మనం ఒక పనిచేసినప్పుడు .. దాని తాలూకు ఫలితం ఎలా ఉంటుందో అన్న భయాలు కలుగుతుంటాయి ..అవి సహజం .. కొన్ని సార్లు ఆ ఫలితం ఎక్కడో తేడా కొడుతుందన్న భయాలు కలుగుతుంటాయి .. మనం ఎంత పర్ఫెక్ట్ గా పని చేసినా కూడా ఇలాంటి సెన్స్ తప్పదు. సాహో సినిమా విషయంలో కూడా ప్రభాస్ సినిమా విడుదలకు ముందు చాల టెన్షన్ పడ్డాడట, అంతే కాదు బయపడ్డాడట కూడా .. !!
ఈ విషయాన్నీ అయన పెదనాన్న కృష్ణంరాజుతో చెప్పాడట. విడుదలకు ముందు ఓ రోజు తన పెదనాన్నను కలిసిన ప్రభాస్ ఈ సినిమా విషయంలో భయంగా ఉంది పెదనాన్న, సినిమాకు చాలా ఎక్కువ బడ్జెట్ పెట్టేసాము .. ఏమవుతుందో ఏమో ? అంటూ డౌట్ వ్యక్తం చేసాడట.
దానికి కృష్ణంరాజు నువ్వు అనవసరంగా భయపడుతున్నావ్ .. ఇప్పుడు నువ్వు ఇంటర్నేషనల్ స్టార్ వి .. సినిమా విషయంలో ఎలాంటి టెన్షన్ వద్దు అంటూ దైర్యం చెప్పాడట. కానీ అంచనాలను తారుమారు చేస్తూ ఇప్పుడు ప్రభాస్ భయమే నిజమైంది. సాహో అత్యంత భారీ బడ్జెట్ తో తెరకెక్కింది.
Also Read: 400 కోట్ల క్లబ్‌లో సాహో: అయినా నష్టాలు తప్పవ్
ఒక్క తెలుగులోనే కాదు తమిళ, హిందీ, మలయాళ భాషల్లో కూడా విడుదలై అన్ని భాషల్లో యావరేజ్ టాక్ తెచ్చుకుంది. ఇప్పుడు వసూళ్ల పరంగా కూడా ఆశాజనకంగా లేదు పరిస్థితి. ఈ లెక్కన చూసుకుంటే .. సాహో విషయంలో భారీ నష్టం వాటిల్లే అవకాశాలు కనిపిస్తున్నాయి. మొత్తానికి బాహుబలి తో ఇంటర్నేషనల్ స్టార్ గా ఎదిగిన ప్రభాస్ కు సాహో పెద్ద టెన్షన్ పెట్టింది.
