Priyanka Chopra: స్టార్ హీరోయిన్ రష్మిక మందన (Rashmika mandana) డీప్ ఫేక్ (Deep fake) వీడియో ఇటివల వైరల్ అయిన సంగతి తెలిసిందే. దేశం మొత్తం షాక్ కు గురవగా ఏకంగా ప్రభుత్వం వీటి కట్టడికి చర్యలు తీసుకుంటోంది. ఈక్రమంలో బాలీవుడ్ (Bollywood) స్టార్ హీరోయిన్ ప్రియాంక చోప్రా (Priyanka Chopra) కు సంబంధించిన డీప్ ఫేక్ వీడియో నెట్టింట్లో వైరల్ అవుతోంది.
గతంలో ప్రియాంక మాట్లాడిన ఓ వీడియోకు లిప్ సింక్ చేశారు కొందరు. ఓ నకిలీ బ్రాండ్ ను ఆమె ప్రమోట్ చేసినట్టు.. ఆ యాడ్ ద్వారా తన వార్షిక ఆదాయాన్ని ఆమె వెల్లడించినట్టు వీడియో రూపొందించారు. ఈక్రమంలో ఆ బ్రాండ్ కారణంగా 2023లో తన ఆదాయం పెరిగిందని ఆమె చెప్పినట్టుగా క్రియేట్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.
దీనిపై ప్రియాంక అభిమానులు, నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇటువంటి వీడియోలు, అబద్ధపు ప్రచారాలతో వీడియోలు సృష్టించడం దారుణమని అంటున్నారు. ఆమధ్య రష్మికకు చెందిన డీప్ ఫేక్ దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే.