Switch to English

సినిమా ధియేటర్ల గొప్పదనంపై వీడియో.. భావోద్వేగమైన పూరి జగన్నాధ్

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,422FansLike
57,764FollowersFollow

‘ధియేటర్లోనే సినిమా చూడండి..’ సినీ పరిశ్రమకు చెందిన ప్రతిఒక్కరూ చెప్పే మాట. ఈ మాట కేవలం పైరసీని అరికట్టడానికే కాదు.. సినిమాను ధియేటర్ ఎక్సపీరియన్స్ లో చూడమని ఆ మాట ఉద్దేశం. కానీ.. పైరసీతో సెల్ ఫోన్లలో.. ల్యాప్ టాప్స్, కంప్యూటర్స్ లో సినిమాలు చూడటం ఎవరూ మానలేదు. ఇది కరోనాకు ముందు సంగతి. కరోనా వచ్చాక కొత్త సినిమాలు లేవు, ధియేటర్లు లేవు. పైరసీ చూసే వారికకే కాదు ధియేటర్లలో సినిమా చూసే వారికి కూడా ఈ శిక్ష తప్పలేదు. ఇళ్లలోనే ఉండి సినిమాలు చూడాల్సి వస్తోంది. ఇప్పుడు ధియేటర్ ఎక్స్ పీరియన్స్ కోసం అందరూ తహతహలాడుతున్నా ఆలోచిస్తున్నారు.

దీంతో కన్నడ చిత్ర సీమ ఒక ఐడియాతో వచ్చింది. ధియేటర్ గొప్పదనం, ప్రేక్షకుల ఆనందం, టికెట్ కౌంటర్లు, తెరపై సినిమా, ప్రేక్షకులు ధియటర్లకు రావడం, కొత్త సినిమాకు అభిమానుల కేరింతలు, కటౌట్లు, బ్యానర్లు, ఈలలు, గోల, హౌస్ ఫుల్ బోర్డుతో గతంలో కళకళలాడిన ధియేటర్ల వెలుగును ఎంతో భావోద్వేగంగా తెరకెక్కించి ఓ రెండున్నర నిముషాల వీడియో చిత్రీకరించారు. ఈ వీడియో చూసిన ఎవరికైనా.. మళ్లీ ధియేటర్లకు ఎప్పుడెప్పుడు వెళ్దామా అనిపించే రీతిలో తెరకెక్కించారు.

ఈ వీడియోను డాషింగ్ డైరక్టర్ పూరి జగన్నాధ్ షేర్ చేసారు. ఈ వీడియో అనుభవాన్ని వివరిస్తూ చేసిన ట్వీట్ ప్రతిఒక్కరినీ కదలించి వేస్తోంది. ‘ఈ వీడియో చూస్తే కన్నీళ్లు ఆగడం లేదు. మళ్లీ ఆ రోజులు రావాలి. విజిల్స్ వేయాలి. పేపర్స్ ఎగరాలి. చొక్కాలు చిరగాలి. సినిమా ధియేటర్.. మన అమ్మ’ అంటూ పూరి భావోద్వేగానికి గురయ్యారు. ఒకప్పటి ధియేటర్ల హంగామాను వీడియోలో, పూరి మెసేజ్ లో ఉందని చెప్పాలి.

ఈ వీడియోలో ధియేటర్ గేట్ తాళాలు తెరవడం, దుమ్ము, రాలిన ఆకులతో నిండిన ఆవరణను తుడవడం, పోస్టర్ వాల్ శుభ్రం చేయడం, మేనేజర్ ధియేటర్ వైపు ఆశగా చూడటం, సీట్లను తాకడం, టికెట్ కౌంటర్, ప్రేక్షకుడు శానిటైజర్ రాసుకోవడం, ప్రేక్షకులు రావడం, హౌస్ ఫుల్ అవడంతో బోర్డు పెట్టడం.. వంటి సన్నివేశాలను తీశారు. కంటతడి పెట్టిస్తున్న ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట్లో వైరల్ గా మారింది. కన్నడ లాంగ్వేజ్ లో తీసిన ఈ వీడియోను ఇంగ్లీష్ సబ్ టైటిల్స్ కూడా వేశారు.

కన్నడ స్టార్ హీరో పునీత్ రాజ్ కుమార్ తోసహా పలువురు నటీనటులు తమ సందేశం వినిపించారు. ‘నటీనటుల ఆశలు, దర్శకుడి తెలివి, నిర్మాత పెట్టుబడి, నటీనటుల జీవితం, టెక్నీషియన్ల కష్టం.. ఉన్నదే సినిమా. మీ వినోదం కోసమే మా కష్టమంతా. మీ కేరింతలే మాకు ఉత్సాహం. అటువంటి సినిమాను ప్రోత్సహించండి. ధియేటర్లకు రండి’ అంటూ పలువురు నటులు, టెక్నీషియన్లు చెప్పిన సందేశాలతో ఈ వీడియో ఉంది. ఇటువంటి క్రియేటివిటీ ఐడియా రావడం చాలా గ్రేట్ అని చెప్పాలి. ప్రేక్షకులకు ఈ రెండున్నర నిముషాల వీడియో గూస్ బంప్స్ ఇస్తోందంటే అతిశయోక్తి కాదు. మళ్లీ ఆ రోజులు రావాలనే కోరుకుందాం.

4 COMMENTS

  1. 484677 91760Youre so cool! I dont suppose Ive learn something like this before. So nice to search out any person with some distinctive thoughts on this subject. realy thank you for starting this up. this internet internet site is 1 thing thats necessary on the net, someone with a bit of originality. beneficial job for bringing something new towards the internet! 136607

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Silk Saree: మే24న వస్తున్న రొమాంటిక్ లవ్ స్టోరీ.. ‘సిల్క్ శారీ’

Silk Saree: వాసుదేవ్ రావు, రీవా చౌదరి, ప్రీతి గోస్వామి హీరో హీరోయిన్లుగా టి. నాగేందర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా "సిల్క్ శారీ" (Silk Saree)....

Jr Ntr: స్థల వివాదంలో జూ.ఎన్టీఆర్..! వార్తలపై క్లారిటీ ఇచ్చిన హీరో...

Jr Ntr: ఓ స్థలం వివాదం విషయమై హీరో ఎన్టీఆర్ హైకోర్టుని ఆశ్రయించారంటూ సోషల్ మీడియాలో ఈరోజు పలు వార్తలు హల్ చల్ చేశాయి. అయితే.....

Prabhas: ఎవరా కొత్త వ్యక్తి..? సెన్సేషన్ క్రియేట్ చేస్తోన్న ప్రభాస్ పోస్ట్

Prabhas: చాలా తక్కువగా సోషల్ మీడియాలో యాక్టివ్ అయ్యే స్టార్ హీరో ప్రభాస్ చేసిన ఇన్ స్టా పోస్ట్ ప్రస్తుతం నెట్టింట విపరీతంగా వైరల్ అవుతోంది....

నాగబాబు ట్విట్టర్ హ్యాండిల్ మాయం.! అల్లు అర్జున్ ఆర్మీ ఎఫెక్టేనా.?

బాబోయ్ బూతులు.. ఇవి మామూలు బూతులు కావు.! బండ బూతులు.! సినీ అభిమానులంటే, అత్యంత జుగుప్సాకరంగా ప్రవర్తించాలా.? సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్ వార్స్ చేసుకోవడం...

Indian 2 : మరో ఇండియన్‌ సర్‌ప్రైజ్‌ చేయనున్నాడా?

Indian 2 : యూనివర్శిల్‌ స్టార్‌ కమల్‌ హాసన్‌ హీరోగా శంకర్ దర్శకత్వంలో వచ్చిన భారతీయుడు సినిమాకు సీక్వెల్‌ రూపొందుతుంది. పాన్ ఇండియా రేంజ్ లో...

రాజకీయం

నాగబాబు ఈజ్ బ్యాక్.! ట్వీటుని తొలగించిన వైనం.!

సినీ నటుడు, జనసేన నేత కొణిదెల నాగబాబు ట్విట్టర్ అకౌంట్ నుంచి ఓ ట్వీటు పడింది. ‘మాతో వుంటూ ప్రత్యర్థులకి పని చేసేవాడు మా వాడైనా పరాయివాడే, మాతో నిలబడేవాడు పరాయివాడైనా మావాడే..’...

ఐదేళ్ళుగా సినీ పరిశ్రమను దోచేశాం: వైసీపీ అను‘కుల’ మీడియా.!

ఐదేళ్ళపాటు అధికారంలో వున్నాం.. అందినకాడికి సినీ పరిశ్రమని అడ్డగోలుగా దోచేసుకున్నాం.! ఇదీ వైసీపీ అను‘కుల’ మీడియా చెబుతున్నమాట.! ఆంధ్ర ప్రదేశ్‌లో ఐదేళ్ళపాటు అధికారం వెలగబెట్టిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, తన చెప్పు చేతల్లో...

