింగ్స్

Rashmika: ముంబైలో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన ‘ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్’ (MTHL)పై నేషనల్ క్రష్ రష్మిక (Rashmika) మందన ప్రయాణించి తన అనుభూతిని పంచుకున్నారు. మీడియాలో...

Allu Shirish : ఎట్టకేలకు అల్లు శిరీష్ అప్‌డేట్‌ తో వచ్చాడు

Allu Shirish : అల్లు శిరీష్ హీరోగా గాయత్రి భరద్వాజ్ హీరోయిన్‌ గా శామ్‌ ఆంటోనీ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం 'బడ్డీ'. స్టూడియో గ్రీన్ ఫిలింస్...

Telangana: తెలంగాణలో 2వారాలపాటు సినిమాలు బంద్..! కారణాలివే..

Telangana: ప్రస్తుత రోజుల్లో ధియేటర్లలో సినిమా నడవడమే కష్టమవుతోంది. బాగున్న సినిమా.. పెద్ద సినిమా.. చిన్న సినిమాగా లెక్కలు మారిపోయాయి. విడుదలైన కొద్దిరోజుల్లోనే ఓటీటీల్లో రావడం.....

‘రామ జన్మభూమి’ తో సీనియర్‌ స్టార్‌ డైరెక్టర్‌ రీ ఎంట్రీ

సినీ ప్రేక్షకులకు ఎన్నో సూపర్‌ హిట్ సినిమాలను అందించిన సీనియర్ దర్శకుడు సముద్ర ఈ మధ్య కాలంలో సినిమాలకు కాస్త దూరంగా ఉంటున్నారు. ఆయన నుంచి...

Chiranjeevi : అసెంబ్లీలో వాళ్ల భాష విని షాక్ అయ్యాను :...

Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవి అత్యున్నత పురస్కారం పద్మవిభూషణ్‌ అందుకున్న నేపథ్యంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. చిరంజీవిని సన్మానించిన కిషన్ రెడ్డి...

రాజకీయం

బాబూ.. రాంబాబూ.! రీపోలింగ్ కావాలా.?

మంత్రి అంబటి రాంబాబుకి రీ-పోలింగ్ కావాలట.! ఎంత కష్టమొచ్చింది.? రీ-పోలింగ్ అడుగుతున్నారంటే, ఓటమిని ముందే ఒప్పుకున్నట్లు కదా.? పోలింగ్ సరళి చూశాక ‘సంబరాల’ రాంబాబుకి మైండ్ బ్లాంక్ అయ్యిందని, సత్తెనపల్లి నియోజకవర్గ ప్రజలే...

కింగ్ మేకర్ జనసేనాని పవన్ కళ్యాణ్.!

పోలింగ్ ముగిసింది.. కౌంటింగ్ కోసం రాష్ట్రం ఎదురుచూస్తోంది.! ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికలకు సంబంధించి ప్రజా తీర్పు, ఈవీఎంలలో నిక్షిప్తమైంది. జూన్ 4న లెక్కలు తేలతాయ్.! ఈలోగా రకరకాల అంచనాలు.. ఫలానా...

వైసీపీ కొంప ముంచేసిన ‘నాడు – నేడు’.!

రాష్ట్ర వ్యాప్తంగా ‘నాడు - నేడు’ కార్యక్రమం ద్వారా ప్రభుత్వ స్కూళ్ళలో అత్యద్భుతమైన అభివృద్ధి చూపించామని వైసీపీ అధినేత, ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చెబుతూ వచ్చారు. వైసీపీ...

ఎమ్మెల్యే చెంప పగలగొట్టిన సామాన్యుడికి ‘కులాన్ని’ ఆపాదిస్తారా.?

ఎమ్మెల్యేని ఓ సామాన్యుడు దూషించాడట.! దాంతో, ఎమ్మెల్యేకి కోపమొచ్చిందట. అయినాగానీ, శాంతంగానే వున్నాడట ఆయన. సదరు సామాన్యుడే, కులోన్మాదంతో సదరు ఎమ్మెల్యే చెంప పగలగొట్టేశాడట. తీవ్రంగా దాడి చేశాడట. దాడిలో గాయపడి ఆసుపత్రి పాలయ్యింది...

పాపం రోజా.! ఓటమి ఖాయమైనట్టే కనిపిస్తోంది.!

అంతా అనుకున్నట్టే జరుగుతోంది. రోజా భయపడ్డట్టే జరుగుతోంది నగిరిలో.! రోజాకి శతృవులు టీడీపీలోనో, ఇంకో పార్టీలోనో లేరు.. సాక్షాత్తూ సొంత పార్టీలోనే రోజాకి శతృవులున్నారన్న విషయం ఇంకోసారి స్పష్టమైంది. ‘నాకు టీడీపీతో ఇబ్బంది లేదు.....

ఎక్కువ చదివినవి

వైసీపీ ఇస్తే తీసుకుంటాం.! ఓటు మాత్రం కూటమికే వేస్తాం.!

‘ఈ రోజుల్లో రాజకీయ నాయకుల్ని నమ్మడానికి వీల్లేదు. ఆ పార్టీ నుంచి గెలిచి, ఈ పార్టీలోకి దూకేస్తారు. పూటకో పార్టీ మార్చేస్తారు..’ అని జనం చర్చించుకోవడం చూస్తున్నాం. మరి, ఆ జనం గురించి...

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్: వైసీపీకి చావు దెబ్బే.!

‘ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ వల్ల ఇప్పటికే కొంతమందికి రిజిస్ట్రేషన్ పత్రాలు అందాయి..’ అని వైసీపీ చెబుతోంది. ఈ మేరకు, కొంతమంది మీడియా ముందుకొచ్చి, ఆ పత్రాల్ని చూపిస్తున్నారు కూడా.! అదే సమయంలో, ‘ఇంకా...

బాబూ.. రాంబాబూ.! రీపోలింగ్ కావాలా.?

మంత్రి అంబటి రాంబాబుకి రీ-పోలింగ్ కావాలట.! ఎంత కష్టమొచ్చింది.? రీ-పోలింగ్ అడుగుతున్నారంటే, ఓటమిని ముందే ఒప్పుకున్నట్లు కదా.? పోలింగ్ సరళి చూశాక ‘సంబరాల’ రాంబాబుకి మైండ్ బ్లాంక్ అయ్యిందని, సత్తెనపల్లి నియోజకవర్గ ప్రజలే...

బర్త్ డే స్పెషల్ : రౌడీ స్టార్‌ టు ఫ్యామిలీ స్టార్‌

2012 లో వచ్చిన లైఫ్‌ ఈజ్‌ బ్యూటిఫుల్‌ సినిమాలో చిన్న పాత్రలో కనిపించిన విజయ్ దేవరకొండ 2015 లో మొదటి సారి మెయిన్ లీడ్‌ రోల్‌ ను ఎవడే సుబ్రహ్మణ్యంలో చేశాడు. ఆ...

పాపం రోజా.! ఓటమి ఖాయమైనట్టే కనిపిస్తోంది.!

అంతా అనుకున్నట్టే జరుగుతోంది. రోజా భయపడ్డట్టే జరుగుతోంది నగిరిలో.! రోజాకి శతృవులు టీడీపీలోనో, ఇంకో పార్టీలోనో లేరు.. సాక్షాత్తూ సొంత పార్టీలోనే రోజాకి శతృవులున్నారన్న విషయం ఇంకోసారి స్పష్టమైంది. ‘నాకు టీడీపీతో ఇబ్బంది లేదు.....