గ్రౌండ్ రిపోర్ట్: సంక్షేమ పథకాలు ఓట్లను రాల్చుతాయా.?

ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌కి ముందూ, పోలింగ్ తర్వాతా.. అధికార వైసీపీ, ‘సంక్షేమ పథకాలే మమ్మల్ని గెలిపిస్తాయ్..’ అని చెబుతుండడం చూస్తున్నాం. సంక్షేమం పేరుతో ఓటు బ్యాంకు రాజకీయాలు చేయడం అనేది...

PM Modi: ‘మీరు చెప్పింది నిజమే..’ రష్మిక పోస్టుకు ప్రధాని మోదీ స్పందన..

PM Modi: ముంబైలో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన ‘ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్’ (MTHL)పై నటి రష్మిక (Rashmika) ప్రయాణించి సోషల్ మీడియాలో తన అనుభూతిని పంచుకున్నారు. దీనిపై ప్రధాని మోదీ (PM Modi)...

జగన్ ధీమా సరే.! వైసీపీ దాడుల సంగతేంటి.?

గెలిచే పార్టీ అయితే, తమ ప్రతిష్టను తామే దిగజార్చుకోవాలని అనుకుంటుందా.? రాష్ట్ర వ్యాప్తంగా అల్లర్లకు తెగబడుతుందా.? రాష్ట్రంలో ఎన్నికల పోలింగ్ అనంతరం చోటు చేసుకుంటున్న ఘర్షణలపై ఎవరికైనా సహజంగా కలిగే అనుమానమే ఇది. పల్నాడులో...

ఎక్కువ చదివినవి

బాబూ.. రాంబాబూ.! రీపోలింగ్ కావాలా.?

మంత్రి అంబటి రాంబాబుకి రీ-పోలింగ్ కావాలట.! ఎంత కష్టమొచ్చింది.? రీ-పోలింగ్ అడుగుతున్నారంటే, ఓటమిని ముందే ఒప్పుకున్నట్లు కదా.? పోలింగ్ సరళి చూశాక ‘సంబరాల’ రాంబాబుకి మైండ్ బ్లాంక్ అయ్యిందని, సత్తెనపల్లి నియోజకవర్గ ప్రజలే...

Kajal : ఎన్టీఆర్‌ పై అభిమానంతో అది చేశా..!

Kajal : టాలీవుడ్‌ చందమామ కాజల్ అగర్వాల్‌ పెళ్లి తర్వాత కాస్త స్లో అయ్యింది. తల్లి అయ్యాక సినిమాలకు గ్యాప్‌ ఇచ్చింది. ఇప్పుడు మళ్లీ సినిమాలతో బిజీ అయ్యేందుకు కాజల్‌ ప్రయత్నాలు చేస్తుంది....

కింగ్ మేకర్ జనసేనాని పవన్ కళ్యాణ్.!

పోలింగ్ ముగిసింది.. కౌంటింగ్ కోసం రాష్ట్రం ఎదురుచూస్తోంది.! ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికలకు సంబంధించి ప్రజా తీర్పు, ఈవీఎంలలో నిక్షిప్తమైంది. జూన్ 4న లెక్కలు తేలతాయ్.! ఈలోగా రకరకాల అంచనాలు.. ఫలానా...

ఎమ్మెల్యే చెంప పగలగొట్టిన సామాన్యుడికి ‘కులాన్ని’ ఆపాదిస్తారా.?

ఎమ్మెల్యేని ఓ సామాన్యుడు దూషించాడట.! దాంతో, ఎమ్మెల్యేకి కోపమొచ్చిందట. అయినాగానీ, శాంతంగానే వున్నాడట ఆయన. సదరు సామాన్యుడే, కులోన్మాదంతో సదరు ఎమ్మెల్యే చెంప పగలగొట్టేశాడట. తీవ్రంగా దాడి చేశాడట. దాడిలో గాయపడి ఆసుపత్రి పాలయ్యింది...

జగన్ ప్రజల్ని బిచ్చగాళ్ళలా చూశారా.? ప్రశాంత్ కిషోర్ ఉవాచ ఇదేనా.?

ప్రజాధనాన్ని అభివృద్ధి కోసం వినియోగించకుండా, సంక్షేమ పథకాల పేరుతో సొంత పబ్లిసిటీ చేసుకోవడానికి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వినియోగించారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు 2019 ఎన్నికల్లో వైసీపీ విజయం కోసం పని...